iDreamPost
android-app
ios-app

‘దేవర’ షూటింగ్‌లో గాయపడ్డ శ్రీకాంత్‌.. అయినా కానీ…

ప్రముఖ నటుడు శ్రీకాంత్‌ ‘దేవర’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్‌లో బిజీబిజీగా గడుపుతున్నారాయన. తాజాగా, దేవర షూటింగ్‌లో ఆయన గాయపడ్డారు.

ప్రముఖ నటుడు శ్రీకాంత్‌ ‘దేవర’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్‌లో బిజీబిజీగా గడుపుతున్నారాయన. తాజాగా, దేవర షూటింగ్‌లో ఆయన గాయపడ్డారు.

‘దేవర’ షూటింగ్‌లో గాయపడ్డ శ్రీకాంత్‌.. అయినా కానీ…

యంగ్‌ టైగర్‌ జూనియర్‌ ఎన్టీఆర్‌- దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో ‘ దేవర’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం మూవీ షూటింగ్‌ శరావేగంగా సాగుతోంది. ప్రముఖ నటుడు శ్రీకాంత్‌ కూడా దేవరలో ఓ కీలక పాత్ర చేస్తున్నారు. గత కొద్దిరోజుల నుంచి ఆయన సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నారు. తాజాగా షూటింగ్‌లో ఉన్న సమయంలో శ్రీకాంత్‌ గాయపడ్డారు. ఆయన కాలు బెనికింది. దీంతో ఆయన చాలా ఇబ్బందికి గురి కావాల్సి వచ్చింది.

డాక్టర్‌ను సంప్రదిస్తే.. కాలుకు ఓ పట్టీకట్టి రెస్ట్‌ తీసుకోమన్నారు. కానీ, శ్రీకాంత్‌ మాత్రం షూటింగ్‌ వాయిదా పడొద్దని.. కష్టమైనా సరే షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే చెప్పుకొచ్చారు. శ్రీకాంత్‌ నటించిన తాజా చిత్రం ‘కోట బొమ్మాళీ పీఎస్‌’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా నవంబర్‌ 24 ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సినిమా టీం చిత్ర ప్రమోషన్లలో బిజీ అయిపోయింది. బిగ్‌బాస్‌ హౌస్‌లోకి కూడా వెళ్లింది.

ఈ సందర్భంగా నాగార్జున శ్రీకాంత్‌ను ఓ ప్రశ్న అడిగారు. ‘ శ్రీకాంత్‌ కాలికి ఆ దెబ్బ ఏంటి? ఎలా తగిలింది?…’ అని అడిగారు. ఇందుకు సమాధానం ఇస్తూ.. ‘‘దేవర షూటింగ్‌ జరుగుతోంది గోవాలో’’ అని శ్రీకాంత్‌ మొదలుపెట్టగానే.. ‘‘ తారక్‌ కారణం కాదుగా?’’ అని నాగార్జున నవ్వుతూ ప్రశ్నించారు. శ్రీకాంత్‌ వెంటనే ‘‘ అయ్యయ్యో తారక్‌ కారణం కాదు. షూటింగ్‌కు కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్లాలి. అక్కడ ఇసుక దిబ్బలు ఉన్నాయి. అక్కడ చిన్న ఝలక్‌ అంది. ఇవన్నీ మామూలే కదా అనుకుని.. షూటింగ్‌కు వెళ్లాను.

తర్వాత అది వాచిపోయి నొప్పి తీయసాగింది. డాక్టర్‌ దగ్గరకు వెళితే టియర్‌ అయింది అన్నారు. ఇప్పుడు షూటింగ్‌ చేసే వస్తున్నాను. నిలబడే షూటింగ్‌ చేయాల్సి వచ్చింది’’ అని అన్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. జూనియర్‌ ఎన్టీఆర్‌ అభిమానులు శ్రీకాంత్‌పై ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు. కాలుకు దెబ్బ తగిలినా.. షూటింగ్‌ చేస్తున్న ఆయన కమిట్‌మెంట్‌కు జై కొడుతున్నారు.

కాగా, శ్రీకాంత్‌ .. జూనియర్‌ ఎన్టీఆర్‌ ‘‘దేవర’’ సినిమాతో పాటు.. మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ ‘గేమ్‌ ఛేంజర్‌’ సినిమాలోనూ నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ తుది దశకు చేరుకుంది. వచ్చే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. దాదాపు 400 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాకు శంకర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. మరి, గాయపడ్డా కూడా షూటింగ్‌లో పాల్గొన్న శ్రీకాంత్‌ కమిట్‌మెంట్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

jojobet girişJojobet GirişBetcioivermectin tabletMadridbetMadridbetPusulabetmeritbetCasibom GirişmeritbetpokerklasTophillbetmarsbahis girişJojobet GirişcasibomCasibom GirişMarsbahis GirişJojobet GirişHoliganbetMarsbahis