iDreamPost
android-app
ios-app

ఈ ఫోటోలో నటిని గుర్తుపట్టారా..? ఒక్క పాటతోనే ఫేమస్ అయ్యింది

  • Published Aug 26, 2024 | 11:33 AM Updated Updated Aug 26, 2024 | 11:33 AM

ఈ ఫోటోలో నటిని గుర్తుపట్టారా.. ఒక్క పాటతోనే దేశ వ్యాప్తంగా ఫేమ్ తెచ్చుకుంది. తన ఇండస్ట్రీలోనే కాదు.. తెలుగు ఆడియన్స్ ను ఫిదా చేసింది. ఇంతకు ఆ బ్యూటీ ఎవరంటే..?

ఈ ఫోటోలో నటిని గుర్తుపట్టారా.. ఒక్క పాటతోనే దేశ వ్యాప్తంగా ఫేమ్ తెచ్చుకుంది. తన ఇండస్ట్రీలోనే కాదు.. తెలుగు ఆడియన్స్ ను ఫిదా చేసింది. ఇంతకు ఆ బ్యూటీ ఎవరంటే..?

  • Published Aug 26, 2024 | 11:33 AMUpdated Aug 26, 2024 | 11:33 AM
ఈ ఫోటోలో నటిని గుర్తుపట్టారా..? ఒక్క పాటతోనే ఫేమస్ అయ్యింది

ఈ ఫోటోలో కనిపిస్తున్న బ్యూటీని గుర్తు పట్టారా..? త్వరలోనే తెలుగులోకి ఎంట్రీ (యాక్చువల్‌గా రీ ఏంట్రీ) ఇవ్వబోతుంది. అయితే అంతకు ముందే ఆమె ఒక్క పాటతోనే క్లిక్ అయ్యింది. అది తెలుగు సాంగ్ కూడా కాదు. మలయాళీ సాంగ్. అంతేనా తన డబ్బింగ్ చిత్రాలతో ఇక్కడ కూడా పేరు తెచ్చుకుంది. ఇంతకు ఆ నటి ఎవరంటే.. దర్శన రాజేంద్రన్. మలయాళీ హిట్ మూవీ హృదయంలో ‘దర్శనా.. సర్వం సదా నిన్ సౌరభం.. దర్శనా’ హీరో పాడుతుంటే.. మన గుండెల్లోకి చొచ్చుపోయిందీ ఆ పాట. ఇందులో నటించిన బ్యూటీనే దర్శన. మాలీవుడ్ హీరోయిన్లకు కామన్‌గా ఉండే..రింగు రింగు జుట్టుతో కేరళ కుర్రాళ్లనే కాదు.. తెలుగు ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. పాటతోనే కాదు తన డబ్బింగ్ చిత్రాలతోనూ మెప్పించింది. తొలుత సెకండ్ హీరోయిన్ రోల్స్ చేసిన ఆమె.. ఇప్పుడు మెయిన్ లీడ్ చేస్తూ.. మాలీవుడ్ టాప్ మోస్ట్ హీరోయిన్స్ జాబితాలోకి చేరింది.

ఇప్పుడు మీరు చూస్తున్న పిక్.. మూడు ముక్కల్లో చెప్పాలంటే అనే సినిమాలోనిది. ప్రముఖ లిరిసిస్ట్ వెన్నెల కంటి కుమారుడు, లిరిసిస్ట్ కం సింగర్ కం డైలాగ్ రైటర్ రాకేందు మౌళిని హీరోగా పరిచయం చేస్తూ ప్రముఖ స్టార్ సింగర్, గానగంధర్వుడు ఎస్ పి బాలసుబ్రమణ్యం కుమారుడు ఎస్ పి చరణ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇది బైలింగ్వల్ మూవీ. తమిళంలో మూన్ మూను వార్తై. 2015 మార్చిలో తెలుగులో రిలీజ్ కాగా, రెండు నెలల ఆలస్యంగా తమిళంలో విడుదలయ్యింది. ఇందులో రాకేందు మౌళి, వెంకటేశ్ హరినాథన్, అదితి చెంగప్ప, దర్శనా కీలక రోల్స్ చేశారు. ఇదొక కామెడీ లవ్ డ్రామా. తమిళంలో రాకేందు మౌళి పాత్రను తమిళంలో అర్జున్ చిదంబరం పోషించాడు. ఇందులో దర్శన కీర్తిగా హీరోయిన్ ఫ్రెండ్‌గా కనిపిస్తుంది. వెంకటేశ్ హరినాథ్‪కు పెయిర్‌గా ఈ బ్యూటీ యాక్ట్ చేసింది.

కేరళలో పుట్టిన ఈ అమ్మడు.. ఢిల్లీ, లండన్ లో ఉన్నత విద్యాభ్యాసం పూర్తి చేసింది. తర్వాత నటనపై ఆసక్తితో 2014లో మలయాళ ఇండస్ట్రీలోకి కాలు మోపింది. ఆ తర్వాత మూడు ముక్కల్లో చెప్పాలంటే అనే బైలింగ్వల్ మూవీతో తమిళ్, తెలుగులోకి ఇంట్రడ్యూస్ అయ్యింది. ఈ సినిమా వచ్చినట్లు, వెళ్లినట్లు కూడా తెలియకపోవడంతో అంత ఫోకస్ కాలేదు దర్శన. కానీ ఆ తర్వాత మలయాళం, తమిళ చిత్రాల్లో నటిస్తూ తన గ్రేస్ పెంచుకునేందుకు ప్రయత్నాలు చేసింది. తను నటించిన సినిమాలు సక్సెస్ కావడంతో స్టార్ మెయిన్ యాక్టర్‌గా కెరీర్ స్టార్ట్ చేసింది. ఆమె కెరీర్‌కు ప్లస్ అయిన మూవీ హృదయం. దీంతో ఒక్కసారిగా ఫేమ్ వచ్చింది. జయ జయ జయ జయ హే తెలుగులో కూడా ఓటీటీలో రిలీజై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ మూవీలో ఆమె నటనకు ఫిల్మ్ ఫేర్ బెస్ట్ యాక్టర్‌గా అవార్డు అందుకుంది. పురుష ప్రీతమ్, ప్యారడేజ్ చిత్రాలతో ఆకట్టుకున్న ఆమె.. ఇప్పుడు విజయ్ దేవరకొండ నిర్మాతగా తెరకెక్కుతోన్న పరదాలో నటిస్తుంది. ఇందులో మరో మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ యాక్ట్ చేస్తుంది.

 

View this post on Instagram

 

A post shared by Darshana Rajendran (@darshanarajendran)

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş