iDreamPost
android-app
ios-app

పేరు మార్చుకున్న ప్రభాస్!.. ఇక నుంచి అందరు ఇలా పిలవాల్సిందే?

  • Published Jan 15, 2024 | 12:07 PM Updated Updated Jan 15, 2024 | 12:19 PM

డార్లింగ్ ప్రభాస్ తన పేరును మార్చుకున్నారు. ఇక నుంచి అన్ని అధికారిక ప్రచురణలలో ఆ పేరుతోనే ప్రచురిస్తారట. ఇక నుంచి ప్రభాస్ ను అలా పిలవాల్సిందేనట? ఇంతకీ ప్రభాస్ మార్చుకున్న ఆ పేరు ఏంటో తెలుసా?

డార్లింగ్ ప్రభాస్ తన పేరును మార్చుకున్నారు. ఇక నుంచి అన్ని అధికారిక ప్రచురణలలో ఆ పేరుతోనే ప్రచురిస్తారట. ఇక నుంచి ప్రభాస్ ను అలా పిలవాల్సిందేనట? ఇంతకీ ప్రభాస్ మార్చుకున్న ఆ పేరు ఏంటో తెలుసా?

  • Published Jan 15, 2024 | 12:07 PMUpdated Jan 15, 2024 | 12:19 PM
పేరు మార్చుకున్న ప్రభాస్!..  ఇక నుంచి అందరు ఇలా పిలవాల్సిందే?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస సినిమాలు చేస్తూ బిజీ అయిపోయారు. ఫ్యాన్స్ కు మరింత వినోదాన్ని పంచేందుకు సిద్ధమవుతున్నారు. చాలా గ్యాప్ తర్వాత సలార్ సీజ్ ఫైర్ పార్ట్ 1 తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు రెబల్ స్టార్. ప్రశాంత్ నీల్ దర్శకత్వలో ప్రభాస్ నటించిన సలార్ బాక్సాఫీస్ వద్ద 700 కోట్లకు పైగా కలెక్ట్ చేసి రికార్డులను బద్దలు కొట్టింది. ఇక ప్రభాస్ తన నెక్ట్స్ సినిమా డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న కల్కి ఏడీలో నటిస్తున్నారు. ఈ సినిమా మే 09 2024న విడుదల కానుంది. కాగా తాజాగా డార్లింగ్ నటిస్తున్న ది రాజా సాబ్ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. ఈ పోస్టర్ లో ప్రభాస్ తన పేరును మార్చుకున్నారు. ఇక నుంచి అందరు ప్రభాస్ ను అలాపిలవాల్సిందేనట.

బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు పొందిన ప్రభాస్ తన పేరును మార్చుకున్నారు. ప్రభాస్(Prabhas) తన పేరుకు అదనంగా ‘ఎస్’ జోడించారు. ఈ రోజు నుంచి, అన్ని అధికారిక ప్రచురణలలో అతని పేరు #PRABHASS అని ప్రచురించనున్నట్లు తెలుస్తోంది. తాజాగా విడుదలైన ది రాజా సాబ్ ఫస్ట్ లుక్ పోస్టర్ లో ప్రభాస్ పేరులో మార్పు కనిపించింది. మీరు పోస్టర్ లో ప్రభాస్ మారిన పేరును చూడొచ్చు. మరి ఇది పోస్టర్ లో తప్పిదం జరిగిందా లేదా నిజంగానే ప్రభాస్ పేరు మార్చుకున్నారా అనేది అధికారికంగా తెలియాల్సి ఉంది.

డైరెక్టర్ మారుతీ, హీరో ప్రభాస్ కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రానికి సంబంధించిన టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు చిత్ర యూనిట్. ఈ సినిమాకు ది రాజా సాబ్ అనే టైటిల్ ని ఖరారు చేశారు. ఇక ఫస్ట్ లుక్ పోస్టర్ లో డార్లింగ్ ప్రభాస్ మాస్ లుక్ లో దర్శనమిచ్చారు. లుంగీ పైకెత్తి ఊరమాస్ లుక్ తో ప్రభాస్ అదరగొడుతున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తుంటే ఇక మాస్ జాతర షురువైనట్టు తెలుస్తోంది. పోస్టర్ అంతా చాలా కలర్ ఫుల్ గా ఉంది. ఫస్ట్ లుక్ పోస్టర్ కు ఆడియెన్స్ నుంచి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా సగం అయిపోయిందని సమాచారం. ఈ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుండగా ఇందులో నిధి అగర్వాల్, రిధి కుమార్, మాళవిక మోహనన్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom