iDreamPost
android-app
ios-app

హనుమాన్ లో రాకేశ్ మాస్టర్ కి సూపర్ క్యారెక్టర్! కన్నీళ్లు తెప్పించే నిజం!

ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ ఇటీవల అనారోగ్య కారణాలతో మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా హనుమాన్ మూవీ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ రాకేష్ మాస్టర్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ ఇటీవల అనారోగ్య కారణాలతో మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా హనుమాన్ మూవీ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ రాకేష్ మాస్టర్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

హనుమాన్ లో రాకేశ్ మాస్టర్ కి సూపర్ క్యారెక్టర్! కన్నీళ్లు తెప్పించే నిజం!

డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం హనుమాన్. బాలనటుడిగా వెండితెరపై రానించిన తేజ సజ్జ నేడు సిల్వర్ స్క్రీన్ పై తన జర్నీ మొదలు పెట్టాడు. ఇప్పటికే పలు సినిమాల్లో నటించిన తేజ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్న హనుమాన్ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, టీజర్లకు ఆడియెన్స్ నుంచి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. జనవరి 12న ఈ సినిమా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ ఈ ఏడాది మరణించిన విషయం తెలిసిందే. పలు అనారోగ్య కారణాలతో ఆయన ఈ లోకాన్ని విడిచివెళ్లిపోయారు. అయితే రాకేష్ మాస్టర్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరెక్కించిన హనుమాన్ సినిమాలో ముఖ్యపాత్రలో నటించినట్లు తెలిపారు. హనుమాన్ లో రాకేశ్ మాస్టర్ కి సూపర్ క్యారెక్టర్ పడిందని ప్రశాంత్ వర్మ వెల్లడించారు. దురదృష్టవశాత్తు ఆయన మృతి చెందారు కానీ ఈ సినిమా అనంతరం రాకేష్ మాస్టర్ కు వరుస సినిమా అవకాశాలు వచ్చేవని తెలిపాడు. హనుమాన్ సినిమా రాకేష్ మాస్టర్ కు బ్రేక్ ఇచ్చేదని ఆయన సినీ కెరీర్ లో మరింత బిజీగా మారిపోయేవారని ప్రశాంత్ వర్మ తెలిపారు. రాకేష్ మాస్టర్ హనుమాన్ చిత్రంలో చేసిన క్యారెక్టర్ కు అది చూసిన వారు ఇక నుంచి ఈయనకు మంచి కెరియర్ ఉండబోతోందని మంచి ఆర్టిస్టుగా బిజీ అయిపోతారని అన్నట్లు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెలిపాడు.

ఇక తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో రాకేష్ మాస్టర్ కొరియోగ్రాఫర్ గా తన సత్తా ఏంటో నిరూపించుకున్నారు. పలు చిత్రాలకు డ్యాన్స్ కొరియోగ్రాఫర్ గా వ్యవహరించారు. అంతేకాదు ఎంతో మందికి డ్యాన్స్ నేర్పించి గురువు అవతారం ఎత్తారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లాంటి హీరోలకు సైతం డ్యాన్స్ నేర్పించారు. ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ కొరియోగ్రాఫర్స్ గా దూసుకెళ్తున్న శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ లు ఆయన శిష్యులే. ఇలా ఎంతోమందికి కెరియర్ ను సెట్ చేశారు. అప్పటికే ఓ వెలుగు వెలిగిన రాకేష్ మాస్టర్ ఆ తర్వాత సినీ అవకాశాలు తగ్గడంతో ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఆ తరువాత మద్యానికి బానిసై అనారోగ్యానికి గురై ఆసుపత్రిపాలయ్యారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ ఏడాది జూన్ లో తుదిశ్వాస విడిచారు. మరి రాకేష్ మాస్టర్ జీవించి ఉంటే తన కెరీర్ వేరే లెవల్ ఉండేదన్న డైరెక్టర్ ప్రశాంత్ వర్మ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.