iDreamPost
android-app
ios-app

పుష్ప 2 నార్త్ బెల్ట్ లో అందరి ఫోకస్ ఆ నెంబర్ మీదే..!

  • Published Nov 19, 2024 | 3:35 PM Updated Updated Nov 19, 2024 | 3:35 PM

Pushpa 2 Updates: ఒక్క ట్రైలర్ తో సినిమా మీద అంచనాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. తెలుగు , హిందీ భాషలలో ఈ ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తుంది. ముఖ్యంగా నార్త్ బెల్ట్ లో ఓ చిన్న ట్రైలర్ పెద్ద సునామినిని సృష్టించిందని చెప్పి తీరాల్సిందే.అంచనాలు తారా స్థాయిలో పెరిగిపోయాయి. నార్త్ లో అప్పుడే బెట్టింగ్స్ , పోల్స్ మొదలయ్యాయి.

Pushpa 2 Updates: ఒక్క ట్రైలర్ తో సినిమా మీద అంచనాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. తెలుగు , హిందీ భాషలలో ఈ ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తుంది. ముఖ్యంగా నార్త్ బెల్ట్ లో ఓ చిన్న ట్రైలర్ పెద్ద సునామినిని సృష్టించిందని చెప్పి తీరాల్సిందే.అంచనాలు తారా స్థాయిలో పెరిగిపోయాయి. నార్త్ లో అప్పుడే బెట్టింగ్స్ , పోల్స్ మొదలయ్యాయి.

  • Published Nov 19, 2024 | 3:35 PMUpdated Nov 19, 2024 | 3:35 PM
పుష్ప 2 నార్త్ బెల్ట్ లో అందరి ఫోకస్ ఆ నెంబర్ మీదే..!

ఒక్క ట్రైలర్ తో సినిమా మీద అంచనాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. తెలుగు , హిందీ భాషలలో ఈ ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తుంది. ముఖ్యంగా నార్త్ బెల్ట్ లో ఓ చిన్న ట్రైలర్ పెద్ద సునామినిని సృష్టించిందని చెప్పి తీరాల్సిందే. అక్కడ ప్రేక్షకులు ఈ సినిమాకు విపరీతంగా కనెక్ట్ అయిపోయారు. ఈ సినిమా కోసం చాలా ఎగ్జైటింగ్ గా ఎదురుచూస్తున్నారు. పాట్నా లో జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ ను అందుకుంది. మీడియా , సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా పుష్ప గురించే టాక్ నడుస్తుంది. ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో బన్నీని బీహార్ ప్రజలు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. ఇప్పటివరకు ఈ రేంజ్ క్రేజ్ ఎవరికీ లభించలేదనే చెప్పాలి. బన్నీ కంటే కూడా పుష్ప రాజ్ తోనే ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు. దీనితో నార్త్ లోనే ప్రధాన పట్టణాల్లో మరొక ఆరు మెగా ప్రమోషనల్ ఈవెంట్స్ ను ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

పుష్ప 2 ట్రైలర్ కు విపరీతమైన రెస్పాన్స్ రావడంతో.. అంచనాలు తారా స్థాయిలో పెరిగిపోయాయి. నార్త్ లో అప్పుడే బెట్టింగ్స్ , పోల్స్ మొదలయ్యాయి. అక్కడ ఈ మూవీ మొదటి రోజు సుమారు 60 కోట్లకు పైగా కలెక్ట్ చేస్తుందని టాక్ నడుస్తుంది. అయితే ఇది కేవలం బేసిక్ నెంబర్ మాత్రమనట. సినిమాకు ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా కానీ.. దాదాపు 70 నుంచి 80 కోట్ల మధ్యలో నెట్ వసూళ్లు చేసే అవకాశం ఉన్నట్లు అంచనా . ఒకవేళ అదే కనుక జరిగితే.. కచ్చితంగా నార్త్ లో ఓ హీరో రికార్డ్ ను బ్రేక్ చేసినట్లే. సుమారు 70 కోట్లకు పైగా కలెక్ట్ చేస్తే.. కచ్చితంగా జవాన్ మూవీ ఫస్ట్ డే కలెక్షన్ రికార్డ్స్ బ్రేక్ అవుతాయి. జవాన్ మూవీ మొదటి రోజు 65 కోట్లు కలెక్ట్ చేసింది. ఆ నెంబర్ దాటితే.. హిందీలో నెంబరు వన్ హీరోగా బన్నీ జెండా పాతెయ్యడం కన్ఫర్మ్. ఇప్పటికే ట్రైలర్ తర్వాత వస్తున్న రెస్పాన్స్ అంతా ఇంతా కాదు. పుష్ప రాజ్ కు నార్త్ లో డై హార్ట్ ఫ్యాన్స్ ఉన్నారని రీసెంట్ గా జరిగిన ఈవెంట్ తో స్పష్టమౌతుంది. సో కచ్చితంగా ఈ మూవీ సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని చెప్పి తీరాల్సిందే.

సినిమాకు చాలా కొద్దీ రోజుల సమయం మాత్రమే ఉంది. షూటింగ్ కూడా కంప్లీట్ అయినట్లు సమాచారం. ఇక మిగిలింది పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ మాత్రమే. ఆ పనులన్నీ కూడా శరవేగంగా జరుపుతున్నారు పుష్ప టీం. ట్రైలర్ కు ఈ రేంజ్ లో రెస్పాన్స్ రావడంతో.. సినిమా ప్రమోషన్స్ , రిలీజ్ విషయంలో ఇంకాస్త జాగ్రత్త వహిస్తున్నారు మేకర్స్. ఇక ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు కూడా మరింత ఊపందుకుంటున్నాయి. కచ్చితంగా ఈ సినిమా అందరికి లాభాలను తెచ్చిపెడుతుందని మూవీ టీం భావిస్తున్నారు. డిసెంబర్ 5 తర్వాత కానీ అసలు లెక్కలు బయటకు రావు. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetganobetgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom