iDreamPost
android-app
ios-app

వీడియో: విజయ్‌కాంత్ మృతి.. వెక్కి వెక్కి ఏడ్చిన హీరో విశాల్!

  • Published Dec 28, 2023 | 4:11 PM Updated Updated Dec 28, 2023 | 4:11 PM

Hero Vishal: కోలీవుడ్ స్టార్‌ నటుడు, డీఎంకే అధినేత విజయ్‌కాంత్‌ మరణం అక్కడ విషాదాన్ని నింపింది. పలువురు సినీ ప్రముఖులతో పాటు.. రాజకీయ నాయకులు సంతాపం తెలుపుతున్నారు. అలానే ఓ స్టార్ హీరో అయితే ఏకంగా వెక్కి వెక్కి ఏడ్చేశారు.

Hero Vishal: కోలీవుడ్ స్టార్‌ నటుడు, డీఎంకే అధినేత విజయ్‌కాంత్‌ మరణం అక్కడ విషాదాన్ని నింపింది. పలువురు సినీ ప్రముఖులతో పాటు.. రాజకీయ నాయకులు సంతాపం తెలుపుతున్నారు. అలానే ఓ స్టార్ హీరో అయితే ఏకంగా వెక్కి వెక్కి ఏడ్చేశారు.

  • Published Dec 28, 2023 | 4:11 PMUpdated Dec 28, 2023 | 4:11 PM
వీడియో: విజయ్‌కాంత్ మృతి.. వెక్కి వెక్కి ఏడ్చిన హీరో విశాల్!

కోలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. స్టార్‌ నటుడు, డీఎంకే అధినేత విజయ్‌కాంత్‌ మరణం అక్కడ విషాదాన్ని నింపింది. ఇప్పటికే కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ ప్రముఖులు సైతం ఆయనకు నివాళ్లల్పించారు. ఆయన కుటుంబ సభ్యులతో పాటు, అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. తాజాగా విజయ్‌కాంత్‌ మరణం పట్ల కోలీవుడ్‌ స్టార్‌ హీరో విశాల్ విచారం వ్యక్తం చేశారు. కన్నీరు పెట్టుకుంటూ బోరున విలపించారు. ఆయన మరణాన్ని తలుచుకుని కన్నీటి పర్యంతం అయ్యారు. ప్రస్తుతం విశాల్ కన్నీరు పెట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రస్తుతం ఈ వీడియో చూసిన ఫ్యాన్స్ కన్నీళ్లు తెప్పిస్తోంది.

డీఎండీకే అధినేత, కెప్టెన్ విజయ్ కాంత్ అనారోగ్యంతో మృతి చెందారు. గతకొంతకాలం నుంచి ఆయన అనారోగ్యంతో బాధ పడుతున్న సంగతి తెలిసిందే. కొంతకాలం నుంచి చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే రెండు రోజుల క్రితం చికిత్స నిమిత్తం ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. ఈ రోజు ఉదయం విజయ్ కాంత్ తుది శ్వాస విడిచారు. ఆయన మృతిపై తమిళనాడుతో పాటు దేశంలోని సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

పలువురు సినీ ప్రముఖులు విజయ్ కాంత్ మృతిపై దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఇక స్టార్ హీరో విశాల్ అయితే వెక్కి వెక్కి ఏడ్చేశాడు. హీరో విశాల్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన కోలీవుడ్‌తో పాటు తెలుగు వంటి ఇతర భాషల్లోనూ సినిమాలు తీస్తుంటారు. ఇది ఇలా ఉంటే కెప్టెన్ విజయ్‌కాంత్‌ మరణవార్తను విని విశాల్ తట్టుకోలేక పోయారు. ఆయన మృతిపై విశాల్ ఎమోషనలయ్యారు. విజయ్‌కాంత్‌ మృతికి సంతాపం తెలుపుతూ కన్నీటి పర్యతం అయ్యారు. ఆయన మృతిపై విశాల్ ఓ వీడియోను విడుదల చేశారు. అందులో విశాల్ మాట్లాడుతూ… కెప్టెన్ మరణించిన విషయం తనకు ఇప్పుడే తెలిసిందని తెలిపారు.

విజయ్ కాంత్ మరణ వార్త విన్నాక తన కాళ్లు, చేతలు పనిచేయడం లేదని విశాల్ పేర్కొన్నారు. కెప్టెన్‌ను కోల్పోవడం చాలా బాధగా ఉందనని, ఆయన చివరి చూపునకు కూడా నోచుకోలేకపోతున్నా అంటూ కన్నీరుమున్నీరు అయ్యాడు. తాను నడిగర్ సంఘం ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు విజయ్‌కాంత్ అండగా నిలిచారని విశాల్ గుర్తు చేసుకున్నారు. ఈ విషాద సమయంలో విజయ్ కాంత్ సార్  కుటుంబానికి ఆ దేవుడు ధైర్యం ఇవ్వాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. విజయ్‌ కాంత్‌ సార్‌కు ఇదే నా కన్నీటి నివాళి అంటూ ఏడుస్తూ హీరో విశాల్ పోస్టు పెట్టారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobetcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom