iDreamPost
android-app
ios-app

సింహాద్రి హీరోయిన్‌ అంకిత గుర్తుందా.. ఇప్పుడు ఏం చేస్తుంది.. ఎక్కడుంది అంటే!

  • Published Jul 11, 2023 | 9:59 AM Updated Updated Jul 11, 2023 | 9:59 AM
  • Published Jul 11, 2023 | 9:59 AMUpdated Jul 11, 2023 | 9:59 AM
సింహాద్రి హీరోయిన్‌ అంకిత గుర్తుందా.. ఇప్పుడు ఏం చేస్తుంది.. ఎక్కడుంది అంటే!

మన దగ్గర సినిమా సెలబ్రిటీలకు ఉండే క్రేజ్‌ , గుర్తింపు మరేవరికి ఉండదు. వారు వెండి తెరకు దూరమైనా.. అభిమానులు మాత్రం వారిని మర్చిపోరు. ప్రస్తుతం సోషల్‌ మీడియా అందుబాటులోకి రావడంతో.. సెలబ్రిటీలు ఎక్కడ ఉన్నా.. సరే తమ అభిమానులతో టచ్‌లో ఉంటున్నారు. తమకు సంబంధించిన అంశాలు, ఫొటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తున్నారు. హీరోయిన్‌ అంకిత గుర్తుందా.. సింహాద్రి సినిమా ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకుంది కదా.. తనే. ఇక తాజాగా ఓ యూట్యూబ్‌ చానెల్‌ అంకిత హోమ్‌ టూర్‌ వీడియో చేసింది. దీనిలో అంకిత తన ఇల్లు, తన భర్త, పిల్లల గురించి వివరాలు వెల్లడించింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అంకిత ఎక్కడుంది.. ఆమె కుటుంబం వివరాలను ఈ వీడియోలో చెప్పుకొచ్చింది.

అంకిత అనగానే అదరికి వెంటనే గుర్తుకు వచ్చేది జూనియర్‌ ఎన్టీఆర్‌ నటించిన సింహాద్రి సినిమానే. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అకింత, భూమిక హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రం ఎన్టీఆర్‌ కెరీర్‌లో బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది. సినిమాలో అకింత చీమ చీమ అంటూ సాగే పాటలో ఎన్టీఆర్‌తో కలిసి తన డ్యాన్స్‌తో అదరగొట్టింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించింది కానీ.. అవేవి ఆమె కెరీర్‌కు ఉపయోగపడలేదు. బాలకృష్ణతో కలిసి విజయేంద్రవర్మ, లాహరి లాహిర లాహిరిలో, ధనలక్ష్మి ఐ లవ్‌ యూ, రారాజు, మనసు మాట వినదు వంటి సినిమాల్లో యాక్ట్‌ చేసినా.. ఆమెకు మంచి విజయం దక్కలేదు. కెరీర్‌లో సరైన హిట్స్‌ లేకపోవడం.. డౌన్‌ ఫాల్‌ స్టార్ట్‌ కావడంతో.. పెళ్లి చేసుకుని.. జీవితంలో సెటిలైంది అంకిత.

తెలుగుతో పాటు తమిళ్‌, కన్నడ చిత్రాల్లో నటించిన అంకిత.. 2016లో సినిమాలకు గుడ్‌ బై చెప్పి.. విశాల్‌ జగతాప్‌ అనే వ్యక్తిని పెళ్లాడింది. ప్రస్తుతం అమెరికాలో సెటిల్‌ అయ్యింది. అక్కడ  ఆమె సొంత ఇల్లు.. అది కూడా అర ఎకరం విస్తీర్ణంలో.. అందమైన ప్యాలెస్‌ నిర్మించుకుంది. ఆమెకు ఇద్దరు కుమారులు ఉన్నారు. ప్రస్తుతం భర్త, పిల్లలతో కలిసి ఎంతో సంతోషంగా జీవిస్తోంది అంకిత. ఆమె భర్త విశాల్‌ అమెరికా సిటీ బ్యాంక్‌లో ఉద్యోగం చేస్తున్నారు. ప్రస్తుతం అంకిత ఇంటికి సంబంధించిన ఫొటోలు, వీడియో నెట్టింట వైరల్‌గా మారాయి.

Jojobet GirişmeritbetjojobetJojobet girişcasibomJojobet GirişcasibomjojobetjojobetjojobetcasibomMadridbetMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin GirişBankobet girişCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet girişholiganbet girişMarsbahis Güncel