iDreamPost
android-app
ios-app

పుష్ప 2 క్లైమాక్స్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్.. సర్ప్రైజ్ ఇదే..!

  • Published Nov 02, 2024 | 10:30 AM Updated Updated Nov 02, 2024 | 10:30 AM

పుష్ప 2 గురించి అందరూ ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాలో సర్ప్రైజ్ చేసే అంశాలు కూడా చాలానే ఉన్నాయి. దానికి సంబంధించిన విషయాలు ఇలా ఉన్నాయి.

పుష్ప 2 గురించి అందరూ ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాలో సర్ప్రైజ్ చేసే అంశాలు కూడా చాలానే ఉన్నాయి. దానికి సంబంధించిన విషయాలు ఇలా ఉన్నాయి.

  • Published Nov 02, 2024 | 10:30 AMUpdated Nov 02, 2024 | 10:30 AM
పుష్ప 2 క్లైమాక్స్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్.. సర్ప్రైజ్ ఇదే..!

పుష్ప 2 ఇప్పుడు వరల్డ్ వైడ్ గా మూవీ లవర్స్ కు ఇదే హాట్ టాపిక్. దాదాపు షూటింగ్ కూడా ఆఖరి దశకు చేరుకుంది. ఇక ట్రైలర్ , సాంగ్స్ రిలీజ్ చేయడమే బ్యాలెన్స్. అటు ప్రమోషన్స్ కు కూడా భారీగానే ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రమోషన్స్ కు పర్మిషన్స్ కష్టమనే మాట వినిపిస్తుంది. అయితే ఒకవేళ అది జరిగినా జరగకపోయినా కూడా సినిమా హైప్ కు వచ్చిన నష్టమేమీ లేదు. ఎందుకంటే తెరపై పుష్పరాజ్ ను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అంతా ఎదురుచూస్తున్నారు. సుకుమార్ పార్ట్ 2 కథను ఎలా డిసైన్ చేశాడా.. బన్నీని ఎలా చూపించబోతున్నాడా అని అందరూ వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. అయితే పార్ట్ 2 మీద ఇంత హైప్ పెరగడానికి కారణం పార్ట్1 ఎండ్ లో చూపించిన క్లైమాక్స్ సీన్. ఎప్పుడో వచ్చిన బాహుబలి దగ్గర నుంచి మొన్న వచ్చిన దేవర వరకు.. ఆ సినిమాలలో ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకున్నది క్లైమాక్స్ సీన్స్ ఏ .సినిమా అంతా ఒక ఎత్తైతే ఆఖరి 10, 20 నిమిషాలు మరొక ఎత్తని చెప్పి తీరాల్సిందే.

ఈ క్రమంలోనే సుకుమార్ పుష్ప 2 క్లైమాక్స్ ను కూడా అదే రేంజ్ లో చూపించబోతున్నాడు. సినిమాలో ఐటమ్ సాంగ్ , జాతర సాంగ్ సినిమాకే హైలెట్ గా నిలుస్తుందనే టాక్ ఉంది. ఇక ఇప్పుడు క్లైమాక్స్ వేరే లెవెల్ లో ఉంటుందని సమాచారం. ఆల్రెడీ పుష్ప పార్ట్ 3 ఉంటుందని అనౌన్స్ చేశారు మేకర్స్. ఇప్పుడు పార్ట్ 2 ను.. పార్ట్ 3 కి లీడ్ ఇచ్చే విధంగా ఎండ్ చేయబోతున్నాడట దర్శకుడు. ఇందులో విశేషం ఏమి లేదు. నెక్స్ట్ పార్ట్స్ కొనసాగించాలంటే.. ఎండ్ లో ఎదో ఒక సస్పెన్స్ ను జోడించాల్సిందే. అది ఎలాంటి సర్ప్రైజ్ అనేదే మ్యాటర్. అది కాకుండా.. సినిమా ఆఖరిలో ఓ స్టార్ హీరో వాయిస్ వినిపించబోతుందట. ఆ వాయిస్ తో సినిమా ఎండ్ అవుతుందని గట్టిగా బజ్ వినిపిస్తుంది. అయితే ఆ వాయిస్ తెలుగు హీరోది కాదని అంటున్నారు. మరి ఇంకెవరై ఉంటారా అని అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. చూడబోతుంటే ప్రేక్షకులకు కిక్ ఇచ్చే మాస్ సీన్స్ తో పాటు.. సర్ప్రైజ్ చేసే ఎన్నో ఎలెమెంట్స్ ను సుకుమార్ చూపించబోతున్నట్లు తెలుస్తుంది.

ఈ సినిమాపై ఇలా రోజు రోజుకి వస్తున్న అప్డేట్స్.. ఎక్కడలేని ఎగ్సయిట్మెంట్ ను పెంచేస్తున్నాయి. ఇంకా సినిమా రిలీజ్ కు కేవలం కొద్దీ రోజులు మాత్రమే ఉంది. అటు సినిమా నుంచి రావాల్సిన అప్డేట్స్ బ్యాలన్స్ ఉన్నాయి. ఇప్పటికే మీడియా , సోషల్ మీడియాలో పుష్ప హవా మొదలైంది. ఇక క్రియేట్ చేయబోయే రికార్డ్స్ గురించి డిస్కస్ చేయడమే బ్యాలెన్స్. ఇక ఈ సినిమా తర్వాత బన్నీ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఈ సినిమా మైథలాజికల్ బ్యాక్గ్రౌండ్ లో ఉండబోతుందని.. 500 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను తీయబోతున్నారని సమాచారం. పుష్ప 2 రిలీజ్ తర్వాత అల్లు అర్జున్ ఎప్పుడు ఓకే అంటే అప్పుడు.. ఈ సినిమా పట్టాలెక్కబోతుందట. మరి ఈలోపు బన్నీ పుష్ప 2 తో ఎలాంటి సినీ సునామీని సృష్టిస్తాడో వేచి చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి .

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomjojobet girişjojobet güncel girişdeneme bonusu veren sitelerMariobetmadridbetMadridbetMadridbetcasibomgrandpashabet girişJojobetcasibomcasibomcasibomultrabetgrandpashabetultrabetgrandpashabet girişcasibombetciograndpashabet girişcasibom girişgrandpashabet girişgrandpashabetgrandpashabetholiganbet