iDreamPost
android-app
ios-app

‘Honey Bunny: హనీ బన్నీ: ఇండియన్ సిటాడెల్ వెర్షన్ లో వరుణ్ ధావన్ – సమంత

  • Published Mar 19, 2024 | 3:29 PM Updated Updated Mar 19, 2024 | 3:29 PM

వరుణ్ ధావన్, సమంత రుత్ ప్రభు జంటగా ఉన్న ఈ పోస్టర్ చూస్తుంటే ఈ సీరీస్ లో ఉత్కంఠభరితమైన యాక్షన్ ఉంటుందని చెప్పకనే చెప్పారు.స్పై యాక్షన్ థ్రిల్లర్ సిరీస్ "సిటాడెల్" ను ఇండియన్ వెర్షన్ లో హనీ బన్నీ" గా అందిస్తున్నారు.

వరుణ్ ధావన్, సమంత రుత్ ప్రభు జంటగా ఉన్న ఈ పోస్టర్ చూస్తుంటే ఈ సీరీస్ లో ఉత్కంఠభరితమైన యాక్షన్ ఉంటుందని చెప్పకనే చెప్పారు.స్పై యాక్షన్ థ్రిల్లర్ సిరీస్ "సిటాడెల్" ను ఇండియన్ వెర్షన్ లో హనీ బన్నీ" గా అందిస్తున్నారు.

  • Published Mar 19, 2024 | 3:29 PMUpdated Mar 19, 2024 | 3:29 PM
‘Honey Bunny: హనీ బన్నీ: ఇండియన్ సిటాడెల్ వెర్షన్ లో వరుణ్ ధావన్ – సమంత

“ఫ్యామిలీ మ్యాన్” మరియు “ఫర్జీ” వంటి విజయవంతమైన సిరీస్ ల తరువాత దర్శకులు రాజ్ – డికె ప్రముఖ ఓటీటీ సంస్థ ప్రైమ్ వీడియో కోసం మరొక ఆసక్తికరమైన సీరీస్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అమెరికన్ స్పై యాక్షన్ థ్రిల్లర్ సిరీస్ “సిటాడెల్” ను ఇండియన్ వెర్షన్ లో హనీ బన్నీ” గా అందిస్తున్నారు. ఇద్దరి గూఢచారుల మధ్య ప్రేమ కథతో పాటు యాక్షన్ ఎలిమెంట్స్ కలిగిన ఈ షో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చిత్ర బృందం గట్టి నమ్మకంతో ఉంది. కాగా మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సీరీస్ 90ల బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది.

రిచర్డ్ మాడెన్, ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రలలో నటించిన అమెరికన్ సిరీస్ “సిటాడెల్” ఏప్రిల్ 28, 2023 న ప్రైమ్ వీడియోలో రిలీజ్ అయింది. వారానికి ఆరు ఎపిసోడ్లుగా విడుదలైన ఈ సిరీస్ 2023 మే 26న తన చివరి ఎపిసోడ్ విడుదల చేసింది. ఈ సిరీస్ యొక్క విజయం ఆధారంగా, “సిటాడెల్: హనీ బన్నీ” ఇండియన్ వెర్షన్ రాబోతుంది. సహజంగానే స్పై కాన్సెప్ట్ అంటే ప్రేక్షకులని ఆకర్షిస్తుంది. దాంతో పాటు 90ల కాలం నాటి బ్యాక్ డ్రాప్ మరింత ఆకర్షణను అందిస్తుంది. టెక్నికల్ గా కూడా పీరియడ్ అంటే మంచి విజువల్స్ ఆశించవచ్చు.

ఈ రోజు విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ తో “సిటాడెల్: హనీ బన్నీ” పై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయనే చెప్పాలి. వరుణ్ ధావన్, సమంత రుత్ ప్రభు జంటగా ఉన్న ఈ పోస్టర్ చూస్తుంటే ఈ సీరీస్ లో ఉత్కంఠభరితమైన యాక్షన్ ఉంటుందని చెప్పకనే చెప్పారు. ఇక ఈ సీరీస్ లో భారీ తారాగణం ఉంటుంది. వరుణ్, సంఘాలతో పాటు ఇతర ముఖ్య పాత్రల్లో కే కే మీనన్, సిమ్రాన్, సోహమ్ మజుందార్, శివాంకిత్ పరిహార్, కాష్వి మజ్ముందర్, సకీబ్ సలీం మరియు సికందర్ ఖేర్ వంటి ప్రసిద్ధ నటులు కూడా కనిపిస్తారు. “సిటాడెల్: హనీ బన్నీ” విడుదల కోసం సమంత అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. చివరిగా స్క్రీన్ పై విజయ్ దేవరకొండ తో కలిసి ఖుషి సినిమాలో కనిపించారు సమంత. ఇక ఓటీటీలో నటించడం ఆమెకు కొత్తేం కాదు. రాజ్ – డీకే తెరకెక్కించిన ది ఫ్యామిలీ మ్యాన్ 2 లో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించారు. మరి “సిటాడెల్: హనీ బన్నీ” లో కూడా తనదైన ముద్ర వేస్తారని ఆశిద్దాం.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişcratosroyalbetganobetgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom