iDreamPost
android-app
ios-app

ఈమెను గుర్తుపట్టారా!.. దారుణ స్థితిలో ఒకప్పటి హీరోయిన్!

  • Published Sep 14, 2023 | 10:48 AM Updated Updated Sep 14, 2023 | 10:48 AM
ఈమెను గుర్తుపట్టారా!.. దారుణ స్థితిలో ఒకప్పటి హీరోయిన్!

హీరోయిన్లు అంటేనే అందం అభినయం. అందంగా కనిపించడానికి డైట్ మెయింటైన్ చేస్తూ.. రకరకాల ఫిట్ నెస్ లతో కుస్తీ పడుతుంటారు ముద్దుగుమ్మలు. అయితే కొంతమంది హీరోయిన్లు ముప్పై, నలభై ఏళ్ళ వయసులోను చెక్కుచెదరని అందంతో అదరగొడుతుంటే మరికొందరు మాత్రం అనారోగ్యాలకు గురవుతూ అందవిహీనంగా, ముఖంలో కళతప్పి కనిపిస్తున్నారు. దీంతో వారి ఫ్యాన్స్, ఆడియెన్స్ షాక్ కు గురవుతున్నారు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్లుగా ఎదిగిన వారు అలా దారుణ స్థితిలో కనిపించడంతో ఆశ్చర్యపోతున్నారు. ఈ క్రమంలో శ్రీ దేవీ డ్రామా కంపెనీ ప్రోమోలో కనిపించిన ఓ హీరోయిన్ అందరికి షాక్ ఇచ్చింది. గుర్తుపట్టలేనంతగా మారిపోవడంతో ఆమెకు ఏమైందని ఆరా తీస్తున్నారు.

2001 లో తెలుగులో ఆనందం సినిమాతో వెండితెరకు పరిచయమైన హీరోయిన్ రేఖ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. డైరెక్టర్ శ్రీనువైట్ల తెరకెక్కించన సినిమాలో హీరో ఆకాశ్ సరసన హీరోయిన్ గా రేఖ వేదవ్యాస్ నటించింది. ఈ సినిమా సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. దీంతో రేఖకు విపరీతమైన క్రేజ్ పెరిగింది. ఆ తరువాత తారకరత్న సినిమా అయిన ఒకటో నెంబర్ కుర్రాడులో నటించి మెప్పించింది. ఈ సినిమాలతో హిట్స్ అందుకున్న హీరోయిన్ రేఖ ఆ తరువాత వరుస సినీ అవకాశాలు వరించాయి. తెలుగు, కన్నడ, తమిళ్, హిందీ చిత్రాల్లో నటించింది రేఖ.

కాగా కొంత కాలానికి హీరోయిన్ రేఖకు సినీ అవకాశాలు తగ్గాయి. దీంతో ఆమె నటనకు దూరమైంది. తాజాగా ఈటీవీ తెలుగులో ప్రసారమవుతున్న శ్రీ దేవీ డ్రామా కంపెనీలో గెస్ట్ గా వచ్చిన రేఖ అందరినీ షాక్ కు గురిచేసింది. ఒకప్పుడు ముద్దుగా బొద్దుగా ఉన్న ఆమె బక్కచిక్కిపోయి గుర్తుపట్టలేని స్థితిలో ఉండడంతో ఆశ్చర్యపోతున్నారు. ప్రోమోలో ఆమెను చూస్తుంటే ఏదో అనారోగ్యానికి గురైనట్లు తెలుస్తోంది. రేఖ అలా కనిపించడంతో ఆర్టిస్టులతో పాటు ఇంద్రజ కూడా షాక్ కు గురైంది. ఈ క్రమంలోనే ఇంద్రజ రేఖను ఉద్దేశించి మాట్లాడుతూ.. మిమ్మల్ని చాలా రోజుల తర్వాత చూడటం చాలా ఆనందంగా ఉందని, కానీ ఇలా చూసి ఆశ్చర్యపోయినట్లు చెప్పింది. ఇక ఇంద్రజ మాటలకు స్పిందించిన హీరోయిన్ రేఖ అన్ ఎక్స్ పెక్టెడ్ గా అయ్యిందంటూ చెప్పడం కనిపిస్తుంది. అసలు ఏం జరిగిందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే. మొత్తానికి ఎంతో అందంగా ఉన్న రేఖ ఇలా పేషెంట్ లా మారిపోవడంతో షాక్ కు గురవుతున్నారు.

gamdomCasibomJojobet Girişmarsbahis girişJojobet GirişMarsbahisHoliganbetJojobet