iDreamPost
android-app
ios-app

దేవరలోని ఆయుధ పూజ సాంగ్ కు థియేటర్స్ లో మాస్ జాతరే..

  • Published Sep 21, 2024 | 12:05 PM Updated Updated Sep 21, 2024 | 12:05 PM

'Ayudha Pooja Song' In Devara Movie: జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర చిత్రం కోసం ప్రేక్షకులంతా ఇంట్రెస్టింగ్ గా ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పటివరకు సినిమా నుంచి వచ్చిన అప్డేట్స్ తోనే హైప్ లో ఉన్న ప్రేక్షకులు.. ఇప్పుడు తారక్ చెప్పిన విషయాలతో ఇంకాస్త హైప్ లో ఉన్నారు.

'Ayudha Pooja Song' In Devara Movie: జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర చిత్రం కోసం ప్రేక్షకులంతా ఇంట్రెస్టింగ్ గా ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పటివరకు సినిమా నుంచి వచ్చిన అప్డేట్స్ తోనే హైప్ లో ఉన్న ప్రేక్షకులు.. ఇప్పుడు తారక్ చెప్పిన విషయాలతో ఇంకాస్త హైప్ లో ఉన్నారు.

  • Published Sep 21, 2024 | 12:05 PMUpdated Sep 21, 2024 | 12:05 PM
దేవరలోని ఆయుధ పూజ సాంగ్ కు థియేటర్స్ లో మాస్ జాతరే..

మ్యాన్ ఆఫ్ ది మాసెస్ ఆగమనానికి ఇంకా ఎన్నో రోజుల సమయం లేదు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవరతో వచ్చేస్తున్నాడు బాక్స్ ఆఫీస్ ఊపిరి పీల్చుకోవాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు దేవరపై ఉన్న హైప్ అలాంటిది . ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఆరేళ్ళ తర్వాత తారక్ సోలోగా వెండి తెరపై కనిపించబోతున్నాడు. ఇప్పటివరకు సినిమా నుంచి వచ్చిన ప్రతి అప్ డేట్ కు..అంతకు మించిన హైప్ క్రియేట్ అవుతూ ఉంది. ఇక ఈ సినిమా రికార్డ్స్ క్రియేట్ చేయడం మాత్రమే బ్యాలన్స్. అయితే ఇప్పటివరకు దేవరపై అంచనాలు ఒకెత్తయితే.. ఇప్పుడు తారక్ తాజాగా దేవర షూటింగ్ గురించి చెప్పిన మాటలతో.. ఈ సినిమాపై పెరిగిన అంచనాలు మరొక ఎత్తు. ముఖ్యంగా ఈ సినిమాలోని ఆయుధ పూజ సాంగ్ కు మొదటి నుంచి ఎలాంటి హైప్ కొనసాగుతుందో చూస్తూనే ఉన్నాము. ఇప్పడు తారక్ కొరటాలా కూడా ఇదే విషయాన్నీ చెప్పారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

దేవర ప్రమోషన్స్ లో భాగంగా.. తాజాగా సిద్ధు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్ తో ఓ ఇంటర్వ్యూ చేశారు కొరటాల శివ , ఎన్టీఆర్. ఈ ఇంటర్వ్యూ అంతా కూడా ఫుల్ ఫన్ గా కొనసాగింది. దేవర మూవీ షూటింగ్ సమయంలో జరిగిన ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను ఈ ఇంటర్వ్యూలో పంచుకున్నారు ఈ ఇద్దరు. దేవర మొత్తంగా తీస్తే ఏకంగా 8 నుంచి 9 గంటల సినిమా అవుతుందని.. ఇది చాలా ఇంటెన్స్ మూవీ అని కూడా చెప్పుకొచ్చారు. అయితే ఈ మూవీలో చాలా క్లిష్టమైన సిక్వెన్స్ ఏదైనా ఉందంటే అది ఆయుధ పూజ సాంగ్ అంటూ .. ఆయుధ పూజ షూటింగ్ ను ఫస్ట్ షెడ్యూల్ లో మొదలుపెట్టి.. ఇదే పాటతో గుమ్మడి కాయ కొట్టం అని అన్నారు. ఇదొక భారీ సెట్ అప్ అంటూ.. ఈ ఎపిసోడ్ మూవీలో చాలా కీలకం , స్టార్ క్యాస్టింగ్ కూడా ఉంటుందని చెప్పుకొచ్చారు. మొదటి నుంచి కూడా ఈ సాంగ్ పై ఫుల్ హైప్ ఉంది. ఇక ఇప్పుడు ఏకంగా తారక్ , కొరటాల శివ నుంచే ఇలాంటి మాటలు రావడంతో.. ఇప్పటివరకు ఈ సాంగ్ పై ఉన్న హైప్ నెక్స్ట్ లెవెల్ కు వెళ్ళిపోయింది. దీనిని బట్టి చూస్తే ఈ సాంగ్ కు థియేటర్స్ తగలబడిపోవడం ఖాయం అని కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు.

అయితే మేకర్స్ ఇచ్చిన అప్ డేట్ ప్రకారం ఇప్పటికే ఈ సాంగ్ ను రిలీజ్ చేయాల్సి ఉంది. కానీ ఎందుకో పోస్ట్ పోన్ చేశారు. చూడబోతుంటే డైరెక్ట్ గా థియేటర్స్ లో ప్రేక్షకులకు ఫుల్ మీల్స్ పెట్టడం కోసమే.. సాంగ్ ను పోస్ట్ పోన్ చేశారేమో అనిపిస్తుంది. ఏదేమైనా దేవర రిలీజ్ పై ఫుల్ హైప్ తో ఉన్నారు ప్రేక్షకులు. హిట్ కొట్టడం అయితే పక్కా అందులో ఎలాంటి సందేహం లేదు. ఇక కేవలం ఎలాంటి రికార్డ్స్ బ్రేక్ చేస్తాడు అనే విషయం మాత్రం బ్యాలన్స్. మూవీ రిలీజ్ కు కొన్ని రోజుల సమయం మాత్రమే ఉండడంతో.. ప్రీ రిలీజ్ ఈవెంట్ పనులు , ప్రమోషన్స్ , టికెట్ బుకింగ్స్ అన్ని కూడా చాలా వేగంగా కొనసాగుతున్నాయి. సెప్టెంబర్ 27న థియేటర్స్ ఏమై పోతాయో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibombetciograndpashabet