iDreamPost
android-app
ios-app

రైతుగా దేవర.. ఈసారి మూమూలుగా ఉండదట..!

  • Published Sep 30, 2024 | 5:28 PM Updated Updated Sep 30, 2024 | 5:28 PM

దేవరతో మాసీ హిట్ అందుకున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. రూ. 300 కోట్లను కొల్లగొట్టి 500 కోెట్ల రూపాయల కలెక్షన్ల వైపుకు దూసుకెళుతున్నాడు. ఈ క్రమంలో క్రేజీ న్యూస్ హల్ చల్ చేస్తుంది.

దేవరతో మాసీ హిట్ అందుకున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. రూ. 300 కోట్లను కొల్లగొట్టి 500 కోెట్ల రూపాయల కలెక్షన్ల వైపుకు దూసుకెళుతున్నాడు. ఈ క్రమంలో క్రేజీ న్యూస్ హల్ చల్ చేస్తుంది.

  • Published Sep 30, 2024 | 5:28 PMUpdated Sep 30, 2024 | 5:28 PM
రైతుగా దేవర.. ఈసారి మూమూలుగా ఉండదట..!

దేవరతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు మ్యాన్ ఆఫ్ ది మాసెస్. దేవర కత్తి పదునుకు థియేటర్లు దద్దరిల్లాయి.. బాక్సాఫీసు షేక్ అయ్యింది. మూడు రోజుల్లో రూ. 300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టుకుంది. అక్కడితో, అంతటితోనే ఆగిపోలేదు కలెక్షన్ల ఊచకోత. ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ వారం కూడా యంగ్ టైగర్‌దే హవా.. రాసిపెట్టుకోండని అంటున్నారు ఫ్యాన్స్. ఆరేళ్ల తర్వాత సింగిల్‌గా ఫుల్ మీల్ పెట్టడంతో పండుగ చేసుకుంటూ కాలర్ ఎగరేస్తున్నారు. ఇక కొరటాల శివను వాట్ ఎ విజన్, వాట్ ఎ థాట్, పిచ్చోళ్లను చేశావ్ కదయ్యా అంటూ ప్రశంసిస్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్‌ను అయితే గుడి కట్టేయొచ్చు అంటూ పొగిడేస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్ డై హార్డ్ ఫ్యాన్స్. ఇక ఈ సినిమా హిట్టుతో తారక్ నుండి రాబోయే సినిమాపై మరింత అంచనాలు పెరిగిపోయాయి. కేజీఎఫ్, సలార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ మూవీతో తన నెక్ట్స్ ప్రాజెక్ట్ చేస్తున్నాడు యంగ్ టైగర్.

ఈ మూవీ అఫీషియల్‌గా లాంచ్ అయ్యింది. ఎన్టీఆర్ 31గా రాబోతున్న ఈ పేరు పెట్టని సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ నిర్మిస్తున్నాయి. అయితే ఈ సినిమా గురించి ఓ బజ్ విపరీతంగా సినీ సర్కిల్లో నడుస్తుంది. సినిమా బ్యాడ్రాప్ వేరో లెవల్లో ఉండబోతుందని టాక్ గట్టిగా స్ప్రెడ్ అవుతుంది. పీరియాడిక్ డ్రామాగా యాక్షన్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో తారక్ రైతుగా కనిపించబోతున్నాడని టాక్. బంగ్లాదేశ్ నేపథ్యంలో ఈ కథ సాగుతుందట.  బంగ్లాదేశ్ వెళ్లి ఓ తెలుగు యువకుడు.. అక్కడ వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తుంటాడట. ఆ తర్వాత అక్కడ జరిగిన పరిణామాలు.. స్థానికుల కోసం అతడు చేసే పోరాటం హైలెట్‌గా నిలవనున్నాయట. మ్యాన్ ఆఫ్ ది మాసెస్ టూ షేడ్స్‌లో చూపించబోతున్నాడట ప్రశాంత్ నీల్. సూపర్ ట్విస్టులు ఉండబోతున్నాయని తెలుస్తోంది. ఎన్టీఆర్ క్యారెక్టరైజేషన్ , ఫెర్మార్మెన్స్ వేరో లెవల్లో ప్లాన్ చేశాడట డైరెక్టర్.

ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న నటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే కన్ఫమ్ అయితే.. తొలిసారిగా ఈ ఇద్దరు జత కట్టబోతున్నట్లు లెక్క. మరో గోల్డెన్ ఛాన్స్ తన ఖాతాలో వేసుకున్నట్లే రష్మిక. అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కిస్తున్నారు మేకర్స్. చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా 2026 సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈ మూవీకి కూడా తన ఆస్థాన విద్వాంసులనే కంటిన్యూ చేయబోతున్నాడు నీల్ మామ. రవి బస్రూర్ మ్యూజిక్ అందిస్తుండగా.. సినిమాటోగ్రాఫర్ బాధ్యతలు భువన్ గౌడ భుజాలకు ఎత్తుకోబోతున్నాడు. త్వరలో షూటింగ్ సెట్స్ పైకి వెళ్లనుంది. దీని కన్నా ముందే తారక్ వార్ 2 షూటింగ్ కంప్లీట్ చేయనున్నాడు. నీల్- ఎన్టీఆర్ మూవీ ఎలా ఉండబోతుందని అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetHoliganbetHoliganbetartemisbetartemisbetbetsmovebetsmovexslotxslotjojobetcratosroyalbetbetparkwgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabet