iDreamPost
android-app
ios-app

Malavika Mohanan: ఎవరైనా చెయ్యి పట్టుకుంటారా? మాళవికా పోస్టు వైరల్‌!

  • Published Dec 01, 2023 | 1:16 PM Updated Updated Dec 01, 2023 | 1:16 PM

మాళవిక మోహన్‌ నటించిన తాజా చిత్రం ‘తంగాలన్‌’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 26వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో...

మాళవిక మోహన్‌ నటించిన తాజా చిత్రం ‘తంగాలన్‌’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 26వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో...

  • Published Dec 01, 2023 | 1:16 PMUpdated Dec 01, 2023 | 1:16 PM
Malavika Mohanan: ఎవరైనా చెయ్యి పట్టుకుంటారా? మాళవికా పోస్టు వైరల్‌!

మాళవికా మోహన్..  ఈమె గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయవలసిన అవసరం లేదు. ఈ అమ్మడు చేసింది తక్కువ సినిమాలే అయినా ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది. అందం, అభినయంతో నటిగా తనకంటూ ఓ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మాళవికా సోషల్‌ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉంటుంది. తరచుగా తనకు సంబంధించిన గ్లామర్ ఫోటోలను సామజిక మాధ్యమాలలో ఫోస్ట్ చేస్తూ ఉంటారు. ఇలా యూత్ లో మంచి క్రేజ్ ను సంపాదించుకుంది.

మొదట మోడలింగ్ రంగంలోకి ప్రవేశించిన ఈ కేరళ కుట్టి.. ఆ తరువాత తమిళనాట కథనాయికగా అడుగుపెట్టి.. రజనీకాంత్ సరసన పేట సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించింది. ఆ తరువాత విజయ్ కు జంటగా మాస్టర్ మూవీలో నటించి మెప్పించింది. అయితే మాస్టర్ మూవీ హిట్ తో ఈ అమ్మడుకి వరస ఆవకాశాలు క్యూ కడుతున్నాయి. ఇటివలే ధనుష్ తో మారన్ అనే చిత్రంలో కలిసి నటించింది. ప్రస్తుతం విక్రమ్ హీరోగా నటించిన పా. రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన తంగలాన్ ప్రాజెక్టులో మాళవికా నటించింది.

ఇది కర్ణాటక రాష్ట్రం, కోలార్ లోని కేజీఎఫ్ నేపథ్యంలో సాగే చిత్రం. దీన్ని స్టూడియో గ్రీన్ పతకం పై కేఈ. జ్ఞానవేల్ రాజా నిర్మించారు. ఈ చిత్రంలో ఒక హీరోయిన్ గా మాళవికా నటించగా.. మరో హీరోయిన్ గా పార్వతి నటిస్తోంది. తంగలాన్‌ షూటింగ్‌ను పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. వచ్చే ఏడాది జనవరి 26వ తేదీన తంగలాన్‌ను విడుదల చేయున్నట్లు చిత్ర యూనిట్ వర్గాలు వెల్లడించాయి. ఇక, అసలు విషయానికి వస్తే.. ఈ చిత్రంలో మాళవికా మోహన్ తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్తోందట.

దీని గురించి ఆమె స్వయంగా తన ఎక్స్ మీడియాలో పోస్టు పెట్టింది.. తనకు చిత్ర నిర్మాణంలో అతి కష్టమైన భాగం డబ్బింగ్ చెప్పడం అని పేర్కొంది. తాను డబ్బింగ్ చెప్తున్నప్పుడు దయచేసి తన చేతిని పట్టుకోగలరా.. అని పేర్కొంది. ప్రస్తుతం ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కాగా, మాళవికా కొద్దిరోజుల క్రితం మన్సూర్‌ అలీఖాన్‌ – త్రిష వివాదంపై స్పందించారు. త్రిషపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన మన్సూర్‌పై విరుచుకుపడ్డారు. ఈ మేరకు సోషల్‌ మీడియాలో ఓ పోస్టు పెట్టారు. మరి, డబ్బింగ్‌ కష్టాలపై మాళవికా మోహన్‌ పెట్టిన ట్వీట్ పై మీ అభిప్రాయం ఏమిటో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetHoliganbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetjojobet girişbetcioJojobetJojobetJojobetjojobetgrandpashabet