iDreamPost
android-app
ios-app

పెళ్లి చేసుకున్న హీరోయిన్‌.. సందడి చేసిన సినీ ప్రముఖులు!

  • Published Nov 19, 2023 | 4:39 PM Updated Updated Nov 19, 2023 | 4:39 PM

తాజాగా, ప్రముఖ హీరోయిన్‌ కార్తీక పెళ్లి ఘనంగా జరిగింది. ఈ పెళ్లి వేడుకకు తెలుగు, తమిళ, మలయాళ భాషకు చెందిన పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు...

తాజాగా, ప్రముఖ హీరోయిన్‌ కార్తీక పెళ్లి ఘనంగా జరిగింది. ఈ పెళ్లి వేడుకకు తెలుగు, తమిళ, మలయాళ భాషకు చెందిన పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు...

  • Published Nov 19, 2023 | 4:39 PMUpdated Nov 19, 2023 | 4:39 PM
పెళ్లి చేసుకున్న హీరోయిన్‌.. సందడి చేసిన సినీ ప్రముఖులు!

తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు కార్తీక. ఈమె హీరోయిన్‌గా తెలుగులో పలు సినిమాలు చేశారు. తెలుగు సినిమాతోటే సినీ రంగ ప్రవేశం చేశారు. స్టార్‌ కిడ్‌గా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టినా తనకంటూ ఓ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 2009లో వచ్చిన ‘జోష్‌’ సినిమాతో కార్తీక హీరోయిన్‌గా మారారు. ఈ చిత్రంలో నాగ చైతన్య సరసన నటించారు. ఇది నాగ చైతన్యకు కూడా మొదటి సినిమా కావటం విశేషం. 2011లో కేవీ ఆనంద్‌ దర్శకత్వంలో వచ్చిన ‘కో’సినిమాతో సూపర్‌ హిట్‌ను అందుకున్నారు.

ఈ సినిమా తెలుగులో రంగంగా విడుదలై ఇక్కడ కూడా సూపర్‌ హిట్‌గా నిలిచింది. అయితే, అందం, అభినయం ఉన్నా కార్తీక సరైన అవకాశాలు రాలేదు. ఆమె తన కెరీర్‌లో 10 సినిమాలు కూడా తీయలేదు. తెలుగులో 2014లో వచ్చిన ‘బ్రదర్‌ ఆఫ్‌ బొమ్మాలి’ అనే సినిమాలో చివరగా కనిపించారు. తర్వాత 2015లో ‘ పురంబోకు అంగిర పుదుఉడమై’ అనే తమిళ సినిమాతో ఇండస్ట్రీకి దూరం అయ్యారు. దాదాపు రెండేళ్ల తర్వాత హిందీలో ఓ సీరియల్‌ చేశారు. ఆరంభ్‌ అనే సీరియల్‌లో నటించారు.

ఇక సినిమాలకు దూరమైన ఆమె తాజా పెళ్లి బంధంలోకి అడుగుపెట్టారు. ఆదివారం ఉదయం రోహిత్‌ మీనన్‌ను పెళ్లి చేసుకున్నారు. కేరళలో వీరి పెళ్లి వేడుక అత్యంత ఘనంగా జరిగింది. చిత్ర పరిశ్రమనుంచి స్టార్లు ఈ పెళ్లి వేడుకలో పాల్గొన్నారు. కార్తీక తల్లి సీనియర్‌ నటి రాధ సినీ కొలీగ్స్‌ అయిన మెగాస్టార్‌ చిరంజీవి, రాధిక, సుహాసిని, రేవతి, మేనక, భాగ్యరాజ్‌, భాగ్యరాజ్‌ భార్య తదితరులు హాజరయ్యారు. రాధ ఈ పెళ్లికి చిత్ర పరిశ్రమలోని తన సన్నిహితులను ప్రత్యేకంగా పిలిచారు.

ఒక్కోరి ఇంటి దగ్గరకు వెళ్లి పత్రికలు ఇచ్చి ఆహ్వానించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఎప్పుటికప్పుడు తన సోషల్‌ మీడియా ఖాతాల్లో షేర్‌ చేస్తూ వచ్చారు. అవి కాస్తా వైరల్‌గా మారతూ వచ్చాయి. కాగా, కొద్దిరోజుల క్రితం కార్తీక-రోహిత్‌ల ఎంగేజ్‌మెంట్‌ వేడుక ఘనంగా జరిగింది. ఆ తర్వాత కార్తీక తనకు కాబోయే భర్త రోహిత్ మేనన్ ను ఫ్యాన్స్‌కు పరిచయం చేసింది. ఆ ఎంగేజ్మెంట్ ఫొటోస్ షేర్ చేస్తూ.. “నిన్ను కలవడం అనేది విధి.. నిన్ను ఇష్టపడడం మ్యాజిక్.. మన జీవన ప్రయాణం మొదలుపెట్టడానికి కౌంట్డౌన్ ప్రారంభించా.. ” అంటూ తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో తన ప్రేమను వ్యక్తం చేశారు. మరి, కార్తీక నాయర్‌ పెళ్లికి టాలీవుడ్‌తో పాటు తమిళ, మలయాళ సినీ ప్రముఖులు హాజరై సందడి చేయటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet