iDreamPost
android-app
ios-app

ప్రియుడి అంత్యక్రియలకు వెళ్లని నటి.. ఏం చెప్పిందంటే..

  • Published Nov 21, 2023 | 10:07 AM Updated Updated Nov 21, 2023 | 10:07 AM

బాలీవుడ్‌ స్టార్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ చనిపోయి దాదాపు మూడేళ్లు అవుతోంది. అయినప్పటికి ఆయన పేరు తరచుగా ఏదో ఒక సందర్భంలో మీడియాలో చర్చకు వస్తోంది.

బాలీవుడ్‌ స్టార్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ చనిపోయి దాదాపు మూడేళ్లు అవుతోంది. అయినప్పటికి ఆయన పేరు తరచుగా ఏదో ఒక సందర్భంలో మీడియాలో చర్చకు వస్తోంది.

  • Published Nov 21, 2023 | 10:07 AMUpdated Nov 21, 2023 | 10:07 AM
ప్రియుడి అంత్యక్రియలకు వెళ్లని నటి.. ఏం చెప్పిందంటే..

ప్రముఖ బాలీవుడ్‌ దివంగత హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ .. నటి అంకిత లోఖండే గతంలో ప్రేమించుకున్న సంగతి తెలిసిందే. కొన్నేళ్ల పాటు వీరి ప్రేమ వ్యవహారం నడిచింది. అయితే, అనుకోని విధంగా ఇద్దరూ విడిపోయారు. ఆ కొన్నేళ్లకు ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. ఇద్దరూ విడిపోవటానికి గల కారణాలను చెప్పుకొస్తూ.. ఇద్దరూ విడిపోవటానికి పెద్ద కారణాలు ఏవీ లేవని తెలిపారు. సుశాంతే విడిపోదామన్నాడని, అతడి మాటలు విని తాను షాక్ అయ్యానని అన్నారు.

అతడి మాటలతో రాత్రంతా ఏడ్చానని, చాలా కాలం ఎంతో మదనపడ్డానని వెల్లడించారు. సుశాంత్‌ తనను ఎందుకు దూరం పెట్టాలని అనుకున్నాడో ఇప్పటికీ తెలియదన్నారు. ఇకపై తెలిసే అవకాశం కూడా లేదన్నారు. సుశాంత్‌ నిర్ణయాన్ని తాను ఎప్పుడూ తప్పుబట్టలేదన్నారు. అతడు మనసుకు నచ్చిన మాట చెప్పాడని, ఆ మాట నా మనసును ముక్కలు చేసిందని అన్నారు. అతడితో బ్రేకప్ తర్వాత మరొకరితో రిలేషన్ షిప్ అంటే వణుకు పుట్టేదన్నారు.

తాజాగా.. సుశాంత్‌ అంత్యక్రియలకు ఎందుకు వెళ్లలేదనే దానిపై స్పందించారు. ఆమె మాట్లాడుతూ.. ‘‘ ఆ సమయంలో ఎవ్వరూ నన్ను నమ్మలేదు. అతడు ఈ ప్రపంచాన్ని వీడి వెళ్లిపోయాడు. నా జీవితంలో ఓ మనిషిని కోల్పోవటం ఇదే మొదటి సారి. నేను షాక్‌ అయ్యాను. నేను అంత్యక్రియలకు కూడా వెళ్లలేదు. వెళ్లలేకపోయాను. ఎందుకంటే.. నేను అతడ్ని అలా చూసి తట్టుకోలేను. వెళ్లి చూసిరమ్మని విక్కీ చెప్పాడు. నేను ఎలా వెళ్లగలను. అలాంటిది నేను నా జీవితంలో మొదటిసారి అనుభవించాను.

నేను మొదటిసారి నా తండ్రిని అలా చూశాను. నాకు తెలుసు ఎవ్వరి లోటు ఎలాంటిదని’’ అని అన్నారు. కాగా, సుశాంత్‌ సింగ్ రాజ్‌పుత్‌ సీరియల్స్‌ ద్వారా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. బుల్లితెరపై నుంచి వెండి తెరపై ఓ వెలుగు వెలిగారు. స్టార్ల పిల్లలకు గట్టిపోటీ ఇచ్చారు. అయితే, వ్యక్తిగత కారణాల వల్ల డ్రగ్స్‌కు బానిసయ్యారు. చివరకు 2020లో ముంబైలోని తన ఫ్లాట్‌లో ఆత్మహత్య చేసుకున్నారు. ఆ ఆత్మహత్య బాలీవుడ్‌ను కుదిపేసింది. దాదాపు రెండేళ్లకు పైనే కేసులు నడిచాయి.

ఇప్పుడిప్పుడే ఆ పరిస్థితులు సద్దుమణుగుతున్నాయి. అంకిత మాత్రం తరచుగా సుశాంత్‌ను తల్చుకుని బాధపడుతూ ఉన్నారు. అతడ్ని ఎంత ప్రేమించిందో.. అతడు బ్రేకప్‌ చెప్పిన తర్వాత ఎంత బాధపడిందో చెప్పుకొచ్చారు. సుశాంత్‌ను తాను ఎంతగానో ప్రేమించానని చెప్పారు. చెప్పుడు మాటలు విని అతడు తనకు దూరం అయ్యాడని అన్నారు.మరి, సుశాంత్‌తో బ్రేకప్‌తో అంకిత చెప్పిన విషయాలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో

తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetvbet girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibomGrandpashabet Giriş