iDreamPost
android-app
ios-app

సినిమా షూటింగ్ లో హీరో సూర్యకు గాయం.. ఆస్పత్రిలో చికిత్స!

  • Published Aug 09, 2024 | 7:59 PM Updated Updated Aug 09, 2024 | 7:59 PM

Hero Suriya Suffer Minor Injury In Movie Shooting: సినిమా షూటింగ్ లో హీరో సూర్యకు ప్రమాదం జరిగింది. సూర్యాకు గాయం అయినట్లు నిర్మాత రాజశేఖర్ పాండియన్ వెల్లడించారు. కార్తిక్ సుబ్బరాజుతో జరుగుతున్న సూర్యా 44 మూవీ సెట్ లో ఈ ప్రమాదం జరిగింది.

Hero Suriya Suffer Minor Injury In Movie Shooting: సినిమా షూటింగ్ లో హీరో సూర్యకు ప్రమాదం జరిగింది. సూర్యాకు గాయం అయినట్లు నిర్మాత రాజశేఖర్ పాండియన్ వెల్లడించారు. కార్తిక్ సుబ్బరాజుతో జరుగుతున్న సూర్యా 44 మూవీ సెట్ లో ఈ ప్రమాదం జరిగింది.

  • Published Aug 09, 2024 | 7:59 PMUpdated Aug 09, 2024 | 7:59 PM
సినిమా షూటింగ్ లో హీరో సూర్యకు గాయం.. ఆస్పత్రిలో చికిత్స!

పాన్ ఇండియా లెవల్లో ఉన్న విలక్షణ నటులు, స్టార్ హీరోల్లో సూర్య పేరు ప్రముఖంగా వినిపిస్తూ ఉంటుంది. ప్రస్తుతం కంగువ వంటి ఒక విభిన్నమైన కథాంశంతో సూర్య ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైపోయాడు. అక్టోబర్ 10న వరల్డ్ వైడ్ గా ఈ మూవీ రిలీజ్ కి రెడీగా ఉంది. ఇప్పటికే వచ్చిన అప్ డేట్స్ అన్నీ సినిమాపై అంచనాలను పేంచేశాయి. ఇటీవల సూర్య పుట్టినరోజు సందర్భంగా కార్తిక్ సుబ్బరాజ్ డైరెక్షన్ లో సూర్య 44 మూవీని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మూవీకి సంబంధించి షూటింగ్ కూడా జరుగుతోంది. అయితే ఈ షూటింగ్ లో సూర్యకు ప్రమాదం జరిగింది. ఈ విషయాన్ని స్వయంగా సినిమా కో ప్రొడ్యూసర్ రాజశేఖర్ కర్పూర సుందర పాండియన్ వెల్లడించారు.

హీరో సూర్య కంగువ షూటింగ్ పూర్తి చేసుకోవడమే కాకుండా.. తన 44వ ప్రాజెక్ట్ లోకి కూడా ఎంటర్ అయిన విషయం తెలిసిందే. ఈ మూవీకి సంబంధించి ఒక టైటిల్ గ్లింప్స్ ని కూడా విడుదల చేశారు. ఈ మూవీ శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటోంది. అయితే తాజాగా సూర్య ఫ్యాన్స్ కు ఒక బ్యాడ్ న్యూస్ అందింది. ఈ మూవీ షూటింగ్ జరుగుతున్న సమయంలో హీరో సూర్యకు ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో సూర్యాకు గాయం కూడా అయ్యింది. ఈ వార్త బయటకు వచ్చి ఫ్యాన్స్ కంగారు పడుతుండటంతో.. స్వయంగా ఈ మూవీ కో ప్రొడ్యూసర్ రాజశేఖర్ పాండియన్ ఎక్స్.కామ్ వేదికగా స్పందించారు. సూర్యా అభిమానులకు ధైర్యం చెప్పారు.

“డియర్ అన్ బాన ఫ్యాన్స్.. అది చాలా చిన్న గాయం. ఎవరూ కంగారు పడకండి. మీ అందరి ప్రార్థనలు, ఆదరాభిమానాలతో సూర్యా అన్న బాగానే ఉన్నాడు” అంటూ ప్రొడ్యూసర్ రాజశేఖర్ పాండియన్ పోస్ట్ చేశారు. అలాగే ఆస్పత్రిలో చికిత్స్ కూడా అందించినట్లు తెలుస్తోంది. రాజశేఖర్ పోస్ట్ చూసిన తర్వాత సూర్యా అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు. సూర్యా ఆరోగ్యం గురించి క్లారిటీ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సూర్యా అన్న త్వరగా కోలుకోవాలి అంటూ ఫ్యాన్స్ ఆకాంక్షించారు. ఇంక కార్తిక్ సుబ్బరాజ్ మూవీ విషయానికి వస్తే.. ఇందులో సూర్య పాత్ర చాలా భిన్నంగా ఉండబోతోందని అర్థమవుతోంది. అలాగే రజినీకాంత్ మాణిక్ భాష రేంజ్ లో ఉండే అవకాశం ఉంది అంటూ అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. దానికి తగినట్లుగా గ్లిప్స్ లో చుట్టూ బాడీ గార్డ్స్, బ్లాక్ డ్రెస్ లో గన్ పట్టుకుని సూర్యా ఎంట్రీ ఎక్స్ పెక్టేషన్స్ ని పెంచేస్తున్నాయి.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetjojobetjojobetbetwooncasibomcasibomcasibombetcio giriş