iDreamPost
android-app
ios-app

ఉదయ్‌ కిరణ్‌ పక్కన నటించిన ఈ నటి.. ఇప్పుడు దేశంలోనే రిచ్చెస్ట్‌ హీరోయిన్!

  • Published Apr 20, 2024 | 12:43 PM Updated Updated Apr 20, 2024 | 12:43 PM

Divya Khosla Kumar: టాలీవుడ్ హీరో ఉదయ్ కిరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. లవర్ బాయ్ గా గుర్తింపు తెచ్చుకున్న ఉదయ్ కిరణ్ అనేక హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నారు. అలాంటి వాటిల్లో  ‘లవ్ టుడే’ సినిమా ఒకటి. 2004లో  వచ్చిన ఈ సినిమాలో ఉదయ్ కిరణ్ కి జోడీగా నటించిన హీరోయిన్.. ప్రస్తుతం మిలినయర్ గా ఉంది.

Divya Khosla Kumar: టాలీవుడ్ హీరో ఉదయ్ కిరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. లవర్ బాయ్ గా గుర్తింపు తెచ్చుకున్న ఉదయ్ కిరణ్ అనేక హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నారు. అలాంటి వాటిల్లో  ‘లవ్ టుడే’ సినిమా ఒకటి. 2004లో  వచ్చిన ఈ సినిమాలో ఉదయ్ కిరణ్ కి జోడీగా నటించిన హీరోయిన్.. ప్రస్తుతం మిలినయర్ గా ఉంది.

  • Published Apr 20, 2024 | 12:43 PMUpdated Apr 20, 2024 | 12:43 PM
ఉదయ్‌ కిరణ్‌ పక్కన నటించిన ఈ నటి.. ఇప్పుడు  దేశంలోనే రిచ్చెస్ట్‌ హీరోయిన్!

ఎంతోమంది హీరోయిన్లు సినిమాల్లో అలా తళుకుమని మెరిసి.. ఆ వెంటనే కనుమరుగై పోతుంటారు. కొందరు హీరోయిన్లు చేసేది తక్కువ సినిమాలో అయినా మంచి గుర్తింపు సంపాదిస్తారు. అలానే మరికొందరి హీరోయిన్ల జీవితాన్ని కొన్ని సినిమాలు కీలక మలుపు తిప్పుతుంటాయి. అలానే టాలీవుడ్ హీరో ఉదయ్ కిరణ్ కి జోడిగా నటించిన ఓ బ్యూటీ చేసింది..తక్కువ సినిమాలే అయినా మంచి గుర్తింపు సంపాదించింది. అంతేకాక ఇండియానేలే రిచెస్ట్ హీరోయిన్ గా రికార్డు సృష్టించింది. మరి.. ఆ బ్యూటీ ఎవరు, ఆమె వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

టాలీవుడ్ హీరో ఉదయ్ కిరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. లవర్ బాయ్ గా గుర్తింపు తెచ్చుకున్న ఉదయ్ కిరణ్ అనేక హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నారు. అలాంటి వాటిల్లో  ‘లవ్ టుడే’ సినిమా ఒకటి. 2004లో  వచ్చిన ఈ సినిమాలో ఉదయ్ కిరణ్ కి జోడీగా దివ్యఖోస్లా కుమార్ నటించారు. ఈ  సినిమాతోనే తన సినీ కెరిర్ కు ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ‘అబ్‌ తుమారే హవాలే వాటా సాథియో’ అనే సినిమాతో బాలీవుడ్‌ కి పరిచయం అయ్యింది ఇచ్చింది. ఓ మధ్యతరగతి సాధారణ కుటుంబం నుంచి వచ్చిన ఆమె సినీ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకోవాలని  అనుకుంది. ఈ క్రమంలో ఆమె అనేక ఆల్బమ్స్‌ నటించి మెరిసింది. 90 దశకంలో దివ్యా ఖోస్లా తళుక్కున మెరిశారు. ఫల్గుణి పాఠక్ మ్యూజిక్ వీడియో ‘అయ్యో రామ’ పెద్ద సంచలనమే సృష్టించింది. తన అందం, అభినయంతో అందర్నీ ఆకట్టుకుంది.

అక్కడ వచ్చిన హిట్ తో కండల వీరుడు సల్మాన్ ఖాన్ సరసన ఛాన్స్ కొట్టేసింది. 2004లో ‘అబ్‌ తుమారే హవాలే వాటా సాథియో’ సినిమా ఆమెకు బాలీవుడ్‌ తొలి చిత్రం. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద నిరాశపర్చడమే కాకుండా దివ్య కెరీర్‌ను దెబ్బతీసింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయినప్పటికీ దివ్య వ్యక్తిగత జీవితానికి కొత్త మార్గాన్ని చూపింది. ఈ సినిమా సెట్‌లో టి-సిరీస్ అధినేత భూషణ్ కుమార్, దివ్యను చూసిన లవ్ లో  పడ్డారు. అలా ఇరు కుటుంబాలు పెద్దలను ఒప్పించి 2005లో వారిద్దరు వివాహం చేసుకున్నారు. వీరికి 2011లో ఓ బాబు జన్మించాడు.

నివేదికల ప్రకారం.. ప్రస్తుతం దివ్య ఖోస్లా కుమార్ నికర విలువ సుమారు 5 మిలియన్లు ఉంది. ఇదే ఇండియన్ కరెన్సీలో అంటే దాదాపు రూ.42 కోట్లు. ఆమె ఎంట్రీ తెలుగు సినిమాతో పరిచయం అయింది కాబట్టి తెలుగులో పలు సినిమాలు నిర్మించాలనే ప్లాన్‌లో ఆమె ఉన్నారని టాక్ వినిపిస్తోంది. మొత్తంగా ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి తెలుగు సినిమా అవకాశం దక్కడం ఆపై బాలీవుడ్‌ ఎంట్రీ ఇవ్వడం అక్కడి నుంచి వేల కోట్ల రూపాయల సామ్రాజ్యంలో తన జీవితాన్ని గడపుతున్న హీరోయిన్‌గా దివ్య ఖోస్లా కుమార్ రికార్డ్‌ సృష్టించింది. మరి.. ఈ నటిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet