రికార్డు ధర పలుకుతున్న ‘సలార్’ ఓటిటి రైట్స్! ఎన్ని కోట్లంటే..?

  • Author ajaykrishna Published - 01:23 PM, Sat - 15 July 23
  • Author ajaykrishna Published - 01:23 PM, Sat - 15 July 23
రికార్డు ధర పలుకుతున్న ‘సలార్’ ఓటిటి రైట్స్! ఎన్ని కోట్లంటే..?

 

డార్లింగ్ ప్రభాస్ హీరోగా దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన పాన్ ఇండియా మూవీ ‘సలార్’. కేజీఎఫ్ సిరీస్ తర్వాత ప్రశాంత్ చేస్తున్న సినిమా ఇది. పైగా ప్రభాస్ లాంటి బిగ్గెస్ట్ స్టార్ ఎంటర్ అయ్యేసరికి సినిమాపై అంచనాలు పీక్స్ కి చేరుకున్నాయి. అందుకు శాంపిల్ గా ఇటీవల సలార్ టీజర్ రిజల్ట్ తెలిసిందే. ఈ ఏడాది సెప్టెంబర్ 28న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా కోసం.. ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు అంతలా ఎదురు చూస్తున్నారు. కేజీఎఫ్, కాంతార సినిమాలు ప్రొడ్యూస్ చేసిన హోంబలే ఫిలిమ్స్ వారే సలార్ ని కూడా నిర్మించారు. ఆల్రెడీ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. త్వరలో మూవీ ప్రమోషన్స్ కూడా స్టార్ట్ కాబోతున్నాయని తెలుస్తోంది.

 

ఇక సలార్ మూవీ.. మాస్ గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కింది. ప్రశాంత్ నీల్ క్రియేట్ చేసిన సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా.. కేజీఎఫ్ సిరీస్ కి కొనసాగింపుగా.. సలార్ వస్తోంది. ముఖ్యంగా కేజీఎఫ్ 2లో రాఖీభాయ్ కి, సలార్ కి ఉన్న లింక్? రాఖీభాయ్ చనిపోయాక ఏం జరిగింది? అనే విషయాలపై ప్రేక్షకులలో ఊహలకు అందని రేంజ్ లో కథనాలు, సందేహాలు నిండి ఉన్నాయి. అయితే.. సలార్ మూవీకి ఉన్న క్రేజ్.. ప్రెజెంట్ ఇండియాలో ఏ మూవీకి కనిపించడం లేదు. ఇప్పటికే థియేట్రికల్ రైట్స్ కోసం భారీ స్థాయిలో డిమాండ్ ఏర్పడినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. పైగా హిట్ టాక్ వస్తే చాలు.. సలార్ రికార్డులను తిరిగి రాయబోతుందని అంటున్నారు.

 

ఈ క్రమంలో సలార్ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్(ఓటిటి హక్కులు) కోసం దిగ్గజ ఓటిటిల మధ్య తీవ్రమైన పోటీ వాతావరణం నెలకొందని సమాచారం. హిందీతో పాటు సౌత్ భాషలన్నీ కలిపి ఒకే బిగ్ డీల్ కుదుర్చుకోవాలని ఓటిటి సంస్థలు చూస్తున్నాయట. సలార్ కోసం ఎంత పెట్టడానికైనా వెనుకడుగు వేసే వీలు లేదనే విధంగా ప్రస్తుతం ఓటిటిలు రెడీగా ఉన్నాయని తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం.. సలార్ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ సుమారు రూ. 200 కోట్ల వరకు పలుకుతున్నట్లు టాక్. వినిపిస్తున్న ఓటిటి రైట్స్ ప్రైస్ బట్టి.. సినిమాకి ఏ రేంజ్ లో డిమాండ్ ఉందో అర్ధమవుతుంది. ఒకవేళ అదే నిజమైతే.. సినిమాకి ఆల్రెడీ 70% పైగా కవర్ అయినట్లే అని ట్రేడ్ వర్గాల అంచనా. ఆ తర్వాత సాటిలైట్ రైట్స్ నుండి వచ్చేది అదనపు ప్లస్ అవుతుంది. సో.. దీనిపై అధికారిక ప్రకటన వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే. మరి సలార్ మూవీపై మీ అభిప్రాయాలు కామెంట్స్ లో తెలపండి.

Show comments