iDreamPost
android-app
ios-app

హీరో ధనుష్‌కు జంటగా ‘యానిమల్‌’ మూవీ బ్యూటీ త్రిప్తి!

  • Published Jul 13, 2024 | 6:25 PM Updated Updated Jul 13, 2024 | 6:25 PM

Dhansuh, Tripti Dimri: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన నటనతో సౌత్ ఇండియాలోనే స్టార్ హీరోగా గుర్తింపు పొందారు. త్వరలో రాయన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈనేపథ్యంలో ధనుష్ గురించి మరో క్రేజీ అప్ డేట్ వచ్చింది.

Dhansuh, Tripti Dimri: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన నటనతో సౌత్ ఇండియాలోనే స్టార్ హీరోగా గుర్తింపు పొందారు. త్వరలో రాయన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈనేపథ్యంలో ధనుష్ గురించి మరో క్రేజీ అప్ డేట్ వచ్చింది.

  • Published Jul 13, 2024 | 6:25 PMUpdated Jul 13, 2024 | 6:25 PM
హీరో ధనుష్‌కు జంటగా ‘యానిమల్‌’ మూవీ బ్యూటీ త్రిప్తి!

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన నటనతో సౌత్ ఇండియాలోనే స్టార్ హీరోగా గుర్తింపు పొందారు. ఇటీవలే సార్ సినిమాతో వచ్చి ప్రేక్షకులను అలరించారు. ఈ సినిమాలో ధనుష్ నటనకు ప్రేక్షకలు ఫిదా అయ్యారు. అలానే త్వరలో తన 50  సినిమా రాయన్ తో థియేటర్లలో సందడి చేయనున్నాడు. ఇదే సమయంలో ధనుష్ కి సంబంధించిన ఓ న్యూస్ వైరల్ అవుతోంది. ఆయన తన తదుపరి సినిమాలో యానిమల్ బ్యూటీ నటించనున్నట్లు తెలుస్తుంది. మరి.. ఆ వివరాలు, ఆ విశేషాలు ఏమిటో ఇప్పుడుచూద్దాం…

నేటితరంలో పాన్‌ ఇండియా హీరో అంటే ధనుష్‌ అని చెప్పాల్సిందే. ఆయనతో సినిమాలు చేయడానికి తమిళం, తెలుగు, హిందీ.. ఇలా అన్ని ఇండస్ట్రీలకు చెందిన దర్శక నిర్మాతలు ఇష్టపడుతుంటారు. ఇండస్ట్రీ ఏదైనా విజయం మాత్రం ధనుష్ దే. ఇదే ఆయన లెక్క కూడా. గతంలో షమితాబ్, రాంజన్ సినిమాలతో బాలీవుడ్ లో ఫుల్ క్రేజ్ సంపాదించాడు. అలానే ఆ తరువాత పలు బాలీవుడ్ సినిమాలో నటించి..మెప్పించాడు. అలానే మిగిలిన భాషాల్లో కూడా నటించి..సక్సెస్ హీరోగా పేరు సంపాదించాడు. ఈయనే సక్సెస్‌ ఫుల్‌ డైరెక్టర్, యాక్టర్, సింగర్. రాయన్ సినిమాతో అర్ధ సెంచరీ  పూర్తి చేశాడు. ఇదే సమయంలో తాజాగా మరోసారి బాలీవుడ్‌ చిత్రం చేయడానికి ధనుష్ రెడీ అవుతున్నారు. ఈయన ఇంతకు ముందు, షమితాబ్, రాంజానా, అట్రాంగి వంటి హిట్‌ మూవీస్ లో నటించిన సంగతి తెలిసింది. వీటిలో రాంజానా, అట్రాంగి సినిమాలకు ఆనంద్‌ ఎల్‌.రాయ్‌ దర్శవకత్వం వహించారు.

ఈ రెండు సినిమాలు మంచి హిట్ ను సొంతం చేసుకున్నాయి. కాగా వీరిద్దరు ఇప్పుడు హ్యాట్రిక్‌కు రెడీ అవుతున్నారని బాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. దీనికి తేరే ఇష్క్‌ మెయిన్‌ అనే టైటిల్‌ను నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ మూవీకి సంబంధించిన వార్త కొంతకాలం క్రితమే వెలువడింది. అయితే ఆ తరువాత దీనిపై ఎటువంటి అప్ డేట్ రాలేదు. చాలా రోజుల తరువాత తాజాగా వీరి కాంబినేషన్ లో రాబోతున్న ఈ సినిమా గురించి ప్రచారం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఇందులో హీరో ధనుష్‌ కు జోడిగా యానిమల్‌ చిత్రం ఫేమ్‌ త్రిప్తి దిమ్రి నటించనున్నట్లు తెలిసింది. అక్టోబరు నెలలో షూటింగ్‌ను ప్రారంభించి యూపీలోని పలు ప్రాంతాల్లో నిర్వహించనున్నట్లు సమాచారం. త్రిప్తి దిమ్రి..యానిమల్ సినిమాతో ఫుల్ క్రేజ్ సంపాదించింది. ప్రస్తుతం ఈ అమ్మడు చేతి నిండ సినిమాలతో బిజీగా ఉంది. తాజాగా ధనుష్ తో జోడీ అంటూ వార్త రావడంతో ఇద్దరి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Jojobet GirişHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetavrupabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabet