iDreamPost
android-app
ios-app

థియేటర్స్ లో ముందుగానే మిస్టర్ బచ్చన్! బాగా స్పీడ్ మీద ఉన్నారు!

  • Published Aug 12, 2024 | 3:40 PM Updated Updated Aug 12, 2024 | 3:40 PM

Harish Shankar- Ravi Teja Mr Bachchan Special Show: హరీశ్ శంకర్- మాస్ మహారాజ రవితేజ కాంబోలో వస్తున్న మిస్టర్ బచ్చన్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే వీళ్లు తీసుకున్న ఈ నిర్ణయం చూస్తే బొమ్మ బ్లాక్ బస్టర్ అంటూ టాక్ వచ్చేసింది.

Harish Shankar- Ravi Teja Mr Bachchan Special Show: హరీశ్ శంకర్- మాస్ మహారాజ రవితేజ కాంబోలో వస్తున్న మిస్టర్ బచ్చన్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే వీళ్లు తీసుకున్న ఈ నిర్ణయం చూస్తే బొమ్మ బ్లాక్ బస్టర్ అంటూ టాక్ వచ్చేసింది.

  • Published Aug 12, 2024 | 3:40 PMUpdated Aug 12, 2024 | 3:40 PM
థియేటర్స్ లో ముందుగానే మిస్టర్ బచ్చన్! బాగా స్పీడ్ మీద ఉన్నారు!

మిస్టర్ బచ్చన్.. ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రాల్లో ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది. హరీశ్ శంకర్- మాస్ మహరాజ రవితేజ కాంబోలో వస్తున్న ఈ మూవీపై భారీగానే అంచనాలు ఉన్నాయి. రవితేజ మాస్ కి.. హరీశ్ శంకర్ ఎనర్జీ తోడైతె బొమ్మ బ్లాక్ బస్టర్ అంటూ మొదటి నుంచి అభిప్రాయాలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇంక మూవీపై హరీశ్ శంకర్ కు ఉన్న కాన్ఫిడెన్స్ నెక్ట్స్ లెవల్ అనే చెప్పాలి. రైడ్ సినిమాకి రీమేక్ కదా అంటే.. నా మూవీ రిలీజ్ అయ్యాక కూడా అదే మాట చెప్పండి అప్పుడు చూద్దాం అంటూ గట్టిగా కొట్టబోతున్నాం అంటూ సంకేతాలు ఇచ్చేశాడు. ఇప్పుడు ఇంకో అడుగు ముందుకేసి మూవీపై తమకు ఉన్న కాన్ఫిడెన్స్ ఏ రేంజ్ లో ఉంది అనే విషయాన్ని తెలిసేలా చేశాడు.

మిస్టర్ బచ్చన్ సినిమా నుంచి ఇప్పటికే చాలా అప్ డేట్స్ వచ్చాయి. వాళ్లు ఇస్తున్న ఒక్కో అప్ డేట్ మూవీపై అంచనాలను ఒక్కో మెట్టు ఎక్కిస్తూనే ఉంది. పోస్టర్స్, సాంగ్స్, షో రీల్, ట్రైలర్ ఇలా దేనికి అదే అని చెప్పాలి. ఈ మూవీలో ఇన్ కమ్ ట్యాక్స్ ఆఫీసర్ గా రవితేజను చూడబోతున్నాం. ఆయనకు జోడీగా భాగ్యశ్రీ బోర్సే నటించింది. రవితేజ ఎనర్జీని మ్యాచ్ చేస్తూ ఆమె చెప్పిన డైలాగులు, వేసిన స్టెప్పులు తెలుగు ప్రేక్షకుల్లో ఆమె క్రేజ్ అమాంతం పెంచేశాయి. పైగా తెలుగులో తొలి చిత్రానికే సొంతంగా డబ్బింగ్ చెప్పుకుని టాలీవుడ్ ప్రేక్షకులను మరింత మెప్పించేసింది. ఇవన్నీ కేవలం సినిమా గురించి చెప్పడానికే. కానీ, సినిమాపై టీమ్ ఉన్న నమ్మకం చెప్పడానికి వాళ్లు తీసుకున్న ఈ నిర్ణయం చాలు. ఒకరోజు ముందే స్పెషల్ షోస్ వేస్తున్నాం అని వాళ్లు చేసిన ప్రకటన సరిపోతుంది.

MR BAchan

ఆగస్టు 15న వరల్డ్ వైడ్ గా మిస్టర్ బచ్చన్ సినిమా విడుదల కాబోతోంది. అయితే అంతకన్నా ఒక రోజు ముందే.. అనగా ఆగస్టు 14న సాయంత్రం మిస్టర్ బచ్చన్ నుంచి ఒక స్పెషల్ షో వేస్తున్నారు. సినిమా మీద అపారమైన నమ్మకం ఉన్నప్పుడే ఇలాంటి ఒక నిర్ణయం తీసుకోగలుగుతారు. ఎందుకంటే ఈ షో నుంచి టాక్ మీద మూవీ ఓపెనింగ్స్ కూడా ఆధారపడి ఉంటాయి. మిస్టర్ బచ్చన్ సినిమా బొమ్మ బ్లాక్ బస్టర్ అనే నమ్మకం ఉండబట్టే.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ- హరీశ్ శంకర్ ఈ నిర్ణయం తీసుకున్నారు అనుకోవచ్చు. పాజిటివ్ టాక్ వస్తే.. అది మొదటి రోజు ఆక్యుపెన్సీ, ఓపెనింగ్స్ మీద కూడా భారీ ప్రభావం చూపిస్తుంది. ఈ నేపథ్యంలోనే మిస్టర్ బచ్చన్ స్పీడ్ చూసి అభిమానులే కాదు.. తెలుగు సినిమా ప్రేక్షకులు మూవీ అప్పుడే హిట్టు అయిపోయింది అని ఫిక్సవుతున్నారు. మరి.. మిస్టర్ బచ్చన్ స్పెషల్ షోస్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom