Krishna Kowshik
రవితేజ ఈగల్ మూవీ ఇటీవల విడుదలై.. మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. అయితే తొలి రోజు మంచి కలెక్షన్లను రాబట్టుకుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ కండక్ట్ చేసింది. ఆ సమయంలో దర్శకుడు హరీశ్ శంకర్ మాట్లాడుతూ..
రవితేజ ఈగల్ మూవీ ఇటీవల విడుదలై.. మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. అయితే తొలి రోజు మంచి కలెక్షన్లను రాబట్టుకుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ కండక్ట్ చేసింది. ఆ సమయంలో దర్శకుడు హరీశ్ శంకర్ మాట్లాడుతూ..
Krishna Kowshik
ఫిబ్రవరి 9న ఈగల్ మూవీతో ప్రేక్షకులకు మందుకు వచ్చాడు మాస్ మహారాజ్ రవితేజ. సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని దీన్ని తెరకెక్కించాడు. మలయాళ కుట్టి అనుపమ పరమేశ్వరన్, మరో బ్యూటీ కావ్య థాపర్ రవితేజకు జోడీగా కనిపించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టిజి విశ్వ ప్రసాద్, వివేక్ కూచి బోట్ల తెరకెక్కించారు. నవదీప్, వినయ్ రాయ్, మధుబాల, అవసరాల శ్రీనివాస్, అజయ్ ఘోష్, శ్రీనివాస రెడ్డి కీలక పాత్రలు చేశారు. ఈగల్ మూవీతో దేవ్ జాండ్ అనే వ్యక్తి సంగీత దర్శకుడిగా టాలీవుడ్‌కు పరిచయమ్యాడు. ఈ సినిమా ట్రైలర్, టీజర్‌తో మంచి హైప్ సృష్టించింది. తొలి రోజు మంచి ఓపెనింగ్స్ రాబట్టుకుందీ. దీంతో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ కండక్ట్ చేసింది.
ఈ సక్సెస్ మీట్‌లో చిత్ర యూనిట్‌తో పాటు రవితేజతో బచ్చన్ మూవీ తెరకెక్కిస్తున్న దర్శకుడు హరీష్ శంకర్ కూడా పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ సినిమా రివ్యూ ఇచ్చిన ఓ వెబ్ సైట్‌పై ఫైర్ అయ్యాడు.‘అందరికీ అన్ని సినిమాలు నచ్చాలని రూల్ లేవు. ఇండస్ట్రీ అంటే కేవలం యాక్టర్స్, టెక్నీషియన్లే కాదూ .. జర్నలిస్టులు కూడా. సినిమా నచ్చకపోతే.. వదిలేయండి..ఇలాంటి రేటింగ్స్, ఇలాంటి కామెంట్స్ చేయడం ఏంటీ. క్రిటిసిజం, ట్రోలింగ్‌కు తేడా లేకుండా పోతుంది. ఎద్దేవా చేయండి కానీ ఎగతాళి చేస్తున్నారు’ అంటూ స్పీచ్ అదరగొట్టేశాడు. అలాగే తనపై వార్తా కథనాలు రాయడంపై ఎగతాళిగా మాట్లాడారు.
సెటైర్స్ బాగానే పేలాయి కానీ.. ఓ మూవీని హిట్, ఫెయిల్ అని తేల్చేది ప్రేక్షకుడు అన్న విషయాన్ని మరిచిపోయి.. మొత్తం తప్పును వెబ్ సైట్ దే అన్నట్లు మాట్లాడాడు. మాస్ మహారాజ్ అనగానే..ఎక్ట్ పెక్టేషన్స్ ఎలా ఉంటాయో సగటు ప్రేక్షకుడికి తెలుసు. సినిమా నచ్చితే.. ఎలాంటి వెబ్ సైట్ రాతల్ని, అది ఇచ్చే రేటింగ్‌ను పట్టించుకోరు ప్రేక్షకులు. ఎంత నెగిటివిటీ వచ్చినా.. మూవీ బాగుంది అన్న టాక్ వస్తే చాలు కచ్చితంగా హిట్ అందించే తీరుతారు. అల్రెడీ ఆ విషయం చాలా సినిమాల విషయంలో ప్రూవ్ కూడా అయ్యింది. రాతల్ని పక్కన పెట్టి మౌత్ పబ్లిసిటీ ద్వారా ఎన్నో చిత్రాలు హిట్టే కాదూ సూపర్ హిట్టు కూడా కొట్టాయి. అంతే కానీ రివ్యూ, రేటింగ్స్, కామెంట్స్ కారణంగా మూవీ డిసైడ్ చేస్తున్నారంటూ కామెంట్స్ చేయడం ఎంత వరకు సబబు అని ఫీలవుతున్నారు జనాలు.
దర్శకుడిగా మీ ప్రస్టేషన్ సరైనదే అయినప్పటికీ.. మీరు చెప్పినట్లే.. ప్రతి సినిమా.. ప్రతి ఒక్కరికి నచ్చాల్సిన అవసరం లేదు. సినిమా అనేది ప్రేక్షకుడి కోణంలో ఆలోచించే రేటింగ్స్ ఉంటాయి. ఈ చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారో అనుకుంటున్నారు. హరీష్ శంకర్ మాటలు, స్పీచ్ చాలా బాగుంది కానీ.. ఈగల్ మూవీకి ఎంత వరకు హైప్ ఇస్తుందేమో చూడాలి. మరీ ఈగల్ ఎగురుద్దంటారా..? కొన్ని రోజులు పోతే.. ప్రేక్షకులు డిసైడ్ చేస్తారు. ప్రస్తుతం మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ తొలి రోజు భారీ కలెక్షన్లను రాబట్టుకుంది. ఈ మూడు రోజులుగా ప్రపంచ వ్యాప్తంగా సుమారు రూ. 30 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టుకుంది.