iDreamPost
android-app
ios-app

Aishwarya Rajesh: ఐశ్వర్య రాజేశ్ సినిమాలో ఇండియన్‌ స్టార్‌ క్రికెటర్‌! ఎంట్రీ అదరబోతుంది!

  • Published Apr 06, 2024 | 5:55 PM Updated Updated Apr 06, 2024 | 5:55 PM

ఇంతవరకు సినీ హీరోయిన్స్ క్రికెటర్స్ ప్రేమలో పడటం చూశాం. అయితే కానీ గత కొంతకాలంగా క్రికెటర్స్ తమ ప్రొఫెషన్ వదిలేసి సినిమాలలో నటించడం మొదలుపెట్టారు. ఇప్పటికే ఎంతో మంది క్రికెటర్ల సినిమాలో నటించారు. తాజాగా మరో స్టార్ క్రికెటర్ వెండితెరపై కనిపించనున్నారు.

ఇంతవరకు సినీ హీరోయిన్స్ క్రికెటర్స్ ప్రేమలో పడటం చూశాం. అయితే కానీ గత కొంతకాలంగా క్రికెటర్స్ తమ ప్రొఫెషన్ వదిలేసి సినిమాలలో నటించడం మొదలుపెట్టారు. ఇప్పటికే ఎంతో మంది క్రికెటర్ల సినిమాలో నటించారు. తాజాగా మరో స్టార్ క్రికెటర్ వెండితెరపై కనిపించనున్నారు.

  • Published Apr 06, 2024 | 5:55 PMUpdated Apr 06, 2024 | 5:55 PM
Aishwarya Rajesh: ఐశ్వర్య రాజేశ్ సినిమాలో ఇండియన్‌ స్టార్‌ క్రికెటర్‌! ఎంట్రీ అదరబోతుంది!

మన దేశంలో క్రికెట్ కు అభిమానులు ఎక్కువగా ఉన్నారు. అలానే క్రికెటర్లకు, సినీ స్టార్లకు ఉన్న రేంజ్ లో ఫ్యాన్స్ ఉంటారు. తమ అభిమాన క్రికెటర్ కి సంబంధించిన విషయాలను తెలుసుకునేందుకు ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు. ఇది ఇలా ఉంటే..  క్రికెటర్లు తమదైన ఆటతో క్రికెట్ ప్రియులను అల్లరిస్తుంటారు. అలా గ్రౌండ్ లోనే కాక కొందరు క్రికెటర్లు సినిమాల్లో సైతం కనిపించి…సందడి చేస్తుంటారు. కపిల్ దేవ్, ఇర్ఫాన్ పఠాన్, యువరాజ్ సింగ్, ధావన్ వంటి పలువురు క్రికెటర్లు సినిమాల్లో నటించారు. తాజాగా వారి సరసన మరో ఇండియన్ స్టార్ క్రికెటర్ చేరనున్నారు. మరి.. ఆయన ఎవరు, ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం…

నటి ఐశ్వర్య రాజేశ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. కౌసల్య కృష్ణమూర్తి సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకటుకుంది ఐశ్వర్య రాజేశ్. ఇప్పటికే అనేక సినిమాల్లో నటించిన ఆమె తాజాగా మరో సినిమాతో మన ముందుకు రానుంది.  ఈ అమ్మడి  సినిమాలోనే ఓ స్టార్ క్రికెటర్ కనిపించనున్నారు. నటుడు, సంగీత దర్శకుడు జి.వి. ప్రకాశ్‌కుమార్‌, నటి ఐశ్యర్య రాజేశ్‌ జంటగా నటించిన సినిమా‘డియర్‌’.  ఈ చిత్రంలో నటి రోహిణి, ఇళవరసు, తలైవాసల్‌ విజయ్‌ తదితరులు ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఆనంద్‌ రవిచంద్రన్‌ దర్శకత్వం వహించగా.. నట్‌మగ్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై వరుణ్‌ త్రిపురనేని, అభిఫేక్‌ రామిశెట్టి, జీ.పృధ్వీరాజ్‌ కలిసి నిర్మించారు. ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని, ఈ నెల 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇండియన్ స్టార్ క్రికెటర్, స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తొలిసారిగా ఈ సినిమాలో భాగమయ్యారు.

క్రీడా రంగంలో స్పిన్ మాంత్రికుడిగా అశ్విన్ పేరు తెచ్చుకున్నారు. తన స్పీన్ తో ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టించారు. అలానే క్రికెట్ లో అనేక రికార్డులను అశ్విన్ తిరగరాశారు. అలా క్రీడా రంగంలో అందరిని ఆకట్టుకున్న అశ్విన్.. ఇప్పుడు వెండితెరపై కూడా కనిపించి  ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. తమిళల్లో వస్తున్న ‘డియర్’ సినిమాలో అతిథి పాత్రలో అశ్విన్‌ నటించారని సమాచారం. ఈ సినిమా ట్రైలర్ కూడా తాజాగా విడుదలైంది. ఈ ట్రైలర్ సినిమాపై ఎక్సపెక్టేషన్ ను పెంచింది. అయితే ఈ సినిమా ట్రైలర్ లో ఆయన లుక్‌ రివీల్‌ చేయలేదు.

డియర్ చిత్ర పరిశ్రమలో అడుగుపెడుతున్నట్లు క్రికెటర్‌ అశ్విన్ స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. అశ్విన్‌తో హీరోయిన్‌ ఐశ్వర్యకు ఇదే తొలి చిత్రం. ఇటీవలే ‘డియర్‌’ సినిమా ట్రైలర్‌ను తాజాగా మేకర్స్‌ విడుదల చేశారు. అశ్విన్‌ వాయిస్‌తో ‍ట్రైలర్‌ ప్రారంభం అవుతుంది. ‘డియర్’ చిత్రంలో దీపిక, అర్జున్  పాత్రలలో ప్రకాష్, ఐశ్వర్య రాజేష్ నటించారు. కొత్తగా పెళ్లయిన జంట మధ్య జరిగే సమస్యల చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది. ఈ సినిమాలో అశ్వీన్ ఎంట్రీ అదరిపోయేలా  ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తంగా రవిచంద్ర అశ్వీన్ వెండితెరపై కనిపించనుండపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss