రాజకీయాల్లోకి ఇళయదళపతి విజయ్.. సినిమాలకు గుడ్ బై..?

సినిమా రంగానికి చెందిన అనేక మంది సెలబ్రిటీలు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి సత్తా చాటారు.. చాటుతున్నారు. ఏంజేఆర్, జయలలిత, ఎన్టీఆర్ వంటి ఒకప్పటి అగ్ర నటులు ముఖ్యమంత్రులుగా వ్యవహరించిన సంగతి విదితమే. అలాగే పలువురు స్టార్ హీరోలు పార్టీలను స్థాపించి.. యాక్టివ్ పొలిటీషియన్లుగా ఉన్నారు. ఇప్పుడు మరో స్టార్ హీరో..

సినిమా రంగానికి చెందిన అనేక మంది సెలబ్రిటీలు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి సత్తా చాటారు.. చాటుతున్నారు. ఏంజేఆర్, జయలలిత, ఎన్టీఆర్ వంటి ఒకప్పటి అగ్ర నటులు ముఖ్యమంత్రులుగా వ్యవహరించిన సంగతి విదితమే. అలాగే పలువురు స్టార్ హీరోలు పార్టీలను స్థాపించి.. యాక్టివ్ పొలిటీషియన్లుగా ఉన్నారు. ఇప్పుడు మరో స్టార్ హీరో..

రాజకీయాలకు, సినిమాలకు అవినాభావ సంబంధం ఉంటుంది. సినిమా రంగంలో ఓ వెలుగు వెలిగిన ఎంతో మంది ధ్రువతారలు.. రాజకీయాల్లోకి వెళ్లి తమను తాము నిరూపించుకున్నారు. ఇంకా కొనసాగుతున్నవారున్నారు. ఎంజేఆర్, ఎన్టీఆర్, జయలలిత రాజకీయాల్లో సృష్టించిన ప్రభంజనం అందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్, కమల్ హాసన్ వంటి దిగ్గజ నటులు కూడా ప్రస్తుతం అటు సినిమాల్లో, ఇటు రాజకీయాల్లోనూ కొనసాగుతున్న సంగతి విదితమే. అలాగే ఇప్పుడు మరో స్టార్ హీరో కూడా రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నాడని టాక్ నడుస్తోంది. ఎప్పటి నుండో ఆ స్టార్ హీరో పాలిటిక్స్‌లోకి వస్తున్నాడంటూ వార్తలు వస్తూనే ఉన్నాయి.. ఇప్పుడు అదే నిజం కాబోతున్నట్లు తెలుస్తోంది.

ఇంతకు ఆ నటుడు ఎవరంటే.. కోలీవుడ్ ఇళయదళపతి విజయ్. విజయ్ పార్టీలోకి రాబోతున్నారంటూ ఇప్పటి నుండి కాదూ కొన్ని సంవత్సరాల నుండి కోలీవుడ్ మీడియా కోడై కూస్తున్న సంగతి విదితమే. ఆయన తండ్రి చంద్రశేఖర్ కూడా తన కొడుకు పాలిటిక్స్‌లోకి వస్తాడంటూ పలు మార్లు ధ్రువీకరించాడు కూడా. కానీ వీటిపై విజయ్ స్పందించనూ లేదు ఖండించనూ లేదు. అయితే విజయ్ సామాజిక కార్యక్రమాలు చేపడుతుంటారు. ఇందు కోసం విజయ్ మక్కల్ ఇయక్కమ్ సంస్థను స్థాపించారు. ఈ సంస్థ ద్వారానే పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. గత ఏడాది పది, ఇంటర్ పరీక్షలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు ఉపకార వేతనాలు అందించిన సంగతి విదితమే. మొన్నటి మొన్న వరద బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు విజయ్.

అయితే మళ్లీ ఆయన పొలిటికల్ ఎంట్రీపై వార్తలు రావడం కారణమైంది ఓ సమావేశం. చెన్నై సమీప పనయూర్ లోని తన కార్యాలయంలో విజయ్ మక్కల్ ఇయక్కం నిర్వాహకులతో సమావేశం నిర్వహించారట ఈ స్టార్ నటుడు. పలు జిల్లాల నుండి 150 మంది నిర్వాహకులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో రాజకీయాల గురించి చర్చించినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన త్వరలో కొత్త పార్టీ పెట్టబోతున్నారని, సినిమాలకు గుడ్ బై చెప్పనున్నారని వార్తలు ఊపందుకుంటున్నాయి. మరో నెల రోజుల్లో కొత్త పార్టీ ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. లోక్ సభ ఎన్నికలతో పాటు మరో రెండేళ్లకు వచ్చే అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి సారించనున్నారని సమాచారం.

ఇక విజయ్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కోలీవుడ్‌లోనే కాదూ టాలీవుడ్ లో వీర ఫ్యాన్స్ ఉన్నారు ఇతనికి. తెలుగులో ఒక్క మూవీ చేయకపోయినా.. తన డబ్బింగ్ చిత్రాల ద్వారా అలరిస్తున్నారు ఈ స్టార్ నటుడు. త్రీ ఇడియట్ నుండి కత్తి, పులి, పోలీసోడు, బిగిల్, మాస్టర్, బీస్ట్, వారసుడు వంటి చిత్రాలతో ఇక్కడి వారిని పలకరించాడు. గత ఏడాది దసరాకు లియో మూవీతో రాగా, తెలుగులో కూడా భారీ వసూళ్లను రాబట్టుకుందీ చిత్రం. ఇప్పుడు ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం అనే చిత్రంలో నటిస్తున్నాడు. తన ఎన్జీవో సంస్థతో చర్చలు చేసిన ప్రతి సారి ఆయన సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నాడని, రాజకీయాల్లోకి రాబోతున్నాడని వార్తలు వస్తూనే ఉన్నాయి. మరీ వస్తాడో లేదో కొన్ని రోజుల్లో తేలనుంది. అతడు పాలిటిక్స్ లోకి ఎంటర్ అవుతాడని అనుకుంటున్నారా..? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments