iDreamPost
android-app
ios-app

బిగ్ బాస్ విన్నర్ మునావర్ ఫరూఖీ అరెస్ట్.. హుక్కా తాగుతూ..

  • Published Mar 27, 2024 | 11:28 AM Updated Updated Mar 27, 2024 | 11:39 AM

బిగ్ బాస్ విన్నర్స్ పలువురు వరుసగా వివాదాల్లో చిక్కుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు. మొన్న పల్లవి ప్రశాంత్, నిన్న ఎల్విష్ యాదవ్, ఈ రోజు మునావర్ ఫరూఖీ. ఇంతకు అతడు ఏం చేశాడంటే...?

బిగ్ బాస్ విన్నర్స్ పలువురు వరుసగా వివాదాల్లో చిక్కుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు. మొన్న పల్లవి ప్రశాంత్, నిన్న ఎల్విష్ యాదవ్, ఈ రోజు మునావర్ ఫరూఖీ. ఇంతకు అతడు ఏం చేశాడంటే...?

  • Published Mar 27, 2024 | 11:28 AMUpdated Mar 27, 2024 | 11:39 AM
బిగ్ బాస్ విన్నర్ మునావర్ ఫరూఖీ అరెస్ట్.. హుక్కా తాగుతూ..

బుల్లితెరపై ఎంటర్ టైన్ చేస్తున్న అతి పెద్ద రియాలిటీ షో బిగ్ బాస్. విదేశాల నుండి పాకిన ఈ గేమ్ షో.. ఇప్పుడు ఇండియా వ్యాప్తంగా విశేషమైన ఆదరణ నెలకొంటుంది. కొంత మంది సెలబ్రిటీలను ఓ ఇంట్లో బంధించి.. వారికి కొన్ని టాస్కులు ఇచ్చి.. ఫన్ క్రియేట్ చేసి.. వాటిని కాప్చర్ చేసి ప్రేక్షకులకు అందిస్తున్నాయి వివిధ ఛానల్స్. హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ, మరాఠీ, బెంగాలి, మలయాళ భాషల్లో ప్రసారం అవుతుంది. ఇందులో అనామకులుగా ఎంట్రీ ఇచ్చి సెలబ్రిటీల హోదాతో తిరిగి వచ్చిన వాళ్లు ఉన్నారు. అలాగే కాస్త నేమ్ ఉన్నవాళ్లు వెళ్లి.. సినిమా ఆఫర్లను కొల్లగొడుతున్నారు. కానీ బయటకు వచ్చాక మాత్రం వివాదాలతో పాటు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ.. అరెస్టు అవుతున్నారు.

తెలుగు బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్, రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్.. పోలీసులు ఉత్తర్వులు బేఖాతరు చేస్తూ ర్యాలీ చేపట్టడంతో అరెస్టైన సంగతి విదితమే. నిన్నటికి నిన్న బిగ్ బాస్ హిందీ ఓటీటీ సీజన్ 2 విన్నర్ ఎల్విష్ యాదవ్.. రేవ్ పార్టీలకు పాముల విషాన్ని సరఫరా చేసిన ఆరోపణలపై జైలు పాలయ్యాడు. తాజాగా మరో విన్నర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రముఖ స్టాండప్ కమెడియన్, హిందీ బిగ్ బాస్ సీజన్ 17 విజేత మునావర్ ఫరూఖీని పోలీసులు అరెస్టు చేశారు. ముంబయిలోని బోరా బజారులో ఉన్న సబలన్ హుక్కా బార్‌పై అర్థరాత్రి రైడ్ చేయగా.. ఫరూఖీతో సహా 13 మందిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

హెర్బల్ హుక్కా ముసుగులో పొగాకుతో కూడిన హుక్కాను కస్టమర్లు వినియోగిస్తున్నారన్న సమాచారంతో రైడ్ చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. పొగాకు హుక్కా పీల్చడం చట్ట రీత్యా నేరమని వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామని, నిందితుల్ని విచారించిన తర్వాత.. విడుదల చేసినట్లు ముంబయి పోలీసులు వెల్లడించారు. మంగళవారం రాత్రి 10.30 గంటల ప్రాంతంలో దాడులు నిర్వహించగా.. బుధవారం ఉదయం 5 గంటల వరకు ఆపరేషన్ కొనసాగిందని పేర్కొన్నారు. స్టాండ్ కప్ కమెడియన్.. బిగ్ బాస్ తాజా సీజన్ విన్నర్ మునావర్ ఫరూఖీ హుక్కా తాగినట్లు గుర్తించామని అన్నారు. వీరిపై సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తుల చ ట్టంతో పాటు ఇండియన్ పీనల్ కోడ్‌లోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş