iDreamPost
android-app
ios-app

అంబాజీ పేట మ్యారేజి బ్యాండ్‌.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

  • Published Feb 24, 2024 | 8:54 AM Updated Updated Feb 24, 2024 | 12:24 PM

యంగ్ హీరో సుహాస్ తాజాగా నటించిన సినిమా అంబాజీపేట మ్యారేజి బ్యాండు. ఈ సినిమా త్వరలోనే ప్రముఖ ఓటీటీ సంస్థలో అలరించడానికి సిద్ధంగా ఉంది. ఇంతకి ఎక్కడంటే..

యంగ్ హీరో సుహాస్ తాజాగా నటించిన సినిమా అంబాజీపేట మ్యారేజి బ్యాండు. ఈ సినిమా త్వరలోనే ప్రముఖ ఓటీటీ సంస్థలో అలరించడానికి సిద్ధంగా ఉంది. ఇంతకి ఎక్కడంటే..

  • Published Feb 24, 2024 | 8:54 AMUpdated Feb 24, 2024 | 12:24 PM
అంబాజీ పేట మ్యారేజి బ్యాండ్‌.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్. ప్రస్తుతం ఈయన పేరు టాలీవుడ్ లో మారు మోగుతుంది. కేవలం ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, నెగటివ్ పాత్రల్లో అలరించిన ఆయన నేడు హీరోగా మారి అందరి దృష్టిని తనవైపు తిప్పుకోనేలా చేశాడు.  ఈ క్రమంలోనే..  ‘కలర్ ఫోటో’ సినిమాతో హీరోగా వెండితెరకు పరిచయం అయ్యాడు. ఈ సినిమాలో తన ఆద్భుతమైన నటనతో మంచి క్రేజ్ ని సంపాదించుకున్నాడు సుహాస్. ఇక కేవలం ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మొదలుపెట్టిన ఈయన నేడు హీరోగా మారి అందరి దృష్టిని తనవైపు తిప్పుకోనేలా చేశాడు. ఈ క్రమంలోనే ఇటీవలే ‘రైటర్ పద్మభూషణ్’ అనే సినిమాతో మరో మంచి హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. అలాగే ఈమధ్యనే ‘అంబాజీపేట మ్యారేజి’ బ్యాండు సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు అలరించడానికి వచ్చాడు సుహాస్. అయితే ఈ సినిమా ఈనెల అనగా ఫిబ్రవరి 2న గ్రాండ్ గా థియేటర్ లో విడుదలై మంచి సక్సెస్ ను అందుకున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమా ఓటీటీలో అలరించడానికి సిద్ధంగా ఉంది. ఇంతకి ఎప్పుడంటే..

హీరో సుహాస్ తాజాగా నటించిన సినిమా ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’. ఈ సినిమాకు దుశ్యంత్ కటికినేని దర్శకత్వం వహించారు. ఇందులో శివాని నాగరం హీరోయిన్‌గా నటించగా.. శరణ్య ప్రదీప్ కీలక పాత్ర పోషించింది. ఇక ఫిబ్రవరి 2న థియేటర్లలో గ్రాండ్ గా విడుదలైన ఈ సినిమా.. మూడు రోజుల్లతోనే రూ. 8 కోట్లకు పైగా కలెక్షన్స్ ను రాబట్టింది. కాగా, రూ.3 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్సాఫీస్ వద్ద బరిలోకి దిగిన ఈ సినిమా మొదటివారంలో లాభాల దిశలో దూసుకుపోయింది. కానీ అదే సమయంలో.. రవితేజ ఈగల్, రజనీకాంత్ లాల్ సలామ్ సినిమాలు రిలీజ్ కావడంతో అంబాజీపేట మ్యారేజి బ్యాండు సినిమాకు థియేటర్స్ తగ్గాయి. అయితే అప్పటికే ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ తో తనదైన ముద్ర వేసుకుంది.

Ambaji Peta Marriage Band Streaming Where

అయితే, ఇప్పుడు అంబాజీపేట మ్యారేజి బ్యాండు మూవీ ఓటీటీ స్ట్రీమింగ్‌ పై ఆసక్తి నెలకొంది. కాగా, గతకొన్ని రోజులుగా ఈ సినిమా ఓటీటీలో విడుదలపై అనేక రూమర్స్ వినిపిస్తునే ఉన్నాయి. తాజాగా అంబాజీపేట మ్యారేజి బ్యాండు ఓటీటీ విడుదలపై అధికారిక ప్రకటన వచ్చింది. ఈ సినిమాను ప్రముఖ తెలుగు ఓటీటీ ‘ఆహా’ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను భారీ ధరకు కొనుగోలు చేసినట్లు సమాచారం. కాగా, అంబాజీపేట మ్యారేజి బ్యాండు ఓటీటీ విడుదలపై ఆహా తాజాగా ఓ పోస్టర్ కూడా విడుదల చేసింది.

అందులో ‘మల్లిగాడు మాయా ప్రపంచంలోకి అడుగు పెట్టండి’ అంటూ అంబాజీపేట మ్యారేజి బ్యాండు సినిమా త్వరలోనే ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఆహా సంస్థ తెలిపింది. ఇక ఇప్పటివరకు వచ్చిన రూమర్స్‌కు చెక్ పెడుతూ ఆహాలోనే ఈ సినిమా స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. అయితే, ఓటీటీ రిలీజ్ డేట్ ను మాత్రం ఆహా ఇంకా ప్రకటించలేదు. కాగా, మొన్నటివరకు అంబాజీపేట మ్యారేజి బ్యాండు సినిమాను మార్చి 8 లేదా 15న రిలీజ్ చేస్తారని టాక్ నడిచింది. కానీ, ప్రస్తుతం ఉన్న బజ్ ప్రకారం ఆహా ఓటీటీలో అంబాజీపేట మ్యారేజి బ్యాండు మార్చి 1 నుంచి స్ట్రీమింగ్ తెలుస్తోంది. మరి త్వరలో అంబాజీపేట మ్యారేజీ బ్యాండు సినిమా ఓటీటీలో రిలీజ్ అవుతుందనే వార్త పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişbahisabi girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibom