iDreamPost
android-app
ios-app

గూస్‌బంమ్స్‌ తెప్పిస్తున్న ప్రాజెక్ట్‌ కే AD గ్లింప్స్‌.. కే అంటే ఏంటో చెప్పేశారు!

  • Published Jul 21, 2023 | 9:18 AM Updated Updated Jul 21, 2023 | 9:18 AM
  • Published Jul 21, 2023 | 9:18 AMUpdated Jul 21, 2023 | 9:18 AM
గూస్‌బంమ్స్‌ తెప్పిస్తున్న ప్రాజెక్ట్‌ కే AD గ్లింప్స్‌.. కే అంటే ఏంటో చెప్పేశారు!

ప్రభాస్‌ అభిమానులతో పాటు దేశ వ్యాప్తంగా ఉన్న సగటు సినీ ప్రేమికుడు ఎంతగానో ఎదురు చూస్తున్న ప్రాజెక్ట్‌ కేకు సంబంధించి ఓ పెద్ద అప్‌డేట్‌ను చిత్ర యూనిట్‌ విడుదల చేసింది. ప్రాజెక్ట్‌ కే ఏడీ గ్లింప్స్‌ను గురువారం ప్రేక్షకుల ముందుకు తెచ్చింది. ఈ గ్లింప్స్‌లో ప్రాజెక్ట్‌ కే అంటే ఏంటో చెప్పేసింది. ప్రాజెక్ట్‌ కే అంటే.. ‘‘ కల్కీ’’ అని పేర్కొంది. ఈ సినిమా పేరును ‘‘కల్కీ 2898.. ఏడీ’’గా అనౌన్స్‌ చేసింది. ఇక, ఈ గ్లింప్స్‌ సోషల్‌ మీడియాలో దూసుకుపోతోంది.

యూట్యూబ్‌లో విడుదలైన వీడియోకు మంచి స్పందన వస్తోంది. గూస్‌ బంమ్స్‌ తెప్పిస్తున్న ఆ గ్లింప్స్‌ను చూసి ప్రేక్షకులు వ్వావ్‌ అంటున్నారు. హాలీవుడ్‌ సినిమాకు ఏ మాత్రం తీసిపోకుండా ఈ సినిమా ఇండబోతోందని సినిమా టీం ఈ మచ్చు తునకను ప్రేక్షకులకు అందించింది. అయితే, బుధవారం సినిమా టీం రిలీజ్‌ చేసిన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌పై ప్రభాస్‌ ఫ్యాన్స్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. సోషల్‌ మీడియా వ్యాప్తంగా ట్రోల్స్‌ చేయటం మొదలుపెట్టారు. దీంతో సినిమా టీం ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌పై ఆలోచనల్లో పడింది.

గురువారం ఆ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను డిలీట్‌ చేసి.. కొత్తగా మార్పులు చేసిన పోస్టర్‌ను రిలీజ్‌ చేసింది. దీంతో ప్రభాస్‌ అభిమానులు కొంత శాంతించారు. అలాంటి ఫ్యాన్స్‌కు ఈ కల్కీ 2898 ఏడీ గ్లింప్స్‌ ఫుల్‌ మీల్స్‌గా మారింది. వీడియో చూసి వారు ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. కాగా, నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో భారత దిగ్గజ నటులు పలువురు నటిస్తున్నారు. దీపికా పదుకునే హీరోయిన్‌గా చేస్తోంది. బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్‌, విశ్వ నాయకుడు కమల్‌ హాసన్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మరి, కల్కీ 2898.. ఏడీ గ్లింప్స్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetcratosroyal girişEscortes BelgiqueCasibomCasibomGrandpashabet GirişgrandpashabetJOJOBET GİRİŞLERİCasibomCasibomBetcio