iDreamPost
android-app
ios-app

Sree Vishnu:హీరో శ్రీవిష్ణుకు షాకిచ్చిన కూలీలు.. కారును అడ్డగించి మరీ గొడవ

  • Published Jan 03, 2024 | 12:07 PM Updated Updated Jan 03, 2024 | 12:07 PM

యాంగ్ హీరో శ్రీ విష్ణు గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీకి అడుగుపెట్టిన ఇతను ఆ తర్వాత హీరోగా ఎంట్రీ ఇచ్చి మంచి ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ని సంపాదించుకున్నాడు. అయితే తాజాగా శ్రీ విష్ణు కి ఓ కొత్త సినిమాలో నటించబోతున్నడు. అయితే ఆ సినిమాకు సంబంధించి షూటింగ్ లో ఈ హీరోకు అనుకోని చేదు సంఘటన ఎదురైంది. అదేమిటంటే..

యాంగ్ హీరో శ్రీ విష్ణు గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీకి అడుగుపెట్టిన ఇతను ఆ తర్వాత హీరోగా ఎంట్రీ ఇచ్చి మంచి ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ని సంపాదించుకున్నాడు. అయితే తాజాగా శ్రీ విష్ణు కి ఓ కొత్త సినిమాలో నటించబోతున్నడు. అయితే ఆ సినిమాకు సంబంధించి షూటింగ్ లో ఈ హీరోకు అనుకోని చేదు సంఘటన ఎదురైంది. అదేమిటంటే..

  • Published Jan 03, 2024 | 12:07 PMUpdated Jan 03, 2024 | 12:07 PM
Sree Vishnu:హీరో శ్రీవిష్ణుకు షాకిచ్చిన కూలీలు.. కారును అడ్డగించి మరీ గొడవ

టాలీవుడ్ యాంగ్ హీరో శ్రీ విష్ణు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. చూడటానికి పక్కింటి కుర్రాడిలా ఉండే ఇతను తన అద్భుతమైన నటనతో ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ని సంపాదించుకున్నాడు. అయితే విష్ణు తన కేరీర్ ప్రారంభంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. ఆ తర్వాత ‘అప్పట్లో ఒకడుండేవాడు’అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అలా తొలి సినిమాతోనే తనలో టాలెంట్‌ను చూపించి మంచి మార్కులు కొట్టేశాడు. ఇక అప్పటి నుంచి వైవిధ్యమైన కథలు ఎంపిక చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలోనే.. శ్రీ విష్ణు ఖాతాలో కొన్ని హిట్స్ కూడా పడ్డాయి. ఈ క్రమంలోనే.. శ్రీవిష్ణు మంచి కామెడీ టచ్ ఉన్న లవ్ స్టోరీలు, కథా బలం ఉన్న ఎమోషనల్ చిత్రాలను ఎంపిక చేస్తున్నాడు. ఇది ఇలా ఉంటే.. తాజాగా శ్రీ విష్ణు కి సంబంధించి ఓ కొత్త సినిమా షూటింగ్ లో భాగంగా అనుకోని సంఘటన ఎదురైంది. ఆ వివరాళ్లోకి వెళ్తే..

హీరో విష్ణు, యంగ్ బ్యూటీ రీతూ వర్మ జంటగా ఓ సినిమాలో నటిస్తున్నారు. అయితే ఈ మూవీ షూటింగ్ లో అనుకోని సమస్య ఎదురైంది. అది కాస్త శ్రీ విష్ణుకి చేదు అనుభవంగా మారింది. ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాల జిల్లాలోని బనగానెపల్లె మండలం యాగంటి క్షేత్రంలో సినిమాకు సంబంధించి కొన్ని సన్నివేశాలను చిత్రికరిస్తున్నారు. ఆ సన్నివేశాల్లో పాల్గొనేందుకు కోసం కొందరు కూలీలని చిత్రబృందం తీసుకొచ్చింది. కాగా, ఆ షూటింగ్ పూర్తయిన తర్వాత వాళ్లకు వేతనం ఇవ్వడం కాస్త అలస్యమైంది. దీంతో తమకు రావాల్సిన డబ్బు ఇంకా రాలేదని దాదాపు 400 మంది కూలీలు.. షూటింగ్ లోకేషన్ లో ఆందోళన చేశారు.

Labourers blocking Sri Vishnu's car

అయితే, చిత్ర యూనిట్ స్పందించకపోవడంతో.. అప్పుడే షూటింగ్ నుంచి అటుగా వెళుతున్న హీరో శ్రీ విష్ణు కారుని కూలీలంతా ముట్టడించారు. తమ వేతనం ఇవ్వలేదని నిలదీశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది. మీకు రావాల్సిన వేతనానికి, హీరోకి ఎలాంటి సంబంధం లేదని నచ్చజెప్పారు. ఆ తర్వాత కూలీలు శ్రీ విష్ణు కారుని పోనిచ్చారు. కొంత సేపటికి చిత్ర యూనిట్ కూలీలకు వేతనం ఇవ్వడంతో ఆ వివాదం కూడా సద్దుమణిగింది.

ఇక ఈ చిత్రానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియజేయలేదు. మూవీ షూటింగ్ మాత్రం శరవేగంగా జరుగుతోంది. కాగా, శ్రీ విష్ణు గత ఏడాది సామజవరగమన సినిమాతో మంచి హిట్ కొట్టిన విషయం తెలిసిందే. అలాగే, శ్రీ విష్ణు గతంలో చేసిన సినిమాల్లో ‘మెంటల్ మదిలో’, సినిమా శ్రీ విష్ణుకి మంచి బ్రేక్ ని తెచ్చిపెట్టిగా, ‘బ్రోచేవారెవరురా’ సినిమా ఆడియన్స్ ను విపరీతంగా మెప్పించింది. ఆ తర్వతా వచ్చిన ‘రాజరాజ చోర’ తదితర సినిమాలన్నీ కొంచెం ఫర్వాలేదనిపించాయి. మరి, హీరో శ్రీ విష్ణు, రీతు వర్మ కాంబీనేషన్ లో తెరకెక్కనున్న తాజా చిత్రం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio