iDreamPost
android-app
ios-app

మహిళపై దాడి చేసిన స్టార్‌ హీరో కుక్క!

  • Published Nov 01, 2023 | 11:17 AM Updated Updated Nov 01, 2023 | 11:26 AM

స్టార్‌ హీరో ఇంటి ముందు కారు పార్కు చేసిన నేపథ్యంలో మహిళలపై కుక్క దాడి చేసింది. ఈ దాడిలో మహిళకు తీవ్రగాయాలయ్యాయి.

స్టార్‌ హీరో ఇంటి ముందు కారు పార్కు చేసిన నేపథ్యంలో మహిళలపై కుక్క దాడి చేసింది. ఈ దాడిలో మహిళకు తీవ్రగాయాలయ్యాయి.

  • Published Nov 01, 2023 | 11:17 AMUpdated Nov 01, 2023 | 11:26 AM
మహిళపై దాడి చేసిన స్టార్‌ హీరో కుక్క!

ఓ మహిళపై స్టార్‌ హీరో కుక్క దాడి చేసిన సంఘటన ఒకటి చోటుచేసుకుంది. స్టార్‌ హీరో ఇంటి ముందు కారు పార్కు చేసిన నేపథ్యంలో మహిళలపై కుక్క దాడి చేసింది. ఈ దాడిలో మహిళకు తీవ్రగాయాలయ్యాయి. అయితే, తనకు అంత ప్రమాదం జరిగినా దర్శన్‌ స్టాఫ్‌ ఏమాత్రం పట్టించుకోలేదని సదరు మహిళ ఆరోపిస్తోంది. ఇంతకూ ఏం జరిగిందంటే.. తాజాగా, ఓ మహిళ స్టార్‌ హీరో దర్శన్‌ ఇంటి ముందున్న ఖాళీ స్థలంలో కారు పార్కు చేసింది. ఈ నేపథ్యంలోనే దర్శన్‌ కుక్క ఒకటి కారు పార్కు చేసిన దగ్గరకు వచ్చింది.

అక్కడ ఉన్న మహిళపై దాడి చేసింది. ఆమె పొట్టను కరవటంతో తీవ్ర గాయం అయింది. ఈ సంఘటనపై మహిళ మాట్లాడుతూ.. ఆ దాడి కారణంగా నా పొట్టకు తీవ్ర గాయం అయింది. నా బట్టలు రక్తంతో తడిసిపోయాయి. దర్శన్‌ స్టాఫ్‌ నన్ను ఏమాత్రం పట్టించుకోలేదు. కుక్కను గట్టిగా అరిచి పక్కకు కూడా తీసుకెళ్లలేదు. నేను నా ఫ్రెండ్‌కు ఫోన్‌ చేశాను. అతడు అక్కడికి వచ్చాడు. దర్శన్‌ స్టాఫ్‌తో గొడవ పెట్టుకున్నాడు. నేను కూడా వారితో తగువుకు దిగాను. ‘ఇంతలా గాయపడింది కదా.. ఈమెను ఆస్పత్రికి తీసుకెళ్లెచ్చు కదా!’ అని వారిని అడిగాడు.

అక్కడ కారు ఎవరు పార్కు చేయమన్నారు అని ప్రశ్నించారు. అప్పుడు నేను ‘ మీ ఇంటి ముందు ఉన్న ఖాళీ స్థలంలో నేను కారు పార్కు చేశాను. అది మీది కాదుగా ’ అని అన్నా. దానికి వారు ‘ ఈ ఖాళీ స్థలం మాది’ అని అన్నారు. అప్పుడు నేను ‘ ఈ స్థలం మీది అయినపుడు బోర్డు పెట్టుకోవచ్చు కదా?’ అన్నాను. వాళ్లు మాత్రం చాలా కఠినంగా మాట్లాడారు. మానవత్వంతో వ్యవహరించలేదు ’’ అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. దర్శన్‌, అతడి స్టాఫ్‌పై పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

Jojobet GirişjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet giriş