iDreamPost
android-app
ios-app

వరలక్ష్మీ వ్రతంలో ఇనయ సుల్తానా.. నెటిజన్‌ చిల్లర కామెంట్‌!

  • Published Aug 26, 2023 | 12:41 PM Updated Updated Aug 26, 2023 | 12:41 PM
  • Published Aug 26, 2023 | 12:41 PMUpdated Aug 26, 2023 | 12:41 PM
వరలక్ష్మీ వ్రతంలో ఇనయ సుల్తానా.. నెటిజన్‌ చిల్లర కామెంట్‌!

ఇనయ సుల్తానా.. ఈ పేరుతో తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. బిగ్‌బాస్‌ షోతో ఈ అమ్మడు రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. హౌస్‌లో ఉన్నపుడు తనపై కామెంట్‌ చేసిన వారిపై.. ఇబ్బంది కలిగించిన వారిపై ఆడ పులిలా దూకేది. మాటకు మాట సమాధానం చెబుతూ ఫైర్‌ బ్రాండ్‌గా గుర్తింపు తెచ్చుకుంది. బిగ్‌బాస్‌ హౌస్‌లోంచి బయటకు వచ్చిన తర్వాత.. ఆమెకు ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. అయినప్పటికి ఏ మాత్రం కృంగిపోకుండా వచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకుని ముందుకు సాగుతోంది.

ఇక, ఇనయ సోషల్‌ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉంటుంది. తనకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు తన మిత్రులతో షేర్‌ చేసుకుంటూ ఉంటుంది. తాజాగా, వరలక్ష్మీ వ్రతంలో ఆమె పాల్గొన్న వీడియోలు, ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో షేర్‌ చేసింది. అవి కాస్తా వైరల్‌గా మారాయి. వాటిపై ఓ నెటిజన్‌ చిల్లర కామెంట్‌ పెట్టాడు. దానికి ఇనయ కూడా గట్టిగానే సమాధానం ఇచ్చింది. ‘‘ అరే బిల్లిగా.. నేను ముస్లిం అయితే, నీకెందుకు.. ముస్లిం అయితే నీకెందుకు.. నేను ఇండియన్‌ను’’ అని కౌంటర్‌ ఇచ్చింది.

Inaya sultana counter to netizen

ఇక, నెటిజన్లు ఇనయాకు మద్దతుగా నిలుస్తున్నారు. వరలక్ష్మీ వ్రతం విషయంలో ఇనయపై కామెంట్‌ చేసిన వ్యక్తిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆడవాళ్లను గౌరవించడం నేర్చుకోవాలంటూ హితవు పలుకుతున్నారు. ఇంట్లో ఆడవాళ్లను అయితే, అలా అంటావా? అని ప్రశ్నిస్తున్నారు. మతం కంటే మానవత్వం ముఖ్యమైనదని అంటున్నారు. మరి, వరలక్ష్మీ వ్రతంలో పాల్గొన్న ఇనయాపై నెటిజన్‌ చిల్లర కామెంట్‌ చేయటం.. ఇనయ గట్టిగా కౌంటర్‌ ఇవ్వటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Doulath sulthana (@inayasulthanaofficial)

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss