iDreamPost
android-app
ios-app

ఫ్యాన్స్‌కు కార్తీ మాస్‌ వార్నింగ్‌.. రేయ్‌ ఎవడైనా…

  • Published Nov 04, 2023 | 11:46 AM Updated Updated Nov 04, 2023 | 11:46 AM

ఈ ప్రీరిలీజ్‌ కార్యక్రమానికి నాచురల్‌ స్టార్‌ నానీ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నాని-కార్తీలు ఒకరితో ఒకరికున్న బంధాన్ని చెప్పుకొచ్చారు.

ఈ ప్రీరిలీజ్‌ కార్యక్రమానికి నాచురల్‌ స్టార్‌ నానీ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నాని-కార్తీలు ఒకరితో ఒకరికున్న బంధాన్ని చెప్పుకొచ్చారు.

  • Published Nov 04, 2023 | 11:46 AMUpdated Nov 04, 2023 | 11:46 AM
ఫ్యాన్స్‌కు కార్తీ మాస్‌ వార్నింగ్‌.. రేయ్‌ ఎవడైనా…

తమిళ స్టార్‌ హీరో కార్తీకి తమిళంలో ఎంత క్రేజ్‌ ఉందో.. తెలుగు నాట కూడా అంతే క్రేజ్‌ ఉంది. సూర్య తమ్ముడిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయినా.. తనకంటూ ఓ మంచి గుర్తింపు తెచ్చుకున్నారాయన. కార్తీ సినిమాలు తమిళంతో పోటీగా ఇక్కడ కూడా ఆడుతున్నాయి. మంచి కలెక్షన్లను సైతం రాబడుతున్నాయి. ఆయన తాజా చిత్రం ‘ జపాన్‌’ త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది. దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో నిన్న హైదరాబాద్‌లో ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ జరిగింది.

ఈ ప్రీరిలీజ్‌ కార్యక్రమానికి నాచురల్‌ స్టార్‌ నానీ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నాని-కార్తీలు ఒకరితో ఒకరికున్న బంధాన్ని చెప్పుకొచ్చారు. కార్తీ మాట్లాడుతూ.. ‘‘ మనం ఎక్కడినుంచి మొదలవుతామో అది ముఖ్యం కాదు.. సిన్సియర్‌గా హార్డ్‌ వర్క్‌ చేసి మన టాలెంట్‌ పెంచుకుంటూ వెళితే.. ఎక్కడికైనా వెళ్లొచ్చు అనడానికి నానీ మొదటి ఉదాహరణ. అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా స్టార్ట్‌ చేసి.. కొత్త కొత్త క్యారెక్టర్లు చేసి.. కొత్త డైరెక్టర్లను ప్రోత్సహిస్తూ.. ఒక్కోసారి ఆయన సినిమాలు చూసినపుడు ఆశ్చర్యపోతూ ఉంటాము.

శ్యామ్‌ సింగరాయ్‌ కానీ, దసరా కానీ,.. అసలు దసరాలో ఆయన లుక్‌ మామలూలుగా ఉండదు. కొత్త స్క్రిప్ట్‌ ఉంది.. కొత్త స్క్రీన్‌ప్లే ఉంది.. అది డిఫరెంట్‌గా ఉంది అంటే.. అలాంటి వాటికి ఓ డోర్‌ ఉంది.. అది నాని ఇళ్లు.. మీరు అక్కడికి వెళ్లొచ్చు. తర్వాత మా అన్నయ్య నాగార్జున గారు. సర్థార్‌ బాగుందని ఫస్ట్‌ షో తర్వాత కాల్‌ చేసి చెప్పారు. ఈ సినిమాకు కూడా చెబుతారని నా నమ్మకం. ఈ సినిమా నవంబర్‌ 10న రాబోతోంది. ఎవడైనా థియేటర్‌కు రాలేదంటే.. సీటు కింద బాంబు పెడతా..’’ అని అన్నారు.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss