iDreamPost
android-app
ios-app

Shouryuv: యంగ్ టైగర్ తో సినిమా.. హాయ్ నాన్న డైరెక్టర్ ఏమన్నాడంటే?

  • Published Jul 31, 2024 | 9:52 PM Updated Updated Jul 31, 2024 | 9:52 PM

హాయ్ నాన్న డైరెక్టర్ శౌర్యువ్ తో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఓ మూవీ చేయబోతున్నాడన్న వార్త ఇటీవల వైరల్ అయిన విషయం తెలిసిందే. తాజాగా ఈ న్యూస్ పై స్పందించాడు డైరెక్టర్ శౌర్యువ్.

హాయ్ నాన్న డైరెక్టర్ శౌర్యువ్ తో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఓ మూవీ చేయబోతున్నాడన్న వార్త ఇటీవల వైరల్ అయిన విషయం తెలిసిందే. తాజాగా ఈ న్యూస్ పై స్పందించాడు డైరెక్టర్ శౌర్యువ్.

Shouryuv: యంగ్ టైగర్ తో సినిమా.. హాయ్ నాన్న డైరెక్టర్ ఏమన్నాడంటే?

చిత్ర పరిశ్రమలో రకరకాల వార్తలు వైరల్ అవుతూ ఉంటాయి. అయితే అందులో కొన్ని నిజాలు, మరికొన్ని అబద్దాలు ఉంటాయి. ఇక వైరల్ అయ్యే వార్తల్లో ఎక్కువగా పలానా డైరెక్టర్ తో పలానా హీరో సినిమా చేస్తున్నాడన్నవే ఉంటాయి. లేటెస్ట్ గా టాలీవుడ్ లో ఓ క్రేజీ న్యూస్ వైరల్ గా మారింది. అదేంటంటే? హాయ్ నాన్న డైరెక్టర్ శౌర్యువ్ తో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఓ సినిమా చేస్తున్నాడట. తాజాగా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చాడు డైరెక్టర్ శౌర్యువ్. మరి ఇంతకీ యంగ్ టైగర్ తో మూవీ ఉన్నట్లా? లేనట్లా? తెలుసుకుందాం పదండి.

డైరెక్టర్ శౌర్యువ్.. నానితో హాయ్ నాన్న లాంటి డీసెంట్ హిట్ కొట్టి, ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఈ మూవీ తర్వాత ఏకంగా జూనియర్ ఎన్టీఆర్ తో ఓ మూవీ చేయబోతున్నాడు అంటూ వార్తలు వైరల్ గా మారాయి. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సినిమా కోసం మీరు తారక్ ను సంప్రదించారా? అన్న ప్రశ్నకు.. శౌర్యువ్ ఆన్సర్ ఇస్తూ..”ఈ రూమర్స్ ఎలా వచ్చాయో నాక్కూడా తెలీదు. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదు. అయితే ఏదో ఒకరోజు ఈ వార్త నిజం కావాలని నేను కూడా కోరుకుంటున్నాను” అని మనసులో మాట బయటపెట్టాడు.

ఇక ప్రస్తుతం తారక్ కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర’ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. బాబీ డియోల్ పార్ట్ 2లో కనిపించబోతున్నట్లు సమాచారం. సెప్టెంబర్ 27న ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక ఈ మూవీ తర్వాత తారక్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ చిత్రం చేయబోతున్నాడు. అలాగే హృతిక్ రోషన్ వార్ 2లో కూడా నటిస్తున్నాడు.

Jojobet GirişMadridbetMariobetmeritbetcasibom girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetcasibom girişgrandpashabetjojobet girişcasibom girişgrandpashabetgrandpashabet giriş