iDreamPost
android-app
ios-app

ఈ స్టార్స్ మధ్య ఉన్న నటి.. ఒకప్పుడు స్టార్ హీరోయిన్.. ఎవరో గుర్తు పట్టారా..?

  • Published Aug 26, 2024 | 12:18 PM Updated Updated Aug 26, 2024 | 12:18 PM

బాలీవుడ్ హీరో సంజయ్ దత్, కన్నడ సూపర్ స్టార్ అండ్ ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ తూగదీప మధ్యలో నిలబడి ఉన్న ఈ నటి ఎవరో తెలుసా.? ఒకప్పుడు స్టార్ హీరోయిన్. తెలుగులో కేవలం స్టార్ హీరోలతోనే వర్క్ చేసింది. ఆ నటి ఎవరో తెలుసా..?

బాలీవుడ్ హీరో సంజయ్ దత్, కన్నడ సూపర్ స్టార్ అండ్ ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ తూగదీప మధ్యలో నిలబడి ఉన్న ఈ నటి ఎవరో తెలుసా.? ఒకప్పుడు స్టార్ హీరోయిన్. తెలుగులో కేవలం స్టార్ హీరోలతోనే వర్క్ చేసింది. ఆ నటి ఎవరో తెలుసా..?

  • Published Aug 26, 2024 | 12:18 PMUpdated Aug 26, 2024 | 12:18 PM
ఈ స్టార్స్ మధ్య ఉన్న నటి.. ఒకప్పుడు స్టార్ హీరోయిన్.. ఎవరో గుర్తు పట్టారా..?

బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్, శాండల్ వుడ్ స్టార్ హీరో దర్శన్ మధ్యలో నిల్చున్న ఈ నటిని గుర్తు పట్టారా..? ఒకప్పుడు ఆమె కూడా స్టార్ హీరోయిన్నే. తెలుగులో స్టార్ హీరోలతో మాత్రమే ఆడిపాడింది ఈ బ్యూటీ. కానీ ఇప్పుడు పూర్తిగా గుర్తుపట్టలేని విధంగా మారిపోయింది. ఇంతకు ఆమె ఎవరంటే.. రక్షిత అలియాస్ శ్వేత (ఆమె రియల్ నేమ్). మాస్ మహారాజ్ రవితేజ.. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇడియట్ (చంటిగాడి లవ్ స్టోరీ ఉప శీర్షిక) మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత..  హీరో-దర్శకుడి కాంబోలో వచ్చిందీ మూవీ. 2002లో వచ్చిన ఈ పిక్చర్ బాక్సాఫీసును ఓ ఊపు ఊపేసింది. కన్నడ అప్పుకు (దర్శకుడు పూరీనే) రీమేక్. రక్షిత, రవితేజ లవ్ ట్రాక్ ప్రేక్షకుల మదిని దోచేస్తుంది. అలాగే డైలాగ్స్ కూడా టపాసుల్లా పేలాయి. ‘కమిషనర్ కూతుళ్లనీ ప్రేమించకూడదా.. కమిషనర్ కూతుళ్లకి మొగుళ్లు రారా’ ‘ చంటి గాడు లోకల్’ డైలాగ్స్ కేక పుట్టించాయి.

ఇడియట్ మూవీతో కుర్రకారు మనస్సును దోచేసిన రక్షిత.. చందన సీమకు చెందిన బ్యూటీ. తెలుగులో చిరంజీవి, నాగార్జున, మహేష్ బాబు, జగపతి బాబు వంటి స్టార్స్‌తో యాక్ట్ చేసింది. కన్నడలో కూడా ఉపేంద్ర, సుదీప్, దర్శన్, పునీత్ రాజ్ కుమార్ వంటి స్టార్ హీరోలతో యాక్ట్ చేసింది. 2007లో కన్నడ స్టార్ డైరెక్టర్‌ను ప్రేమ్‪ను వివాహం చేసుకుని.. నటనకు బ్రేక్ ఇచ్చి నిర్మాతగా మారింది. అలాగే బుల్లితెరపై కూడా హోస్టుగా, జడ్జిగా సందడి చేస్తుంది. రక్షిత తండ్రి బీసీ గౌరీ శంకర్ కన్నడలో ప్రముఖ సినిమాటోగ్రాఫర్, డైరెక్టర్. బెంగళూరులో పుట్టిన రక్షిత.. చదువులు పూర్తయ్యాక.. పునీత్ రాజ్ కుమార్ హీరోగా పూరీ తెరకెక్కించిన అప్పు చిత్రంలో నటించింది. ఈ సినిమాకు శ్వేత పేరును కన్నడ రాజ్ కుమార్ భార్య పార్వతమ్మ.. రక్షితగా పేరు మార్చింది.

Rakshita, Sunjay Dutt, Darshan Thoogudeepa

అప్పు హిట్ కొట్టడం ఆ తర్వాత టాలీవుడ్ బాట పట్టడం వరుసగా జరిగిపోయాయి. తెలుగు వాళ్లకు సుచిత్రగా గుర్తుండిపోయింది రక్షిత. పెళ్లాం ఊరెళితే సినిమాలో వేణుకు జోడీగా కనిపించింది. మహేష్ బాబు నిజం, నాగార్జున శివమణిలో, ఆంధ్రావాలోలో జూనియర్ ఎన్టీఆర్ సరసన, బాలకృష్ణతో లక్ష్మీ నరసింహలో ఆడిపాడింది. చిరంజీవితో అందరివాడు, జగపతి మూవీలో కనిపించింది. జగపతి మూవీ తర్వాత పూర్తిగా తన సొంత ఇండస్ట్రీకి షిఫ్ట్ అయిపోయింది. వరుస పెట్టి సినిమాలు చేస్తూ.. స్టార్ హీరోయిన్ అయిపోయింది. కెరీర్ పీక్స్‌లో ఉండగానే.. దర్శకుడు ప్రేమ్‌ని ప్రేమించి, పెళ్లి చేసుకుని యాక్టింగ్‌కు స్వస్థి పలికింది కానీ నిర్మాణ రంగంలోనూ, టీవీ షోల్లోనూ కొనసాగుతుంది. రక్షితకు సూర్య అనే కొడుకు ఉన్నాడు.

 

View this post on Instagram

 

A post shared by Rakshitha 🧿 (@rakshitha__official)

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişbahisabi girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibom