iDreamPost
android-app
ios-app

తల్లి కోసం గుడి కట్టించిన స్టార్ హీరో

  • Published Apr 10, 2024 | 2:34 PM Updated Updated Apr 10, 2024 | 2:34 PM

తమిళ సూపర్ స్టార్ ఇళయదళపతి ప్రస్తుతం ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్(గోట్) సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈ ఏడాది రాజకీయ రంగ ప్రవేశం చేసిన ఈ నటుడు.. ఇప్పుడు తన తల్లి కోసం ఆలయాన్ని నిర్మించాడు.

తమిళ సూపర్ స్టార్ ఇళయదళపతి ప్రస్తుతం ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్(గోట్) సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈ ఏడాది రాజకీయ రంగ ప్రవేశం చేసిన ఈ నటుడు.. ఇప్పుడు తన తల్లి కోసం ఆలయాన్ని నిర్మించాడు.

  • Published Apr 10, 2024 | 2:34 PMUpdated Apr 10, 2024 | 2:34 PM
తల్లి కోసం గుడి కట్టించిన స్టార్ హీరో

తమిళ సూపర్ స్టార్, ఇళయదళపతి విజయ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ కోలీవుడ్ హీరోకు టాలీవుడ్‌లో మాత్రమే కాదూ.. ఇండియా వైడ్‌గా ఫ్యాన్స్ ఉన్నారు. రజనీ, కమల్ హాసన్ దిగ్గజ నటులు తర్వాత ఆ స్థానాన్ని భర్తీ చేస్తున్న హీరోల్లో ముందు వరుసలో ఉంటాడు. అతడు వెండితెరపైనే కాదూ..రియల్ లైఫ్‌లో కూడా రియల్ స్టారే. తన ఎన్టీవో సంస్థ ద్వారా పలు సామాజిక కార్యక్రమాలు చేపట్టేవాడు. తాజాగా ఈ కోలీవుడ్ హీరో పొలిటికల్ఎంట్రీ ఇచ్చిన సంగతి విదితమే. తమిళగ వెట్రీ కళగం పేరుతో పార్టీని ప్రారంభించాడు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పార్టీ పోటీ చేసే అవకాశాలున్నాయి. ఈ లోపున కమిట్ అయిన చిత్రాలను షురూ చేస్తున్నాడు.

ప్రస్తుతం వెంకట్ ప్రభు దర్శకత్వంలో వస్తున్న ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్(గోట్) చేస్తున్నాడు. అదే విధంగా తన 169వ చిత్రం కూడా త్వరలో ప్రారంభం కానుంది. బహుశా ఇదే అతడి ఆఖరి మూవీ కావచ్చునని తెలుస్తోంది. దీని కోసం భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. కాగా, ఇప్పుడు ఓవార్త నెట్టింట్లో హల్ చేస్తోంది. విజయ్ తన తల్లి శోభ కోసం ఓ ఆలయాన్ని నిర్మించాడట. విజయ్‌కు తన తండ్రితో అంత సత్సంబంధాలు కలిగి ఉండకపోయినా.. అతడికి తల్లి అంటే అమితమైన ఇష్టం గౌరవం. ఇప్పుడు ఆమె కోసం సాయి బాబా ఆలయాన్ని నిర్మించాడట. ఆమెపై ప్రేమతో చెన్నైలోని స్థానిక కొరట్టూర్‌లో తన స్థలంలోసాయి బాబా గుడిని కట్టించారన్న వార్త వైరల్ అవుతోంది.

జోసెఫ్ విజయ్ తండ్రి ఎస్ఎ చంద్రశేఖర్ క్రిస్టియన్ మూలాలకు చెందిన వ్యక్తి అయినప్పటికీ.. తల్లి శోభ హిందూ మతాన్ని ఆచరిస్తుంటారు.  సాయి బాబా ఆలయాన్ని విజయ్ సందర్శించిన ఈ పిక్ వైరల్ అవుతోంది. వేద పండితుల నడుము బ్లూ షర్ట్ జీన్స్‌తో కనిపించాడు ఈ మెర్సల్ యాక్టర్. అయితే ఇది రెండు నెలల క్రితమే పూర్తి చేసుకన్నట్లు తెలుస్తోంది. కాగా, ఈ నెల మొదట్లో కుంభాషేకం జరగ్గా.. ఈ వేడుకల్లో తల్లి శోభ పాల్గొన్నారట. ఇక విజయ్ గోట్ మూవీ రష్యాలో షూటింగ్ జరుపుకుంటోంది. అక్కడ ఓ స్మాల్ బైక్ పై లియో హీరో రైడ్ చేస్తున్న వీడియో సైతం నెట్టింట్లో హల్ చల్ చేసింది. ఈ సినిమా ఏజీఎస్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై కళాపతి ఎస్ అఘోరం, కళాపతి ఎస్ గణేష్, కళాపతి ఎస్ సురేష్ నిర్మిస్తున్నారు. మీనాక్షి చౌదరి హీరోయిన్. ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ ఏడాది థియేటర్లలోకి వచ్చే అవకాశాలున్నాయి. అఫీషియల్ఎనౌన్స మెంట్ రావాల్సి ఉంది.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet GirişgrandpashabetJOJOBET GİRİŞLERİ