iDreamPost
android-app
ios-app

పలుకే బంగారమాయెనా నటిపై భర్త పోలీస్ కేసు! రియల్టర్‌తో సంబంధం అంటూ?

  • Published Mar 11, 2024 | 1:02 PM Updated Updated Mar 11, 2024 | 4:47 PM

Aishwarya Addala .. ప్రముఖ టెలివిజన్ నటి అడ్డాల ఐశ్వర్యపై పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆమె భర్త. తనను మోసం చేసిందంటూ వాపోతున్నాడు. తనను పెళ్లి చేసుకుని, మరొకరితో ..

Aishwarya Addala .. ప్రముఖ టెలివిజన్ నటి అడ్డాల ఐశ్వర్యపై పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆమె భర్త. తనను మోసం చేసిందంటూ వాపోతున్నాడు. తనను పెళ్లి చేసుకుని, మరొకరితో ..

  • Published Mar 11, 2024 | 1:02 PMUpdated Mar 11, 2024 | 4:47 PM
పలుకే బంగారమాయెనా నటిపై భర్త పోలీస్ కేసు! రియల్టర్‌తో సంబంధం అంటూ?

ప్రముఖ టెలివిజన్ నటి అడ్డాల ఐశ్వర్యపై ఆమె భర్త శ్యాం కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత ఏడాది సెప్టెంబర్‌లో తమకు వివాహం అయ్యిందని,  ఆమె తనను మోసం చేసిందంటూ ఆరోపించారు. ఐశ్వర్య ప్రస్తుతం పలు సీరియల్స్‌లో నటిస్తోంది. శ్యాం కుమార్ తెలిపిన వివరాల ప్రకారం..కాపు మెట్రీమోనీలో ఈ సంబంధం రాగా, ఆమె సీరియల్లోయాక్ట్ చేస్తుందని, ఎలాంటి చెడు అలవాట్లు లేవంటూ ఆమె తల్లిదండ్రులు చెప్పడంతో గత ఏడాది సెప్టెంబర్‌లో వీరి వివాహం జరిగింది. దీంతో కట్నం తీసుకోకుండా ఆమెను వివాహం చేసుకున్నాడు. వైజాగ్‌లో వీరి పెళ్లి జరిగింది. పెళ్లైన కొన్ని రోజులకే ఆమెకు ఉన్న చెడు అలవాట్లు బయటపడ్డాయని చెబుతున్నాడు ఐశ్యర్య భర్త.

పెళ్లైన 15 రోజులకు హైదరాబాద్‌లో ఆమె ఉంటున్న ఇంటికి రాగా స్మోక్ చేస్తూ కనిపించింది. అయినప్పటికీ పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఆమె రూంలో రియల్టర్ కరణం రమేష్ బాబుతో ఉన్న పెళ్లి ఫోటోలు కనిపించాయి. పెళ్లయిన నెల రోజులకే రమేష్‌తో ఆమె అక్రమ సంబంధం గురించి బయట పడింది, నిలదీస్తే.. తనపై దాడికి దిగింది. అంతలో రమేష్ బాబు నుండి తనకు బెదిరింపులు వచ్చాయి. అప్పటి నుండి విడాకులు ఇవ్వాలంటూ ఇబ్బందులకు గురి చేస్తోంది, డివోర్స్ ఇవ్వకపోతే.. అక్రమ కేసులు పెడతామని వేధిస్తున్నారు.. ఓ సారి భౌతిక దాడి కూడా చేసింది. ఈ విషయం ఐశ్వర్య తల్లిదండ్రులకు చెబితే.. వాళ్లు కూడా వంత పాడుతున్నారు’ అని మీడియాతో అన్నారు శ్యాం కుమార్.

అంతలో తాము ఇచ్చిన నగలు కూడా కనిపిచంలేదని, వాటిని మాయం చేసిందని పేర్కొన్నాడు. ఈ క్రమంలోనే రమేష్‌బాబు, ఐశ్వర్యతో తాను మాట్లాడిన ఆడియో కాల్స్‌ బయటపెట్టాడు. అప్పటి నుండి ఆమె దూరంగా ఉంటడం స్టార్ చేశానని వెల్లడించాడు శ్యాం కుమార్. తనను పెళ్లి చేసుకుని రూ. 25 లక్షలు కాజేసి, ఇప్పుడు విడాకులు అడుగుతోందని పేర్కొన్నాడు. రమేష్, ఐశ్వర్యలిద్దరూ బెదిరించడంతో అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనకు న్యాయం చేయాలంటూ వాపోతున్నాడు. ఐశ్వర్య పలు చిత్రాల్లో కూడా నటించింది. త్రి ముఖి, ఈ సినిమా సూపర్ హిట్ వంటి చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం బుల్లితెరపై రాణిస్తోంది.  ఐశ్వర్య.. అమ్మాయి గారు, పలుకే బంగారామాయేనా, అలా వైకుంఠపురం, అత్తారింటికి దారేది సీరియల్స్‌లో నటిస్తోంది.

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişbetewin girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibom