iDreamPost
android-app
ios-app

కవల పిల్లలు అంటూ ప్రచారం.. ట్విస్ట్ రివీల్ చేసిన మంచు మనోజ్!

  • Published Mar 12, 2024 | 9:08 PM Updated Updated Mar 12, 2024 | 9:41 PM

Manchu Manoj Reacts about Rumours: సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా సెలబ్రెటీలకు సంబంధించిన ఏ చిన్న విషయమైనా క్షణాల్లో హల్ చల్ అవుతుంటాయి.

Manchu Manoj Reacts about Rumours: సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా సెలబ్రెటీలకు సంబంధించిన ఏ చిన్న విషయమైనా క్షణాల్లో హల్ చల్ అవుతుంటాయి.

  • Published Mar 12, 2024 | 9:08 PMUpdated Mar 12, 2024 | 9:41 PM
కవల పిల్లలు అంటూ ప్రచారం.. ట్విస్ట్ రివీల్ చేసిన మంచు మనోజ్!

ప్రపంచంలో టెక్నాలజీ పెరిగిపోతుంది.. సోషల్ మీడియా వచ్చిప్పటి నుంచి ఎన్నో రకాల వార్తలు, వీడియోలు క్షణాల్లో చూసే అవకాశం లభిస్తుంది. సోషల్ మీడియా వచ్చినప్పటి మంచి ఎంత జరుగుతుందో.. చెడు కూడా అంతే జరుగుతుంది. ముఖ్యంగా సెలబ్రెటీల విషయంలో సోషల్ మీడియా పెద్ద తలనొప్పిగా మారిందని అంటారు.   ఇండస్ట్రీ.. నటీనటులకు సంబంధించిన వార్తలు క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. తమ గురించి నెట్టింట్లో ప్రచారమయ్యే రూమర్ల విషయంలో సెలబ్రెటీలు పడే తిప్పలు అన్నీ ఇన్నీ కావు. అలాంటి ఓ అసత్య ప్రచారం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో క్లారిటీ ఇచ్చారు మంచు విష్ణు. వివరాల్లోకి వెళితే..

తెలుగు ఇండస్ట్రీలోకి మంచు మోహన్ బాబు తనయుడు మంచు మనోజ్ బాల నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు. 2004లో దొంగ దొంగది మూవీతో హీరోగా మారాడు. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. కొంత కాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇటీవల మంచు మనోజ్.. భూమా నాగిరెడ్డి దంపతుల కుమార్తె భూమా మౌనికా రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం మౌనికా రెడ్డి ప్రెగ్నెంట్ అన్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని స్వయంగా మంచు మనోజ్ ఇటీవల సోషల్ మీడియా వేదికగా తెలిపారు. మంచు మనోజ్ దంపతులకు కవల పిల్లలు పుట్టారంటూ సోషల్ మీడియాలో తెగ వార్తలు వస్తున్నాయి. తాజాగా దీనిపై స్పందించిన మనోజ్ ఆ వార్తలు నమ్మకండి.. అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.

సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు స్పందించిన మనోజ్ ట్విట్టర్ వేధికగా పోస్ట్ చేశారు. ‘దయచేసి మా విషయంలో ఎలాంటి రూమర్స్ నమ్మకండి. మాకు సంబంధించిన ఏ విషయమైనా అధికారికంగానే ప్రకటిస్తాం. మాకు కవల పిల్లలు పుట్టబోతున్నట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు.. అసలు ఈ వార్త ఎలా పుట్టుకొచ్చిందో తెలియదు. ప్రస్తుతం నా భార్య మౌనిక కు ఏడవ నెల. ఈ ఏడాది మే నెలలో మా ఇంటికి రాబోతున్న బిడ్డ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం. కొన్ని సంవత్సరాలుగా మీ ప్రేమ, ఆధరణ, ఆప్యాయత, మద్దతు కు నా ప్రత్యేక ధన్యవాదాలు’ అంటూ రాసుకొచ్చారు. ప్రస్తతుం మంచు మనోజ్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Jojobet GirişJojobetşanlıurfa konteynerGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetjojobetjojobetbetwooncasibomcasibomcasibombetcio giriş