Somesekhar
యానిమల్ సునామీలో చాలా సినిమాలు కొట్టుకుపోయాయి. కానీ నాచురల్ స్టార్ నాని నటించిన హాయ్ నాన్న మూవీ మాత్రం యానిమల్ దెబ్బను తట్టుకుని నిలబడి, సక్సెస్ సాధించింది.
యానిమల్ సునామీలో చాలా సినిమాలు కొట్టుకుపోయాయి. కానీ నాచురల్ స్టార్ నాని నటించిన హాయ్ నాన్న మూవీ మాత్రం యానిమల్ దెబ్బను తట్టుకుని నిలబడి, సక్సెస్ సాధించింది.
Somesekhar
ప్రపంచవ్యాప్తంగా యానిమల్ క్రియేట్ చేసిన సునామీలో పడి చాలా సినిమాలు కోట్టుకుపోయాయి. దాదాపు ఏడువందల కోట్లకు పై చిలుకు వసూళ్లతో అన్ని భాషలలో పరిశ్రమలు దద్దరిల్లిపోయాయి. యానిమల్ దెబ్బకు కొన్ని రిలీజులు కూడా సందిగ్ధంలో పడిపోయాయి అంటే విచిత్రంగానే అనిపించినా అది నిజం. ఏకంగా షారుఖ్ ఖాన్ నటించిన డుంకీ కూడా పిల్లిమొగ్గలు వేయకతప్పలేదు. ఇంక రిలీజైన సినిమాల విషయానికొస్తే గనక తెలుగులోనే బాగానే ఉందనిపించినా కూడా ఎక్స్ ట్రా ఆర్డినరీ మేన్ నామరూపాలు లేకుండా పోయింది. నితిన్, వక్కంతం వంశీ కాంబో పెద్ద ఫెయిల్యూర్నే ఫేస్ చేయాల్సివచ్చింది. కానీ యానిమల్ ఎదుర్కొని నిలబడి పోటీలో విజయవంతంగా ముందుకెళ్లిందంటే అదొక్క ‘హాయ్ నాన్న’ సినిమా అనే చెప్పుకోవాలి.
ఎక్స్ ట్రా ఆర్డినరీ మేన్, హాయ్ నాన్న మూవీలు పక్కపక్క తేదీలలోనే విడుదలైయ్యాయి. సరే నాని పాపులరిటీ, ఫాలోయింగ్ వేరే లెవెల్లో ఉంటుంది కాబట్టి దాని గురించే ఎక్కువ ఎదురుచూపులు కొనసాగాయి. డిసెంబర్ 7వ తేదీన రిలీజైన హాయ్ నాన్న సినిమాకి అభినందనీయమైన రివ్యూలే వచ్చాయి. నాని ప్రజంటేషన్ని టోటల్గా అందరూ మెచ్చుకున్నారు. దీనికి తోడు మృణాల్ ఠాకూర్ సినిమాకి చాలా పెద్ద ప్లస్ పాయింట్ అయింది. సీతారామం సినిమాతో తిరుగులేని పాపులారిటీని, ఫేంని సంపాదించుకున్న ఆమెకు హాయ్ నాన్న చిత్రంలో పోషించిన పాత్ర అనుకోని వరంలా వచ్చింది. నానికున్న ఎలివేషన్ నానికుండనే ఉంది. పాటలు బావున్నాయి. ఇవన్నీ ఈ మూవీ థియేటర్స్ లో నిలబడగలగడానికి దోహదపడ్డాయి. నాని ఓవర్ సీస్ లో పబ్లిసిటీ కేంపైనింగ్ చాలా ఇంట్రస్టింగ్ గా చేశాడు. దసరా సినిమా తర్వాత మళ్లీ హాయ్ నాన్న సినిమాకే అమెరికా వెళ్లాడు నాని.
అయితే తెలుగు రాష్ట్రాలలో టాక్, ప్లస్ కలెక్షన్లు అంత గొప్పగా లేకపోయినా సరే, ఓవర్ సీస్ రిపోర్ట్ మాత్రం హాయ్ నాన్నకి భలే యాడ్ అయిందనే చెప్పాలి. నానికి కలెక్షన్ల రూపంలో బ్రహ్మరథం పట్టేశారు అక్కడి వాళ్ళు. మొత్తానికి హాయ్ నాన్న సినిమా బ్రేక్ ఈవెన్ దారిలోకి వచ్చింది. అదే ఇప్పుడు పెద్ద పండగలా అయిపోయింది. ఏ సినిమా రిలీజైతే అది బాంబ్ పేలినట్టు పేలుతోంది. అలాటి టైంలో, యానిమల్ స్వైరవిహారం చేస్తుండగా, ఈ పిల్లతెమ్మెరలాంటి సినిమా బ్రతికి బట్ట కట్టిందంటే మాటలు కాదు. న్యూ ఏజ్ ఫిల్మ్ గా యానిమల్ తీసుకొచ్చిన సంచలనం ముందు పడిపోకుండా నిలబడిదంటే ఈ మూవీని నిజంగా మెచ్చుకోవాలి. జనం ఆదరిస్తున్నారు. నానికి మంచి పేరొచ్చింది. అతని ఇమేజ్ మళ్ళీ మరోసారి రుజువైంది. అందుకే ఇటువంటి విజయాన్ని ఎంజాయ్ చేయడానికే అన్నట్టు, హాయ్ నాన్న టీం ఆదివారం సాయంత్రం రామానాయుడు స్టూడియోలో సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. టీం అందరూ ఉప్పొంగిపోయి మరీ మాట్లాడారు. కాగా.. సాఫ్ట్ ఫిల్మ్స్ ఆడాలంటే ఈ రోజున ఎంత కష్టం.. అవి ఆడితే వాటి కోసం పని చేసిన కేస్ట్ అండ్ క్రూ ఎంత ఆనందపడతారు అన్నదానికి ప్రత్యక్ష నిదర్శనం హై నాన్న చిత్రమనే చెప్పాలి. మరి యానిమల్ సునామీని తట్టుకుని నిలబడిన ఈ మూవీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.