iDreamPost
android-app
ios-app

హనుమాన్ USA కలెక్షన్స్

  • Published Mar 07, 2024 | 8:40 PM Updated Updated Mar 07, 2024 | 8:40 PM

HanuMan: ఇండియన్ సూపర్ హీరో కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా భారీ విజయం సాధించింది. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాలో తేజ సజ్జా హీరోగా నటించగా యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించారు.

HanuMan: ఇండియన్ సూపర్ హీరో కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా భారీ విజయం సాధించింది. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాలో తేజ సజ్జా హీరోగా నటించగా యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించారు.

  • Published Mar 07, 2024 | 8:40 PMUpdated Mar 07, 2024 | 8:40 PM
హనుమాన్ USA కలెక్షన్స్

ఈ సంవత్సరం తెలుగు సినీ పరిశ్రమ నుండి ఎవరూ ఊహించని స్థాయిలో సర్ప్రైజ్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన సినిమా “హనుమాన్”. ఇండియన్ సూపర్ హీరో కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా భారీ విజయం సాధించింది. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాలో తేజ సజ్జా హీరోగా నటించగా యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించారు. సినిమా యూనిట్ మొత్తానికీ ఎంతో మంచి పేరుని తెచ్చిపెట్టిన హనుమాన్ సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదలైన సినిమాల్లో బిగ్గెస్ట్ హిట్ అనిపించుకుంది.

కాగా తొలి రోజు నుంచే ఈ సినిమా విడుదలైన తెలుగు రాష్ట్రాలతో పాటు నార్త్ అమెరికాలోనూ భారీ వసూళ్లు రాబట్టింది. కాగా యూఎస్ బాక్సాఫీస్ వద్ద రన్ కంప్లీట్ చేసుకున్న హనుమాన్ యూఎస్‌లో మొత్తం 44 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించింది. కొత్త తరహా సినిమాలని ఎప్పుడూ ఆదరించే యూఎస్‌ ప్రేక్షకులు హనుమాన్ సినిమాని బాగా ఆదరించారు. నిజానికి విడుదలకి ముందు ఈ సినిమా ఈ స్థాయిలో విజయవంతం అవుతుందని ఎవరూ అనుకోలేదు. ఈ సినిమా ట్రేడ్ వర్గాల వారు కూడా ఊహించని రీతిలో హిట్ అయింది.

తెలుగు, హిందీ, తమిళ వెర్షన్స్ అన్నీ కలుపుకుని
యూఎస్ కరెన్సీలో 5.312 మిలియన్ డాలర్స్ ని రాబట్టిన హనుమాన్… మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 300 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది. ఇక ధియేటర్లలో సూపర్బ్ లాంగ్ రన్ చూసిన తరువాత ఈ శుక్రవారం, మార్చి 8న ఓటీటీ ఫ్లాట్ ఫామ్ జీ5 లో విడుదల కానుంది. కాగా ఇటీవల జరిగిన సక్సెస్ మీట్ లో దర్శకుడు ప్రశాంత్ వర్మ హనుమాన్ సినిమాని రిమాస్టర్ చేసి త్వరలోనే మళ్ళీ విడుదల చేస్తామని చెప్పారు. 3D లో కూడా ఈ సినిమా విడుదల కానుందని, హనుమంతుడికి సంభందించిన మరిన్ని సన్నివేశాలు, ఫైట్లు ఈ వెర్షన్ లో ఉంటాయని టాక్.

హనుమాన్: బ్లాక్ బస్టర్ ఫ్రమ్ ఆంధ్రా టు అమెరికా

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet GirişgrandpashabetJOJOBET GİRİŞLERİ