iDreamPost
android-app
ios-app

అదితిరావు షాకింగ్ కామెంట్స్.. వాళ్ల వల్లే ఇన్నాళ్లు గుర్తింపు దక్కలేదు అంటూ..!

  • Published May 07, 2024 | 3:35 PM Updated Updated May 07, 2024 | 3:35 PM

Heeramandi- Aditi Rao Hydari: హీరో సిద్ధార్థ్ కు కాబోయో భార్య అదితి రావు హైదరీకి ఇప్పుడు పాన్ ఇండియా లెవల్లో మంచి మార్కులు దక్కాయి. హీరామండి వెబ్ సిరీస్ కు విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు దక్కుతున్నాయి.

Heeramandi- Aditi Rao Hydari: హీరో సిద్ధార్థ్ కు కాబోయో భార్య అదితి రావు హైదరీకి ఇప్పుడు పాన్ ఇండియా లెవల్లో మంచి మార్కులు దక్కాయి. హీరామండి వెబ్ సిరీస్ కు విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు దక్కుతున్నాయి.

  • Published May 07, 2024 | 3:35 PMUpdated May 07, 2024 | 3:35 PM
అదితిరావు షాకింగ్ కామెంట్స్.. వాళ్ల వల్లే ఇన్నాళ్లు గుర్తింపు దక్కలేదు అంటూ..!

సినిమా ఇండస్ట్రీలో పూలు ఉంటాయి, ముళ్లు ఉంటాయి. ఈ విషయాన్ని ఎవరూ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే ఇప్పుడు స్టార్లుగా వెలుగుతున్న ఎంతోమంది కెరీర్ ప్రారంభంలో లెక్కలేనన్ని అమానాలను అనుభవించిం ఉంటారు. వారికి దక్కిన అవకాశాలు కూడా ఉపయోగం లేకుండా పోయి ఉంటాయి. ముఖం మీదే నువ్వెంత అని మాట్లాడి ఉంటారు. తాజాగా అదితిరావు హైదరీ తన లైఫ్ లో తనకి జరిగిన అన్యాయం గురించి ఓపెన్ కామెంట్స్ చేసింది. ఒక సినిమా వాళ్లు తనని ఎంతలా మోసం చేశారు అనే విషయాన్ని వెల్లడించింది. తనకు ఎప్పుడో దక్కాల్సిన గుర్తింపు వాళ్ల వల్లే దక్కకుండా పోయిందని చెప్పుకొచ్చింది.

అదితిరావు హైదరీకి తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తాజాగా సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించిన హీరామండి అనే అత్యంత ఎక్కువ బడ్జెట్ తో నిర్మించిన వెబ్ సిరీస్ లో అదితి రావు హైదరీ   మెరిసింది. ఒక వేశ్య పాత్రలో అదితిరావు హైదరీ అద్భుతమైన ప్రదర్శనతో విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. మనీషా కోయిరాలా, సోనాక్షి సిన్హా వంటి స్టార్ హీరోయిన్స్ ఉన్నా కూడా అదితికి మంచి గుర్తింపు లభించింది. ఈ వెబ్ సిరీస్ పై తన కాబోయే భర్త హీరో సిద్ధార్థ్ కూడా మంచి పాజిటివ్ రివ్యూ ఇచ్చాడు. హీరామండి వెబ్ సిరీస్ ఒక ప్రేమకథలా ఉందని చెప్పుకొచ్చాడు. సంగీతం, నృత్యం, దృశ్యాలు అన్నీ మెప్పిస్తాయని సర్టిఫికేట్ ఇచ్చేశాడు. ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ లో ఈ హీరామండి వెబ్ సిరీస్ వైరల్ గా మారింది. ఈ నేపథ్యంలో తాజాగా అదితిరావు హైదరీ ఓ ఇంటర్వ్యూలో తనకు ఎదురైన ఒక ఘోరమైన సంఘటనను పంచుకుంది.

Aditirao Hydari

తనకు ఒక సినిమాలో కీలక పాత్రకు ఆఫర్ వచ్చిందని చెప్పింది. అయితే సినిమా విడుదలైన తర్వాత తన పాత్ర కనీసం గెస్ట్ రోల్ అంత నిడివి కూడా లేదని చెప్పుకొచ్చింది. ఆ మూవీ మరేదో కాదు.. రణబీర్ కపూర్ హీరోగా చేసిన రాక్ స్టార్ చిత్రం. “రాక్ స్టార్ చిత్రంలో నన్ను ఒక కీలక పాత్రకు తీసుకున్నారు. షూటింగ్ కూడా పూర్తైంది. నా క్యారెక్టర్ అటు ఇటూగా ఒక 20 నిమిషాలు వస్తుంది అనుకున్నాను. కానీ అవుట్ పుట్ లో నా పాత్ర కనీసం ఒక అతిథి పాత్ర అంత నిడివి కూడా లేదు. నిజానికి నాకు గుర్తింపు ఎప్పుడో వచ్చేది. కానీ, వాళ్లు చేసిన పనికి అలా అయిపోయింది” అంటూ అదితిరావు హైదరీ తన మనసులో ఉన్న బాధను ప్రేక్షకులతో పంచుకుంది. ఇంక హీరామండి వెబ్ సిరీస్ లో మాత్రం అదితిరావు హైదరీ పాత్రకు మంచి అప్లాజ్ లభిస్తోంది. ఎంతో బాగా నటించి మెప్పించింది అంటున్నారు.

Jojobet GirişjojobetMadridbetJojobetJojobetjojobetJojobetlunabetfixbetjojobetsüpertotobetsüpertotobetjojobetjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet girişgrandpashabet