iDreamPost
android-app
ios-app

హీరో అబ్బాస్‌ కుమారుడ్ని చూశారా?.. హీరోలను మించిన అందంతో..

  • Published Jul 17, 2023 | 10:03 AM Updated Updated Jul 17, 2023 | 10:58 AM
  • Published Jul 17, 2023 | 10:03 AMUpdated Jul 17, 2023 | 10:58 AM
హీరో అబ్బాస్‌ కుమారుడ్ని చూశారా?.. హీరోలను మించిన అందంతో..

హీరో అబ్బాస్‌ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. తెలుగులోనూ ఆయన పలు హిట్టు సినిమాల్లో నటించారు. 1996లో వచ్చిన ‘కాదల్‌ దేశం’ అనే సినిమాతో పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఈ సినిమా తమిళనాట సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. తర్వాత తెలుగులో ‘ ప్రేమ దేశం’గా డబ్‌ అయి రిలీజైంది. తెలుగులో కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా సాధించిన విజయంతో అబ్బాస్‌కు అవకాశాలు వెల్లువలా వచ్చాయి. తెలుగులో కూడా ఆయన సినిమాలు చేశారు.

1997లో వచ్చిన ‘ప్రియ ఓ ప్రియ’ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. తెలుగులో పదికి పైగా సినిమాల్లో నటించారు. 2015లో వచ్చిన ‘పచ్చకల్లమ్‌’ సినిమా తర్వాత చిత్ర పరిశ్రమకు దూరం అయ్యారు. సినిమాలకే కాదు.. దేశానికి కూడా దూరంగా వెళ్లిపోయారు. విదేశంలో భార్యాపిల్లలతో జీవిస్తున్నారు. అప్పుడప్పుడు ఇండియాకు వస్తుంటారు. ఇక, అబ్బాస్‌ ఓ కుమారుడు, కూతురు ఉన్నారు. ప్రస్తుతం అబ్బాస్‌ కుమారుడు అయ్‌మాన్‌ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

అబ్బాస్‌, అబ్బాస్‌ కుమారుడితో దిగిన ఫొటోలను నటి ఖుష్భూ తన ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేశారు. ‘‘ ఒక తల్లి కడుపులో పుట్టకపోయినా.. నా సోదరుడు అయిన అబ్బాస్‌ను ఓ పదేళ్ల తర్వాత కలిశాను. అతడి కుమారుడు అయ్‌మాన్‌ చాలా ఎత్తు పెరిగాడు. చాలా అందంగా తయారయ్యాడు. నేను అతడ్ని న్యూజిలాండ్‌లో చిన్నపిల్లాడిగా ఉన్నపుడు చూశాను’’ అని పేర్కొంది. ఆ ఫొటోలను చూస్తున్న నెటిజన్లు.. ‘‘ అచ్చం అబ్బాస్‌లానే అందంగా ఉన్నాడు’’.. ‘‘ హీరోలను ఏ మాత్రం తీసిపోకుండా చాలా హ్యాండ్సమ్‌గా ఉన్నాడు’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి, అబ్బాస్‌ కుమారుడి ఫొటొలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetşanlıurfa konteynerGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetjojobetjojobetbetwooncasibomcasibomcasibombetcio giriş