iDreamPost
android-app
ios-app

ప్రముఖ గాయని ఉషా ఉతుప్‌ ఇంట తీవ్ర విషాదం!

  • Published Jul 09, 2024 | 11:06 AM Updated Updated Jul 09, 2024 | 11:06 AM

Singer Usha Uthup: సినీ ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎంతో మంది స్టార్ సింగర్స్ తమదైన గానంతో ఆకట్టుకున్నారు. 80వ దశకంలో పాప్ సాంగ్స్ ఒక ట్రెండ్ సృష్టించింది ప్రముఖ సింగర్ ఉషా ఉతుప్. ఆమె ఎన్నో వేల స్టేజ్ షోలు ఇచ్చారు. సినిమాలో ఆమె పాడిన పాటలు సూపర్ డూపర్ హిట్ గా నిలిచాయి.

Singer Usha Uthup: సినీ ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎంతో మంది స్టార్ సింగర్స్ తమదైన గానంతో ఆకట్టుకున్నారు. 80వ దశకంలో పాప్ సాంగ్స్ ఒక ట్రెండ్ సృష్టించింది ప్రముఖ సింగర్ ఉషా ఉతుప్. ఆమె ఎన్నో వేల స్టేజ్ షోలు ఇచ్చారు. సినిమాలో ఆమె పాడిన పాటలు సూపర్ డూపర్ హిట్ గా నిలిచాయి.

  • Published Jul 09, 2024 | 11:06 AMUpdated Jul 09, 2024 | 11:06 AM
ప్రముఖ గాయని ఉషా ఉతుప్‌ ఇంట తీవ్ర విషాదం!

ఇటీవల సినీ ఇండస్ట్రీని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. ప్రముఖ నటీనటులు, దర్శక, నిర్మాతలు ఇతర సాంకేతిక రంగాలకు చెందిన వారు, వారి కుటుంబ సభ్యులు కన్నుమూస్తున్నారు. తమకు ఇష్టమైన సెలబట్రెటీలు కన్నుమూయడంతో అభిమానుతు తీరని దుఖఃసాగరంలో మునిగిపోతున్నారు. వయోభారం, అనారోగ్య సమస్యలు, హార్ట్ ఎటాక్, రోడ్డు ప్రమాదాలు ఇలా ఎన్నో కారణాల వల్ల సెలబ్రెటీలు మనల్ని వీడిపోతున్నారు. భారతీయ ప్రముఖ గాయని ఉషా ఉతుప్ గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. సంప్రదాయ దుస్తుల్లో నుదుటిన పెద్ద తిలకంతో డిఫరెంట్ లుక్ తో ఆమె కనిపిస్తారు. తాజాగా ఉషా ఉతుప్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. వివరాల్లోకి వెళితే..

దేశంలో ఇప్పటి వరకు ఎంతో మంది పాప్ సింగర్ తమ పాటలతో ఆడియన్స్‌ని మెప్పించారు. తాజాగా ఉషా ఉతుప్ భర్త చాకో ఉతుప్ (78)కన్నుమూశారు. కోల్‌కతాలోని తన నివాసంలో సోమవారం రాత్రి హఠాత్తుగా గుండెపోటు రావడంతో వెంటనే సమీప ఆస్పత్రికి తరలించగా..అప్పటికే ఆయన కన్నుమూసినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ మేరకు జానీ చాకో మృతికి చెందిన వార్తలు కుటుంబ సభ్యులు మీడియాకు వెల్లడించారు. ఉషా ఉతుప్ కి కుమారుడు సన్నీ, కుమార్తె అంజలి ఉన్నారు. నేడు జానీ చాకో అంత్య క్రియలు కోల్‌కతాలో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.ఈ విషయం తెలిసి సినీ ప్రముఖులు ఆయనకు నివాళులర్పించారు.

ఇక ఉషా ఉతుప్ విషయానికి వస్తే.. 1960 కాలంలోనే తనదైన పాప్ సాంగ్స్ తో కోట్ల మంది అభిమానుల హృదయాలు దోచింది. చీర కట్టు.. నుదిట పెద్ద సైజులో కుంకుమ తిలకం, చేతి నిండా గాజులు భారతీయ సంప్రదాయం ఉట్టిపడేలా కనిపించే ఆమె పాప్ సాంగ్స్‌తో కుర్రకారుని ఉర్రూతలూగించేవారు. అప్పట్లో స్టేష్ షోలు ఇస్తూ ప్రపంచ వ్యాప్తంగా ఒక ట్రెండ్ సృష్టించారు ఉషా ఉతుప్. సినిమాల్లో ఆమె పాడిన పాటు ఇప్పటికీ ఫంక్షన్స్ లో మారుమోగుతూనే ఉంటాయి. ఆమె కెరీర్ లో ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నారు. పలు టీవీ షోలకు వ్యాఖ్యాతగా కూడా పనిచేశారు ఉషా ఉతుప్. తెలుగులో కూడా కొన్ని పాటలు పాడారు. ఆమె భర్త మృతిపై పలువురు సినీ సెలబ్రెటీలు సంతాపాన్ని వక్తం చేశారు.

Jojobet GirişjojobetsezarcasinoJojobetJojobetjojobetJojobetjojobetJojobetcasibomcasibomjojobetcasibomfixbetcasibomfixbetcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet giriş