iDreamPost
android-app
ios-app

తల్లి అడిగిన ప్రశ్నకు షాక్‌ అయిన హీరో నవదీప్‌!

  • Published Nov 18, 2023 | 8:28 AM Updated Updated Nov 18, 2023 | 8:28 AM

హీరో నవదీప్‌ తల్లి తాజాగా ఆయన్ని ఓ ప్రశ్న అడిగింది. ఆ ప్రశ్నతో ఆయన షాక్‌ అయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియోను తన సోషల్‌ మీడియా ఖాతాలో షేర్‌ చేశారు. ఆ వీడియో కాస్తా వైరల్‌గా మారింది.

హీరో నవదీప్‌ తల్లి తాజాగా ఆయన్ని ఓ ప్రశ్న అడిగింది. ఆ ప్రశ్నతో ఆయన షాక్‌ అయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియోను తన సోషల్‌ మీడియా ఖాతాలో షేర్‌ చేశారు. ఆ వీడియో కాస్తా వైరల్‌గా మారింది.

  • Published Nov 18, 2023 | 8:28 AMUpdated Nov 18, 2023 | 8:28 AM
తల్లి అడిగిన ప్రశ్నకు షాక్‌ అయిన హీరో నవదీప్‌!

ఎలాంటి సినీ బ్యాక్‌ గ్రౌండ్‌ లేకుండా చిత్ర పరిశ్రమలో హీరోగా తనకంటూ ఓ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు నవదీప్‌. దాదాపు 19 ఏళ్లుగా చిత్ర పరిశ్రమలో కొనసాగుతున్నారు. మాతృభాష తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లో సినిమాలు చేశారు. కేవలం సినిమాల్లోనే కాదు.. పలు టీవీ షోలకు హోస్ట్‌గా వ్యవహరించారు. ప్రస్తుతం తెలుగులో ఈగల్‌, లవ్‌ అనే రెండు సినిమాల్లో నటిస్తున్నారు. ఈ రెండు సినిమాలు ప్రస్తుతం షూటింగ్‌ జరుపుకుంటున్నాయి. ఇక, నవదీప్‌ వ్యక్తిగత విషయానికి వస్తే.. ఇండస్ట్రీలో ఉన్న మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్స్‌లో ఆయన కూడా ఒకరు. ఆయన 40వ పడికి దగ్గరలో ఉన్నారు.

చాలా సార్లు ఆయన పెళ్లిపై వార్తలు వచ్చినా.. అవి కేవలం పుకార్లుగానే మిగిలిపోయాయి. నవదీప్‌ తల్లి ఆయన్ని పెళ్లి చేసుకోమని నిత్యం అడుగుతూనే ఉంటారట. ఏదో ఒక కారణం చెప్పి ఆయన పెళ్లి విషయం దాట వేస్తూ ఉంటారట. తాజాగా నవదీప్‌ తన సోషల్‌ మీడియా ఖాతాలో ఓ వీడియో పోస్టు చేశారు. నవదీప్‌కు ఆయన తల్లికి మధ్య పెళ్లి గురించి జరిగిన సంభాషణ తాలూకా వీడియో అది. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసిన ఆ వీడియోలో.. ‘‘ పెళ్లిళ్ల మీద నా అభిప్రాయం తెలిసిన మా మదర్‌ ఇండియా.. పొద్దున నన్ను ఓ క్వశ్చన్‌ అడిగింది.

నిజంగానే పెళ్లిళ్లు అంత బ్యాడ్‌ అయితే.. పెళ్లిళ్లు వర్కవుట్‌ అవ్వక విడాకులు తీసుకున్న వాళ్లు మళ్లీ ఎందుకు పెళ్లి చేసుకుంటారురా? అని అడిగింది. ఐ క్విట్‌’’ అని అన్నారు. ఈ పోస్టుకు ఆయన ‘ఎవరైనా ఆమెకు దయచేసి చెప్పండి!’ అనే శీర్షిక పెట్టారు. వీడియోపై ‘‘జరగాలి పెళ్లి’’ అనే హ్యాష్‌ ట్యాగ్‌ యాడ్‌ చేశారు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక, ఈ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు ‘‘ ఒక సినిమా ప్లాప్‌ అయితే.. మానేస్తామా అన్నా.. మళ్లీ ఇంకో సినిమా తీస్తామ్‌’’.. ‘‘ హాహా మంచి ప్రశ్న అడిగింది’’..‘‘ ఆ పాయింట్‌ కరెక్టే కదా!’’..

‘‘ అనుభవానికి మించిన గురువు లేరు బ్రో.. అనుభవించు’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా, నవదీప్‌ గత కొద్ది ఏళ్లనుంచి వరుస వివాదాల్లో చిక్కుకుంటూ ఉన్నారు. తాజా డ్రగ్స్‌ కేసులో నవదీప్‌ పేరు కూడా వినిపించింది. నార్కోటిక్స్‌ డిపార్ట్‌మెంట్‌ ఆయనకు నోటీసులు కూడా పంపింది. విచారణకు రమ్మని ఆదేశించారు. ఆయన విచారణకు వెళ్లి వచ్చారు. తనకు.. ఆ డ్రగ్స్‌ కేసుకు ఎలాంటి సంబంధం లేదని నవదీప్‌ అన్నారు. మరి, తల్లి నవదీప్‌ను పెళ్లి, విడాకులపై అడిగిన ప్రశ్నపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Nav Deep 2.0 (@pnavdeep)

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetHoliganbetHoliganbetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom