Keerthi
Siddharth, Aditi Rao Hydari Marrige Photos: చాలాకాలంలో ప్రేమలో విహరిస్తున్న హీరో సిద్దార్థ్, ఆదితి ఎట్టాకేలకు వివాహ బంధంతో ఒకటైయ్యారు. ప్రస్తుతం వీరి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Siddharth, Aditi Rao Hydari Marrige Photos: చాలాకాలంలో ప్రేమలో విహరిస్తున్న హీరో సిద్దార్థ్, ఆదితి ఎట్టాకేలకు వివాహ బంధంతో ఒకటైయ్యారు. ప్రస్తుతం వీరి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Keerthi
గత కొన్నేళ్లుగా రిలేషిన్ షిప్ లో ఉన్న టాలీవుడ్ హీరో సిద్దార్థ్, బాలీవుడ్ బ్యూటీ ఆదితి రావు హైదరీ.. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో నిశితార్థం చేసుకున్న విషయం తెలిసిందే. కాగా, వీరి నిశ్చితార్థం వనపర్తి జిల్లాలోని ఓ ఆలయంలో కుటుంబ సభ్యులు సమక్షంలో రహస్యంగా జరిగింది. ఇక అందుకు సంబంధించిన ఫోటోస్ కూడా ఇద్దరు సోషల్ మీడియాలో తమ అభిమానులతో పంచుకున్నారు. ఇక అప్పటి నుంచి ఈ జంట నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు. ముఖ్యంగా వీళ్ల మధ్య ప్రేమ ఎలా మొదలైందని, పెళ్లేప్పుడు చేసుకుంటారు, ఎక్కడ చేసుకోబోతున్నరనే విషయం పై నెట్టింట చర్చలు మొదలైయ్యాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ లవ్ బర్డ్స్.. సీక్రెట్ గా పెళ్లి చేసుకొని అందరికీ షాక్ ఇచ్చారు. ప్రస్తుతం ఫోటోస్ నెట్టింట వైరల్ గా మారాయి. ఆ వివరాలేంటో చూద్దాం.
చాలాకాలంలో ప్రేమలో విహరిస్తున్న హీరో సిద్దార్థ్, ఆదితి ఎట్టాకేలకు వివాహ బంధంతో ఒకటైయ్యారు. కాగా, వీరి వివాహం వనపర్తి జిల్లాలోని దాదాపు 400 ఏళ్ల చరిత్ర కలిగిన శ్రీరంగాపురంలోని రంగనాథ స్వామి ఆలయంలో జరిగింది. అత్యంత దగ్గర బంధువులు, కుటుంబ సభ్యులు సమక్షంలో.. హీరో సిద్దార్థ్, ఆదితితో ఏడడుగులు వేశారు. కాగా, ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే ఈ ఫోటోలో కొత్త జంట పట్టు వస్త్రాల్లో.. చూడముచ్చటగా ఉన్నారు. కాకపోతే వీరి వివాహం ఆదివారం జరిగిందా, నేడు సోమవారం ఉదయం జరిగిందా అనే విషయం క్లారిటీ లేదు.
ఇకపోతే సిద్దార్థ్, ఆదితికి మహా సముద్రం షూటింగ్ సమచంలో పరిచయం ఏర్పడిన విషయం తెలిసిందే. ఇక ఆ పరిచయం ప్రేమగా మారి.. కొన్నాళ్ల పాటు ప్రేమ పక్షుల చెట్టాపట్టాలేసుకొని తిరిగిన ఈ జంట ఆ తర్వాత ఎంగేజ్ మెంట్ చేసుకున్నారు. కాగా, ఇప్పుడు మూడుముళ్ల బంధంతో ఒకటైయ్యారు. అయితే వీరిద్దరికి ఇది రెండో పెళ్లి కావడం విశేషం. ఎందుకంటే.. 2003లో సిద్దార్థ్, మేఘనా నారాయణ్‌ని వివాహం చేసుకుని నాలుగేళ్లకు విడాకులిచ్చాడు. ఆదితీ కూడా సత్యదీప్ మిశ్రా అనే నటుడ్ని 2009లో వివాహం చేసుకుని, 2013లో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. మరీ, ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సిద్దార్థ్ , ఆదితి రావ్ పెళ్లి ఫోటోలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.