Dharani
HYDRA-N Convention, Akkineni Nagarjuna: ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై హీరో అక్కినేన నాగార్జున అభిమానులను ఉద్దేశించి.. ఎమోషనల్ ట్వీట్ చేశారు. ఆ వివరాలు..
HYDRA-N Convention, Akkineni Nagarjuna: ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై హీరో అక్కినేన నాగార్జున అభిమానులను ఉద్దేశించి.. ఎమోషనల్ ట్వీట్ చేశారు. ఆ వివరాలు..
Dharani
ప్రస్తుతం తెలంగాణలో మీడియా, సోషల్ మీడియా ఇలా ఏ వేదిక చూసినా.. వినిపిస్తోన్న పేరు హైడ్రా(హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ). నగరంలో అక్రమ నిర్మణాల మీద దూకుడుగా ముందుకు సాగుతోంది హైడ్రా. సామాన్యులు, సెలబ్రిటీలు అనే తేడా లేకుండా.. అక్రమ నిర్మణాలపై కొరడా ఝుళిపిస్తోంది. దీనిలో భాగంగానే.. ప్రముఖ హీరో అక్కినేని నాగార్జున ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేయడం హాట్ టాపిక్‌గా మారింది. తుమ్మిడికుంట చెరువును ఆక్రమించి.. అక్కినేని నాగార్జున ఎన్ కన్వెన్షన్ సెంటర్‌ను నిర్మించారని తెలిపిన హైడ్రా అధికారులు.. దాని కూల్చి వేశారు. ఇక ఈ ఘటన తెలంగాణ సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
అయితే దీనిపై నాగార్జున స్పందిస్తూ.. తాను ఎలాంటి ఆక్రమణలు చేయలేదని తెలిపారు. అంతేకాక హైకోర్టును కూడా ఆశ్రయించారు. ఇక గత రెండు రోజులుగా ఎన్ కన్వెన్షన్‌కు సంబంధించి ఎన్నో వార్తలు చక్కర్లు మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా ఎన్ కన్వెన్షన్ విషయంలో వస్తున్న వార్తలపై అక్కినేని నాగార్జున స్పందిస్తూ.. అభిమానులను ఉద్దేశిస్తూ.. ఎమోషనల్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం అది వైరల్ అవుతోంది.
ఈ సందర్భంగా నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చివేత విషయంలో తాను హైకోర్టు వెలువరించే తీర్పుకు కట్టుబడి ఉంటానని చెప్పుకొచ్చారు. కోర్టు తీర్పు వెలువడే వరకు ఎలాంటి వదంతులు, అవాస్తవాలు నమ్మొద్దని ట్విటర్ వేదికగా తన అభిమానులకు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఆయన చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. ‘‘ప్రియమైన అభిమానులు, శ్రేయోభిలాషులకు.. ఎన్ కన్వెన్షన్‌కు సంబంధించి వస్తున్న వార్తల్లో వాస్తవాల కంటే ఊహాగానాలే అధికంగా వినిపిస్తున్నాయి. పట్టా భూమిలోనే ఎన్ కన్వెన్షన్ నిర్మించాం. ఒక్క సెంట్ భూమి కూడా ఆక్రమించలేదు’’ అన్నారు.
అంతేకాక ‘‘తుమ్మిడికుంట చెరువు ఆక్రమణకు గురి కాలేదని స్పెషల్ కోర్టు, ఏపీ లాండ్ గ్రాబింగ్ యాక్ట్ 24-02-2014న ఓ ఆర్డర్ ఎస్‌ఆర్ 3943/2011 ద్వారా జడ్జిమెంట్ ఇచ్చింది. ప్రస్తుతం.. నిర్మాణం చట్టబద్ధతపై నిర్ణయాధికారం కోసం హైకోర్టుని ఆశ్రయించాం. న్యాయస్థానం తీర్పునకు కట్టుబడి ఉంటాను. అవాస్తవాలు నమ్మకండి’’ అని అభిమానులను కోరారు.
ప్రియమైన అభిమానులు, శ్రేయోభిలాషులందరికీ,
N-కన్వెన్షన్ కి సంబంధించి వస్తున్న వార్తల్లో వాస్తవాల కంటే, ఊహాగానాలు ఎక్కువ వినిపిస్తున్నాయి . కన్వెన్షన్ నిర్మించబడిన భూమి పట్టా డాక్యుమెంటెడ్ భూమి. ఒక్క సెంట్ భూమి కూడా ఆక్రమించింది కాదు. తుమ్మిడికుంట చెరువు ఆక్రమణకు…
— Nagarjuna Akkineni (@iamnagarjuna) August 25, 2024
ఇక నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్‌ను హైడ్రా అధికారుల బృందం శనివారం తెల్లవారుజామును కూల్చివేసిన సంగతి తెలిసిందే. తుమ్మిడి చెరువు కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్ నిర్మాణం చేపట్టారని అధికారులకు ఫిర్యాదులు రాగా రంగంలోకి దిగి కూల్చివేశారు. అయితే చట్టాన్ని అతిక్రమించి తాము ఎలాంటి చర్యలు చేపట్టలేదని ట్విటర్ వేదికగా నాగార్జున నిన్ననే ఒక ప్రకటన విడుదల చేశారు. అంతేకాక ఈఘటనపై నాగార్జున శనివారమే తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా.. విచారణ జరిపిన జస్టిస్ టి.వినోద్ కుమార్ నేతృత్వంలోని ధర్మాసనం.. కూల్చివేతలు ఆపాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. మరి హైడ్రా దూకుడు ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి.