iDreamPost
android-app
ios-app

అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా.. రియల్‌ లైఫ్‌ లవ్‌పై రక్షిత్‌ ఏమన్నాడంటే..

  • Published Nov 15, 2023 | 1:14 PM Updated Updated Nov 15, 2023 | 1:14 PM

రక్షిత్‌ శెట్టి ప్రస్తుతం ‘‘ సప్త సాగరాలు దాటి’ సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. తెలుగులో ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన లవ్‌ స్టోరీ గురించి చెప్పుకొచ్చారు...

రక్షిత్‌ శెట్టి ప్రస్తుతం ‘‘ సప్త సాగరాలు దాటి’ సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. తెలుగులో ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన లవ్‌ స్టోరీ గురించి చెప్పుకొచ్చారు...

  • Published Nov 15, 2023 | 1:14 PMUpdated Nov 15, 2023 | 1:14 PM
అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా.. రియల్‌ లైఫ్‌ లవ్‌పై రక్షిత్‌ ఏమన్నాడంటే..

తెలుగు ప్రేక్షకులకు సినిమా పైన ఉన్న అభిమానం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నటన నచ్చితే చాలు భాషతో సంబంధం లేకుండా అందరినీ ఆదరిస్తూ ఉంటారు. అలా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన వారు ఎంతో మంది ఉన్నారు. అలాంటి వారిలో కన్నడ స్టార్‌ హీరో “రక్షిత్‌ శెట్టి ” కూడా ఒకరు. కన్నడలో రక్షిత్‌ శెట్టి గురించి తెలియని వాళ్లుండరు. నటన, దర్శకత్వం,నిర్మాణం,రచన ఇలా బహుముఖ ప్రజ్ఞ కనబరుస్తూ ఫిల్మ్ ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించారు. “చార్లీ 777” మూవీతో తెలుగుతో పాటు దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

తెలుగు ప్రేక్షకులకు సినిమాలతో పరిచయం అవ్వటం కంటే ముందు.. రష్మికతో బ్రేకప్‌ స్టోరీ ద్వారా అందరి నోళ్లలో నానారు. అయితే, రష్మికతో ప్రేమ వ్యవహారం కంటే ముందు తన లైఫ్‌లో ఓ లవ్ స్టోరీ ఉందంటూ రక్షిత్‌ శెట్టి చెప్పుకొచ్చారు. ఆ ప్రేమ కథలో స్నేహితుడే విలన్‌ అయ్యాడని అన్నారు. రక్షిత్‌ శెట్టి నటించిన తాజా చిత్రం ‘సప్త సాగరాలు దాటి సైడ్‌ బీ’ విడుదలకు సిద్ధంగా ఉంది. నవంబర్‌ 17న దేశ వ్యాప్తంగా రిలీజ్‌ అవ్వనుంది. ఈ నేపథ్యంలో గత కొద్దిరోజులనుంచి సినిమా టీం ప్రమోషన్లలో బిజీ అయింది.

మిగిలిన భాషల్తో పోల్చుకుంటే తెలుగు మీద ఎక్కువ దృష్టి పెట్టారు. సొంత ప్రొడక్షన్‌ హౌస్‌ నుంచి వస్తున్న సినిమా కావటంతో రక్షిత్‌ ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటున్నారు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన జీవితంలోని లవ్‌స్టోరీ గురించి చెప్పుకొచ్చారు. ఆయన మాట్లాడుతూ.. ‘‘ నేను బీ టెక్ సెకండ్ ఇయర్ లో ఉన్నపుడు ఒక అమ్మాయిని చూశా. తనకి లవ్ లెటర్ ఇవ్వమని నా ఫ్రెండ్ కి లెటర్స్ రాసి ఇచ్చేవాడిని. అలా రెండేళ్లు గడిచిపోయాయి. కానీ, ఆ అమ్మాయి నుంచి ఎలాంటి రిప్లై లేదు. ఆ తర్వాత తెల్సింది ఏంటంటే.. నేను ఇచ్చిన లెటర్స్ ని నా ఫ్రెండ్, ఆ అమ్మాయికి ఒక్కటి కూడా ఇవ్వలేదు.

ట్విస్ట్ ఏంటంటే ఇప్పుడు వాళ్లిద్దరూ భార్యా భర్తలు’’ అని హీరో రక్షిత్‌ శెట్టి తన ప్రేమ గురించి చెప్పాడు. కాగా, రష్మిక మందన్న ‘కిరిక్ పార్టీ’ సినిమాతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రక్షిత్‌ శెట్టి హీరో. ఈ సినిమా సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఇరు కుటుంబాల అంగీకారంతో నిశ్చితార్థం కూడా జరిగింది. మరికొన్ని నెలల్లో పెళ్లి అనగా.. అనుకోని విధంగా నిశ్చితార్థం క్యాన్సిల్‌ అయింది. రక్షిత్‌- రష్మికలు విడిపోయారు. వీరిద్దరూ విడిపోవటానికి గల సరైన కారణంగా ఇప్పటి వరకు ఎవ్వరికీ తేలీదు. మరి, రక్షిత్‌ శెట్టి కాలేజ్‌ లవ్‌ స్టోరీపై మీ అభిప్రాయాలను కామెంట్లరూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom