iDreamPost
android-app
ios-app

రవితేజ సంచలన నిర్ణయం.. త్వరలోనే ఆ బిజినెస్‌లోకి ఎంట్రీ!

  • Published Feb 22, 2024 | 8:19 AM Updated Updated Feb 23, 2024 | 12:20 PM

Raviteja: సినీ ఇండస్ట్రీలో చాలామంది సెలబ్రిటీస్ స్టార్స్ గా కొనసాగుతునే మరోపక్క పలు వ్యాపార రంగంలో దూసుకుపోతున్నా విషయం తెలిసిందే. అయితే తాజగా ఇప్పుడు మరో స్టార్ హీరో కూడా ఈ వ్యాపార రంగంలోకి ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంతకి ఆయన ఎవరంటే..

Raviteja: సినీ ఇండస్ట్రీలో చాలామంది సెలబ్రిటీస్ స్టార్స్ గా కొనసాగుతునే మరోపక్క పలు వ్యాపార రంగంలో దూసుకుపోతున్నా విషయం తెలిసిందే. అయితే తాజగా ఇప్పుడు మరో స్టార్ హీరో కూడా ఈ వ్యాపార రంగంలోకి ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంతకి ఆయన ఎవరంటే..

  • Published Feb 22, 2024 | 8:19 AMUpdated Feb 23, 2024 | 12:20 PM
రవితేజ సంచలన నిర్ణయం.. త్వరలోనే ఆ బిజినెస్‌లోకి ఎంట్రీ!

సినీ ఇండస్ట్రీలో చాలామంది సెలబ్రిటీస్ ఒకపక్క స్టార్స్ గా కొనసాగుతునే.. మరోపక్క కమర్షియల్ యాడ్స్ చేస్తూ రెండు చేతులా డబ్బులను సంపాదిస్తుంటారు. అలాగే మరికొందరు అయితే.. పలు వ్యాపార రంగంలోకి అడుగు పెడుతూ తమదైన శైలిలో దూసుకుపోతున్నారు. ఇప్పటికే ‘మహేశ్ బాబు’ (AMB సినమాస్) ‘అల్లు అర్జున్’ ( AAA సినిమాస్) ‘విజయ్ దేవరకొండ’ (AVDసినిమాస్) వంటి మల్టీప్లెక్స్ బిజినెస్ లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఇప్పుడు మరో స్టార్ హీరో కూడా ఇదే బాటలో నడుస్తున్నారు. ఆయన కూడా త్వరలోనే మల్టీప్లెక్స్ బిజినెస్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. ఇంతకి ఆయన ఎవరంటే..

చాలామంది స్టార్స్ వెండితెర పై అలరిస్తునే మరో వైపు వ్యాపార సామ్రజ్యంలోని తమదైన ముద్రను వేసుకుంటారు. ఇప్పటికి పలువురు స్టార్స్ బిజినెస్ లో సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్న తరుణంలో తాజాగా మరో స్టార్ హీరో కూడా ఈ వ్యాపార రంగంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఆయన మాస్ మహారాజా ‘రవితేజ’. ఈయన కోసం తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈయన ఎటువంటి సినీ బ్యాక్ గ్రాండ్ లేకుండానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. అలా తన కెరియర్ ప్రారంభంలోనే ఎన్నో సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించిన ఆయన నేడు స్టార్ హీరోగా ఎదిగారు. ఈ క్రమంలోనే ఎన్నో ఆద్భుతమైన చిత్రాల్లో నటించి మంచి హిట్ లను అందుకున్నారు.

ఇకపోతే రవితేజ ఎక్కువగా సినిమాల్లో తప్ప ఇతర విషయాలపై అంతగా దృష్టి పెట్టారు. అలాగే ఇప్పటి వరకు ఆయన సినిమాల్లో నటించి ఆదాయాన్ని సంపాదించడం తప్ప ఇతర బిజినెస్ ల్లో కూడా కొనసాగడం లేదు. అయితే తాజాగా రవితేజ ఓ థియేటర్ బిజినెస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు సమాచారం అందింది. అది కూడా ఎసియన్ సంస్థతో కలిసి దిల్ సుఖ్ నగర్ ఏరియాలో ‘ఏఆర్ టి’ పేరుతో 6 స్క్రీన్ లతో ఓ భారీ మల్టీ ప్లెక్స్ థీయేటర్ ను ప్రారంభించానున్నారు. కాగా, ఈ మల్టీ ప్లెక్స్ థియేటర్ ను మరి కొద్ది రోజుల్లోనే ఓపెన్ చేయబోతున్నట్లు సమాచారం. ఇలా ఇంత కాలం పాటు కేవలం సినిమాలలో నటిస్తూ ఆదాయాన్ని సంపాదించిన రవితేజ.. థియేటర్ బిజినెస్ లోకి కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు టాక్ నడుస్తోంది.

కాగా, రవితేజ ఇటీవలే ‘ఈగల్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు కార్తిక్ ఘట్టమనేని తెరకెక్కించారు. ఇందులో అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక భారీ అంచనాల నడుమ విడుదలైన ఈగల్ సినిమా కలెక్షన్స్ పరంగా దూసుకుపోయింది. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం రవితేజ్ ‘మిస్టర్ బచ్చన్’ అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ గా జరుగుతుంది. మరి, త్వరలో రవితేజ కూడా బిజినెస్ రంగంలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారనే వార్త పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss