iDreamPost
android-app
ios-app

సందీప్ రెడ్డి వంగా- ప్రభాస్ .. స్పిరిట్ మీద భారీ హైప్

  • Published Nov 20, 2024 | 3:26 PM Updated Updated Nov 20, 2024 | 3:26 PM

Spirit Movie Updates: అప్పటివరకు హీరోలకు ఒక ఇమేజ్ ఉంటుంది. కానీ సందీప్ దగ్గరకు వచ్చాక అది ఇంకాస్త డబుల్ అవుతుంది. సందీప్ రెడ్డి హీరోలకు ఒక స్పెషల్ క్రేజ్ ఉంటుంది. సందీప్ రెడ్డి వంగా హీరోలు తెరపై ఎలా కనిపిస్తారు.. అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అర్జున్ రెడ్డితో విజయ్ లెవెల్ ను మార్చేశాడు. యానిమల్ తో రణబీర్ క్యారెక్టర్ ను చాలా కొత్తగా చూపించాడు. అలాంటిది ఇప్పుడు సందీప్ చేతికి ప్రభాస్ లాంటి కటౌట్ దొరికింది.

Spirit Movie Updates: అప్పటివరకు హీరోలకు ఒక ఇమేజ్ ఉంటుంది. కానీ సందీప్ దగ్గరకు వచ్చాక అది ఇంకాస్త డబుల్ అవుతుంది. సందీప్ రెడ్డి హీరోలకు ఒక స్పెషల్ క్రేజ్ ఉంటుంది. సందీప్ రెడ్డి వంగా హీరోలు తెరపై ఎలా కనిపిస్తారు.. అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అర్జున్ రెడ్డితో విజయ్ లెవెల్ ను మార్చేశాడు. యానిమల్ తో రణబీర్ క్యారెక్టర్ ను చాలా కొత్తగా చూపించాడు. అలాంటిది ఇప్పుడు సందీప్ చేతికి ప్రభాస్ లాంటి కటౌట్ దొరికింది.

  • Published Nov 20, 2024 | 3:26 PMUpdated Nov 20, 2024 | 3:26 PM
సందీప్ రెడ్డి వంగా- ప్రభాస్ .. స్పిరిట్ మీద భారీ హైప్

అప్పటివరకు హీరోలకు ఒక ఇమేజ్ ఉంటుంది. కానీ సందీప్ దగ్గరకు వచ్చాక అది ఇంకాస్త డబుల్ అవుతుంది. సందీప్ రెడ్డి హీరోలకు ఒక స్పెషల్ క్రేజ్ ఉంటుంది. సందీప్ రెడ్డి వంగా హీరోలు తెరపై ఎలా కనిపిస్తారు.. అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అర్జున్ రెడ్డితో విజయ్ లెవెల్ ను మార్చేశాడు. యానిమల్ తో రణబీర్ క్యారెక్టర్ ను చాలా కొత్తగా చూపించాడు. కేవలం ఒక హీరో క్యారెక్టరైజేషన్ తో కథను నడపగలిగే దర్శకుడు సందీప్ మాత్రమే. ఈ రకంగా గతంలో సినిమాలను తీసింది పూరి జగన్నాద్. అప్పట్లో పూరి సినిమాలకు స్పెషల్ బ్రాండ్ ఉండేది. ఆ తర్వాత చాలా మంది దర్శకులు ఎంట్రీ ఇచ్చినా కానీ ఆ వేవ్ లెంగ్త్ ను మాత్రం ఎవరు మ్యాచ్ చేయలేకపోయారు. అందుకే రామ్ గోపాల్ వర్మ సైతం సందీప్ దగ్గర మేకింగ్ నేర్చుకోవాలని ఓసారి కామెంట్ చేశాడు. అంతే కాకుండా సందీప్ ఒక సినిమా తీసేటప్పుడు ఫాలో అవ్వాల్సిన రూల్స్ ఫాలో అవ్వడని.. ఎలా తీయకూడదో అలా తీసి దానిని ప్రేక్షకులు యాక్సెప్ట్ చేసేలా చేస్తాడంటూ చెప్పుకొచ్చాడు.

అందులో వాస్తవం లేకపోలేదు. ఎందుకంటే యానిమల్ సినిమాలో.. తండ్రిపై పిచ్చి ప్రేమతో అతని సైకోయిజంని హీరోయిజం లా మార్చి ప్రేక్షకులను కన్విన్స్ చేసాడు. ఇప్పుడు అదే కథకు కంటిన్యుషన్ గా యానిమల్ పార్క్ కూడా ఉండబోతుంది. అది ఇంకాస్త వైల్డ్ గా ఉంటుందని ఆల్రడీ అందరికి అర్థమైపోయింది. అలాంటిది ఇప్పుడు సందీప్ చేతికి ప్రభాస్ లాంటి కటౌట్ దొరికింది. ఈ సినిమాలో ప్రభాస్ పోలీస్ గెటప్ లో కనిపించబోతున్నాడన్న సంగతి తెలిసిందే. దీనిని బట్టే గెస్ చేయొచ్చు ఆ పాత్ర ఎంత పవర్ ఫుల్ గా ఉంటుందో. సందీప్ గత రెండు సినిమాలా హీరోలకు మించిన పాత్రగా ప్రభాస్ ది ఉంటుందని లీకులు అందుతున్నాయి. యానిమల్ , యానిమల్ పార్క్ ను కలిపితే ఎలాంటి వైల్డ్ రిజల్ట్ ఉంటుందో.. స్పిరిట్ అంతకుమించి ఉంటుందని సమాచారం. అంతే కాకుండా స్పిరిట్ లో ప్రభాస్ క్యారెక్టర్ ఈ రెండు సినిమాల్లోని హీరో క్యారెక్టర్ ను డామినేట్ చేసేలా ఉంటుందని టాక్.

స్పిరిట్ సినిమా ఓ డ్రగ్ లా జనాల్లోకి ఎక్కేస్తుందని అంటున్నారు. ఇంత పవర్ ఫుల్ గా డార్లింగ్ ను మునుపెన్నడూ చూసి ఉండరని , రెండు డిఫరెంట్ లుక్స్ లో ప్రభాస్ ను హైలెట్ చేస్తూ సందీప్ చూపించనున్నాడనే అప్డేట్స్ వస్తున్నాయి. ఇలా సినిమా మీద వచ్చే అప్డేట్స్ అన్ని కూడా .. రోజు రోజుకి అంచనాలను పెంచేస్తున్నాయి. కచ్చితంగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని చెప్పేయొచ్చు. కానీ సందీప్ డార్లింగ్ ను ఏ రకంగా చూపిస్తాడా అనేదే అందరి ఫోకస్. ఇక ఏమౌతుందో చూడాలి. ఈ సినిమా డిసెంబర్ లో సెట్స్ మీదకి వెళ్లనుందంట. అలాగే జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని తెలుస్తుంది. అటు డార్లింగ్ కూడా ఖాళీ లేకుండా వరుస సినిమాలతో బిజీ గా ఉన్నాడు. ఇక స్పిరిట్ సెట్స్ లో డార్లింగ్ ఎప్పుడు జాయిన్ అవుతాడో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibompiabellacasinojojobet girişbahiscasinoMadridbetMadridbetMadridbetMadridbetcasibomgrandpashabet girişJojobetcasibomcasibomcasibomultrabetgrandpashabetjojobetgrandpashabet girişgrandpashabetbetciograndpashabet girişcasibom girişgrandpashabet girişgrandpashabetgrandpashabetholiganbet