iDreamPost
android-app
ios-app

The Goat Life Movie: ది గోట్ లైఫ్ ప్రీమియర్ షోకు సూపర్ రెస్పాన్స్

  • Published Mar 25, 2024 | 9:07 PM Updated Updated Mar 25, 2024 | 9:07 PM

పృథ్వీరాజ్ సుకుమారన్, అమలా పాల్ నటించిన ది గోట్ లైఫ్. ఈ సినిమా మార్చి 28న ప్రేక్షుకల ముందు రానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ఒక స్పెషల్ ప్రీమియర్ షో ఏర్పాటు చేయగా సూపర్ రెస్పాన్స్ వచ్చిందట.

పృథ్వీరాజ్ సుకుమారన్, అమలా పాల్ నటించిన ది గోట్ లైఫ్. ఈ సినిమా మార్చి 28న ప్రేక్షుకల ముందు రానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ఒక స్పెషల్ ప్రీమియర్ షో ఏర్పాటు చేయగా సూపర్ రెస్పాన్స్ వచ్చిందట.

  • Published Mar 25, 2024 | 9:07 PMUpdated Mar 25, 2024 | 9:07 PM
The Goat Life Movie: ది గోట్ లైఫ్ ప్రీమియర్ షోకు సూపర్ రెస్పాన్స్

పృథ్వీరాజ్ సుకుమారన్, అమలా పాల్ నటించిన ఆడు జీవితం: ది గోట్ లైఫ్ అనే మలయాళ చిత్రం మార్చి 28న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. కాగా బెంజమిన్ రచించిన క్లాసిక్ మలయాళ నవల ఆడుజీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. బ్లెస్సీ రచన, దర్శకత్వంతో పాటు ఈ సినిమాకి సహ నిర్మాతగా కూడా పని చేశారు. ఆసక్తికరమైన ప్లాట్ తో పాటు టీజర్, ట్రైలర్ లో అద్భుతమైన టెక్నికల్ ఎలిమెంట్స్ కారణంగా ఈ సినిమా పాజిటివ్ బజ్‌ను తెచ్చుకుంది. కాగా మేకర్స్ ఒక స్పెషల్ ప్రీమియర్ షో ఏర్పాటు చేయగా సూపర్ రెస్పాన్స్ వచ్చిందట.

ఇటీవల ఈ సినిమాలోని లీడ్ యాక్టర్ పృథ్వీరాజ్ వరుసగా ప్రెస్ తో ఇంటరాక్ట్ అవుతూ సినిమా ప్రమోట్ చేయడం మొదలుపెట్టారు. కాగా ఈ సర్వైవల్ డ్రామాను ప్రతిష్టాత్మక బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్ తెలుగు భాషలో విడుదల చేస్తున్నారు. కాగా సినిమాకి క్రేజ్ తీసుకురావడం కోసం మైత్రీ మూవీ మేకర్స్ టాలీవుడ్ ప్రముఖ దర్శకుల కోసం ప్రత్యేక ప్రీమియర్ షో ఏర్పాటు చేసింది. హను రాఘవపూడి, వెంకీ అట్లూరి, శివ నిర్వాణ, శ్రీను వైట్ల దర్శకులు ది గోట్ లైఫ్ సినిమాని చూశారు. స్క్రీనింగ్ సమయంలో పృథ్వీరాజ్ కూడా ఉన్నారు. దర్శకులందరికీ సినిమా నచ్చడంతో పాటు టీమ్‌ని అభినందించారట. అలాగే నటుడిగా పృథ్వీరాజ్ సుకుమారన్ నటనను కూడా ప్రశంసించారట.

గత డిసెంబర్ లో పృథ్వీరాజ్ సలార్: పార్ట్ 1 లో నటించి తెలుగు ప్రేక్షకులకి మరింత దగ్గరయ్యారు. ఈ యాక్షన్ డ్రామాలో ఆయన ఒక కీలకమైన పాత్రను పోషించారు. సలార్ సినిమా పృథ్వీరాజ్ కు పాన్-ఇండియా గుర్తింపును కూడా తెచ్చిపెట్టింది. ఇక ది గోట్ లైఫ్ అడ్వాన్స్ బుకింగ్స్ ఇటీవలే స్టార్ట్ కాగా ప్రస్తుతం ట్రెండ్ ను బట్టి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్స్ తెచ్చుకుంటుందని ట్రేడ్ వర్గాల వారు అంటున్నారు. ఈ చిత్రం తొలి రోజు డబుల్ డిజిట్ గ్రాస్ మార్కును దాటడానికి కూడా అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. ఇప్పటికే ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ లో $200K మార్క్‌ను దాటేసింది. ఇక ది గోట్ లైఫ్ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే, పృథ్వీరాజ్ 100 కోట్ల గ్రాస్ లేదా అంతకంటే ఎక్కువ మార్కును కూడా చూడవచ్చు అని అంటున్నారు. మరో రెండు రోజుల్లో విడుదల కానున్న ఆడు జీవితం: ది గోట్ లైఫ్ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుందాం.

Jojobet GirişMadridbetMariobetmeritbetmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişcasibom girişgrandpashabetgrandpashabet giriş