iDreamPost
android-app
ios-app

తారక్ లైన్ అప్ లిస్ట్ లో ఆ యంగ్ డైరెక్టర్

  • Published Nov 20, 2024 | 6:06 PM Updated Updated Nov 20, 2024 | 6:06 PM

Jr N.T.R Upcoming Movies : ప్రస్తుతం తారక్ వార్ 2 షూటింగ్ లో బిజీ గా ఉన్నాడు. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు వస్తూనే ఉన్నాయి.ఇక ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయిందంటే తర్వాత.. ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ పట్టాలెక్కేస్తుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు తారక్ లైన్ అప్ లో ఓ కొత్త దర్శకుడు ఎంట్రీ ఇచ్చాడు.

Jr N.T.R Upcoming Movies : ప్రస్తుతం తారక్ వార్ 2 షూటింగ్ లో బిజీ గా ఉన్నాడు. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు వస్తూనే ఉన్నాయి.ఇక ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయిందంటే తర్వాత.. ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ పట్టాలెక్కేస్తుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు తారక్ లైన్ అప్ లో ఓ కొత్త దర్శకుడు ఎంట్రీ ఇచ్చాడు.

  • Published Nov 20, 2024 | 6:06 PMUpdated Nov 20, 2024 | 6:06 PM
తారక్ లైన్ అప్ లిస్ట్ లో ఆ యంగ్ డైరెక్టర్

తారక్ కు ఉన్న పాన్ ఇండియా క్రేజ్ గురించి తెలిసిందే. దేవరతో అది మరోసారి ప్రూవ్ అయింది. ఈ సినిమా చాలానే అద్భుతాలు క్రియేట్ చేసింది. దేవర గురించి కథలు కథలుగా చెప్పుకున్నారు. మరి ఒక సినిమా అంత సక్సెస్ అయిందంటే తర్వాత సినిమాల మీద ఇంకాస్త అంచనాలు పెరగడం కామన్. అలానే ఇప్పుడు తారక్ అప్ కమింగ్ లిస్ట్ లో ఉన్న వార్ 2 , ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్స్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం తారక్ వార్ 2 షూటింగ్ లో బిజీ గా ఉన్నాడు. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు వస్తూనే ఉన్నాయి. బాలీవుడ్ లో నేరుగా తారక్ ఎంట్రీ ఇస్తున్న మొదటి సినిమా ఇది. ఈ సినిమాతో అసలు తెలుగు హీరో అంటే ఏంటో బాలీవుడ్ ప్రేక్షకులు చూసే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. దీనితో ఈ సినిమా కోసం అంతా చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయిందంటే తర్వాత.. ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ పట్టాలెక్కేస్తుంది.

ప్రశాంత్ నీల్ సినిమాలు , కథలు ఎలా ఉంటాయో ప్రేక్షకులకు పరిచయం ఉంది. దీనితో తారక్ ను ప్రశాంత్ నీల్ ఎలా చూపించబోతున్నాడా అనే దాని మీదే అందరి ఫోకస్ ఉంది. ఈ సినిమా నుంచి ఎప్పుడెప్పుడు ఏ అప్డేట్స్ వస్తాయా అని తారక్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు తారక్ లైన్ అప్ లో ఓ కొత్త దర్శకుడు ఎంట్రీ ఇచ్చాడు. అతను మరెవరో కాదు హాయ్ నాన్న మూవీ డైరెక్టర్ సౌర్యువ్. ఈ దర్శకుడితో తారక్ సినిమా చేయబోతున్నాడనే టాక్ నడుస్తుంది. ఈ యంగ్ దర్శకుడి స్టోరీకి తారక్ కూడా ఒకే చెప్పినట్లు ఇండస్ట్రీ వర్గాల నుంచి టాక్ నడుస్తుంది. ఆ దర్శకుడు చెప్పిన కథలో పాన్ ఇండియా కనెక్టింగ్ పాయింట్ తో పాటు…ఓ యూనిక్ పాయింట్ కూడా ఉండడంతో తారక్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. దీనిలో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ.. ఒకవేళ నిజం అయితే మాత్రం సౌర్యువ్ కెరీర్ టర్న్ అయినట్లే.

ఓ దర్శకుడిగా సౌర్యువ్ మొదటి సినిమాతోనే మంచి పేరు సంపాదించుకున్నాడు. సో మేకింగ్ పరంగా మంచి మార్కులే పడ్డాయి. కమర్షియల్ పరంగా పర్లేదు అనిపించుకుంది. ఇక ఇప్పుడు ఈ దర్శకుడికి ఎన్టీఆర్ లాంటి హీరో దొరికితే అతని పంట పండినట్లే. అసలే ఇప్పటివరకు తారక్ ప్లాప్ దర్శకుల పాలిట వరంగా మారాడన్న టాక్ ఉంది. ఇక ఇప్పుడు ఈ సినిమా కనుక ఓకే అయితే కొత్త దర్శకులు కూడా తారక్ గుమ్మం ముందు క్యూ కట్టడం ఖాయం. అయితే వార్ 2 తర్వాత ప్రశాంత్ నీల్ సినిమా లైన్ లో ఉంది. అది కంప్లీట్ అవ్వడానికి చాలానే సమయం పడుతుంది. ఆ తర్వాత సౌర్యువ్ ప్రాజెక్ట్ పై క్లారిటీ ఇస్తారు. తారక్ కూడా ఈ మధ్య ఒకేసారి రెండు సినిమాల షూటింగ్ కు అటెండ్ అవుతున్నాడు. ఒకవేళ సౌర్యువ్ ప్రాజెక్ట్ కనుక త్వరగా స్టార్ట్ చేయాలనే ప్లాన్ ఉంటే.. తారక్ ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ తో పాటు ఈ సినిమాను కూడా మొదలు పెట్టె అవకాశం ఉంది. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişmeritbet girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibom