iDreamPost
android-app
ios-app

కలెక్షన్ల సునామీ సృష్టించిన ‘బార్బీ’.. ఏకంగా అన్నివేల కోట్లా!

  • Published Nov 23, 2023 | 11:48 AM Updated Updated Nov 23, 2023 | 11:48 AM

2023 లో రిలీజ్ అయిన చాలా చిత్రాలు మంచి హిట్ టాక్ తెచ్చుకొని భారీ వసూళ్లు రాబట్టాయి. హాలీవుడ్ లో కొన్ని సినిమాలు ప్రపంచ వ్యాప్తంగా వేల కోట్లు రాబట్టాయి.

2023 లో రిలీజ్ అయిన చాలా చిత్రాలు మంచి హిట్ టాక్ తెచ్చుకొని భారీ వసూళ్లు రాబట్టాయి. హాలీవుడ్ లో కొన్ని సినిమాలు ప్రపంచ వ్యాప్తంగా వేల కోట్లు రాబట్టాయి.

  • Published Nov 23, 2023 | 11:48 AMUpdated Nov 23, 2023 | 11:48 AM
కలెక్షన్ల సునామీ సృష్టించిన ‘బార్బీ’.. ఏకంగా అన్నివేల కోట్లా!

ప్రపంచాన్ని వణికించిన కరోనా మనుషుల ప్రాణాలే కాదు.. వ్యాపార రంగాన్ని కూడా కుదేలు చేసింది. కరోనా ప్రభావం ఎక్కువగా సినీ ఇండస్ట్రీపై పడింది. ఆ సమయంలో ఎక్కువగా ఓటీటీకే సినిమాలు పరిమితం అయ్యాయి. కరోనా ప్రభావం తగ్గిన తర్వాత మళ్లీ ఇండస్ట్రీ కాస్త పుంజుకుంటుంది. ఈ ఏడాది ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు రిలీజ్ అయ్యాయి.. వాటిలో కొన్ని సినిమాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.. కొన్ని చిత్రాలు మంచి కంటెంట్ తో హిట్ అయ్యాయి. మొత్తానికి ఈ సంవత్సరం ఇండస్ట్రీ మార్కెట్ బాగానే నడిచిందని వార్తలు వస్తున్నాయి. హాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ‘బార్బీ’ మూవీ వేల కోట్లు వసూళ్ళు చేసింది. ఈ మూవీతో పాటు మరికొన్ని చిత్రాలు కూడా భారీ కలెక్షన్లు సాధించాయి.

ఈ ఏడాది జూలె 21 న రిలీజ్ అయిన హాలీవుడ్ మూవీ ‘బార్బీ’ ఘన విజయం సొంతం చేసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఈ సంవత్సరం అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రాల్లో బాకీ ప్రత్యేక స్థానంలో నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ ఏకంగా రూ.8 వేల పైగా కోట్లు వసూళ్లు చేసినట్లు ఇండస్ట్రీ టాక్. గ్రెటా గెర్విగ్ దర్శకత్వంలో వచ్చిన ఫాంటసీ కామెడీ మూవీ బార్బీ. ఈ చిత్రంలో హాలీవుడ్ స్టార్స్ మార్గోట్ రాబీ, ర్యాన్ గోస్లింగ్, విల్ ఫెర్రల్, అమెరికా ఫెరెరా, సిము లియులు, కెట్ మెక్ కిన్నన్, ఇస్సారె తదితరులు నటించారు. మొదటి ఈ మూవీని యునైటెడ్ స్టేట్స్‌లో రిలీజ్ చేశారు.. ఆ తర్వాత ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీకి మంచి ఆదరణ లభించి బ్లాక్ బస్టర్ విజయం సాధించింది.

ప్రపంచ వ్యాప్తంగా బార్బీ మూవీతో పాటు మరికొన్ని చిత్రాలు కూడా భారీ విజయాన్ని తమ ఖాతాలో వేసుకున్నాయి. బార్బీ సినిమా తర్వాత ఆ రేంజ్ లో కలెక్షన్లు వసూళ్లు చేసిన చిత్రం ‘సూపర్ మారియో బ్రోస్’. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 1.35 బిలియన్ డాలర్ల మేర కలెక్షన్లు సాధించింది. ఈ చిత్రంలో అన్య టేలర్ – జాయ్, క్రిస్ ప్రాట్, సేథ్ రోజెన్, జాక్ బ్లాక్ నటించారు. ఈ మూవీ రిలీజ్ అయినప్పటి నుంచి హిట్ టాక్ సాధించి ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. గార్డియన్స్ ఆఫ్ ది గ్యాలక్సీ వోల్యూమ్స్ 3. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఘన విజయం అందుకొని 845 మిలియన్ డాలర్ల మేర కలెక్షన్లు సాధించింది. హాలీవుడ్ స్టార్ హీరో విన్ డిజిల్ నటించిన ఫాస్ట్ ఎక్స్ మూవీ భారీ విజయం అందుకుంది. యాక్షన్ ఓరియెంటెడ్ చిత్రంగా ప్రపంచ వ్యాప్తంగా 704 మిలియన్ డాలర్ల మేర కలెక్షన్లు రాబట్టింది.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş