iDreamPost
android-app
ios-app

నాగశౌర్య వేరు కాపురం.. కోడలి గురించి హీరో తల్లి ఏమందంటే..

  • Published Dec 30, 2023 | 6:14 PM Updated Updated Dec 30, 2023 | 6:14 PM

2022 నవంబర్ 20న నాగశౌర్య పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. బెంగళూరుకు చెందిన అనూష శెట్టిని ఆయన పెళ్లి చేసుకున్నారు. పెళ్లైన కొన్ని నెలలకే వేరు కాపురం పెట్టారని ప్రచారం మొదలైంది.

2022 నవంబర్ 20న నాగశౌర్య పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. బెంగళూరుకు చెందిన అనూష శెట్టిని ఆయన పెళ్లి చేసుకున్నారు. పెళ్లైన కొన్ని నెలలకే వేరు కాపురం పెట్టారని ప్రచారం మొదలైంది.

  • Published Dec 30, 2023 | 6:14 PMUpdated Dec 30, 2023 | 6:14 PM
నాగశౌర్య వేరు కాపురం.. కోడలి గురించి హీరో తల్లి ఏమందంటే..

పెళ్లి తర్వాత భార్యాభర్తలు కుటుంబంతో కలిసి ఉండాలా? లేదా? వేరు కాపురం పెట్టాలా? అన్నది పూర్తిగా కుటుంబ విషయం. గొడవలు ఉన్నా లేకపోయినా.. భార్యాభర్తలకు స్వేచ్ఛ ఉండాలన్న ఉద్ధేశ్యంతో.. వేరే కాపురం ఆలోచన చేస్తుంటారు పెద్దలు. అయితే, సాధారణ జనాల విషయంలో పెద్దగా పట్టింపులోకి రాని ఈ విషయం.. సెలెబ్రిటీల విషయంలో మాత్రం పెద్ద తప్పుగా ప్రొజెక్ట్‌ అవుతూ ఉంది. కొత్తగా పెళ్లయి వేరు కాపురం పెడుతున్న సెలెబ్రిటీ జంటలపై కొంతమంది నెటిజన్లు ట్రోలింగ్స్‌ చేస్తున్నారు.

తాజాగా, ప్రముఖ టాలీవుడ్‌ హీరో నాగశౌర్యపై కూడా సోషల్‌ మీడియాలో ట్రోలింగ్‌ మొదలైంది. ఆయన వేరు కాపురం పెట్టడమే ఇందుకు ప్రధాన కారణం. మొన్నటి వరకు ఇవి పుకార్లుగానే ఉండేవి. ఎలాంటి క్లారిటీ లేని సమయంలో కూడా విమర్శలు చేస్తున్నారు. తల్లిదండ్రులను వదలి పెట్టి ఎలా పక్కకు పోతావ్‌ అంటూ ప్రశ్నిస్తున్నారు కూడా. అయితే, నాగశౌర్య వేరు కాపురంపై ఆయన తల్లి తాజాగా స్పందించారు. ఉషా మల్పూరి మీడియాతో మాట్లాడుతూ..

అనూష శెట్టిని నాగశౌర్య ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని తెలిపారు. 2022 నవంబర్ 20న వీరి వివాహం జరిగిందని వెల్లడించారు. బెంగుళూరుకు చెందిన అనూష.. పెళ్లి తర్వాత హైదరాబాద్‌కు షిఫ్ట్ అయిపోయిందని, ఇక్కడే ఒక ఆఫీస్‌ను ఏర్పాటు చేసుకుందని తెలిపారు. అయితే! పెళ్లయిన కొన్నిరోజులకే వీరిద్దరూ ఇంటి నుంచి వెళ్లిపోయి వేరు కాపురం పెట్టారని రూమర్స్ వచ్చాయని అన్నారు. వారు పెళ్లయిన కొన్నిరోజులకే వేరు కాపురం పెట్టారని, ఇదంతా పెళ్లికి ముందే మాట్లాడుకున్నామని చెప్పారు.

‘‘ అనూష చాలా మంచి పిల్ల. శౌర్యతో పెళ్లికాకముందు నుండే అనూషతో పరిచయం ఉంది. శౌర్యతో తన జోడీ బాగుంటుందని అనిపించి పెళ్లి జరిపించాము. అనూషను కూతురిలాగానే చూశాము. తను కూడా మమ్మల్ని తల్లిదండ్రుల్లా చూసుకునేది. మమ్మల్ని మమ్మీ, డాడీ అని పిలుస్తుంది. తను ఇంట్లో పనులన్నీ చక్కబెట్టుకునే ఆఫీసుకు వెళ్తుంది. బాగా ఆలోచించే అమ్మాయి. శౌర్య, అనూష వేరుగా ఉండాలని ముందు నుండే అనుకున్నారు. ఈ తరంలో పిల్లలకు స్వేచ్ఛ కావాలి కాబట్టి వారికి ఇచ్చాము. ఇందులో వేరుగా ఆలోచించడానికి, అనుకోవడానికి ఏమీ లేదు’’ అని అన్నారు.

కాగా, నాగశౌర్య 2011లో వచ్చిన క్రికెట్‌ గన్స్‌ అండ్‌ బీర్‌ సినిమాతో చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు. ఊహలు గుసగుసలాడే మూవీ మంచి విజయాన్ని అందుకున్నారు. 2023లో ‘రంగబలి’ అనే చిత్రంతో ప్రేక్షకుల్ని పలకరించారు. మరి, నాగశౌర్య వేరు కాపురంపై ఆయన తల్లి క్లారిటీ ఇవ్వటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss